Sakshi News home page

అప్పట్లో చాపర్‌.. ఇప్పుడు కమాండర్‌

Published Tue, May 7 2024 2:50 PM

అప్పట్లో చాపర్‌.. ఇప్పుడు కమాండర్‌

యర్రగొండపాలెం: దట్టమైన నల్లమల అభయారణ్యంలో ఉన్న పాలుట్ల గిరిజన గూడెం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. మైదాన ప్రాంతం నుంచి పాలుట్ల చేరుకోవడానికి సరైన రోడ్డు మార్గం లేదు. మొనదేలిన బండ రాళ్లతో కూడిన దారిలోనే అక్కడికి చేరుకోవాలి. పోలింగ్‌ ముగిసిన తర్వాత రాత్రి వేళ అడవిలో ప్రయాణించడం ప్రమాదకరం కావడంతో 1999లో అప్పటి ప్రభుత్వం హెలికాఫ్టర్‌ కేటాయించింది. ఎన్నికల సామగ్రితోపాటు సిబ్బందిని హెలికాఫ్టర్‌లో పాలుట్ల తీసుకెళ్లి పోలింగ్‌ నిర్వహించారు. ఆ తర్వాత ఎన్నికల నుంచి పాలుట్ల వెళ్లేందుకు ప్రత్యేక కమాండర్‌ జీపులను వినియోగిస్తున్నారు.

Advertisement

homepage_300x250