Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

సాక్షి మనీ మంత్ర: గ్రీన్‌లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Thu, Apr 18 2024 9:20 AM

Stock Market Rally On Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 96 పాయింట్లు లాభపడి 22,245కు చేరింది. సెన్సెక్స్‌ 280 పాయింట్లు దిగజారి 73,219 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.93 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 87.4 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.58 శాతం నష్టాలపాలైంది. నాస్‌డాక్‌ 1.15 శాతం దిగజారింది.

భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. 2024లో 6.8%, 2025లో 6.5% మేర భారత్‌ వృద్ధి నమోదు చేస్తుందని ఇటీవల విడుదలైన ఐఎమ్‌ఎఫ్‌ నివేదిక అంచనా వేసింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250