Sakshi News home page

సీతారామం

Published Thu, Apr 18 2024 10:55 AM

- - Sakshi

భాగ్యనగరం..

పురానాపూల్‌ వద్ద శోభాయాత్రలో పాల్నొన్న భక్తులు

జై శ్రీరామ్‌ నినాదాలతో నగరం మార్మోగింది. బుధవారం శ్రీరామనవమి వేడుకలు గ్రేటర్‌ వ్యాప్తంగా కన్నుల పండువగా జరిగాయి. అన్ని ప్రధాన ఆలయాల్లో రాములోరి పెళ్లి వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణం తర్వాత అన్నిచోట్లా అన్నదానం చేశారు. ఇక భాగ్యనగర్‌ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరాముడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. చారిత్రాత్మక సీతారామ్‌బాగ్‌ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర భక్తుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, జెండాలు, ఆటపాటల కోలాహలం మధ్య కోఠి హనుమాన్‌ టేక్డి వరకు సాగింది. ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆధ్వర్యంలో ధూల్‌పేట్‌ గంగాబౌలి, ఆకాష్‌పురి హనుమాన్‌ ఆలయం నుంచి, ఆనంద్‌సింగ్‌ ఆధ్వర్యంలో మంగళ్‌హాట్‌ మాగ్రా నుంచి కూడా శోభాయాత్రలు చేపట్టగా..ఇవి మూడు లక్షలాది మంది రామభక్తుల సందడి మధ్య హనుమాన్‌ టేక్డికి చేరుకున్నాయి. భారీ శ్రీరాముడు, హనుమాన్‌ విగ్రహాలు, కాషాయ రంగు జెండాలు, బైకులపై యువత విన్యాసాలతో శోభాయాత్ర ఆద్యంతం అత్యంత కోలాహలంగా జరిగింది. – అబిడ్స్‌

లంగర్‌హౌజ్‌ వద్ద బాలరాముడి ఊరేగింపు
1/3

లంగర్‌హౌజ్‌ వద్ద బాలరాముడి ఊరేగింపు

2/3

3/3

Advertisement

homepage_300x250