Sakshi News home page

adsolute video ad after first para

సాక్షి మనీ మంత్ర: తీవ్ర ఒడుదొడుకులు.. గ్రీన్‌లో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Fri, Apr 19 2024 3:32 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. కానీ చివరికు లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 22,149 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 599 పాయింట్లు ఎగబాకి 73,088 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఎం అండ్‌ ఎం, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, టాటా ‍స్టీల్‌, టెక్‌ మహీంద్రా, టైటాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ కంపెనీ షేర్లు భారీగా లాభపడిన జాబితాలో ఉన్నాయి. 

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా మోటార్స్‌, నెస్లే, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏషియన్‌ పెయింట్స్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. యుద్ధభయాలు విస్తరించడంతోపాటు ఫెడ్‌ ఛైర్మన్‌ కీలక వడ్డీ రేట్ల పెంపుపై వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. దాంతో మార్కెట్‌ ఈ రోజు సెషన్‌లో తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. చివరకు మార్కెట్లు గ్రీన్‌లోనే ముగిశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

adsolute_video_ad

homepage_300x250