Sakshi News home page

adsolute video ad after first para

document.addEventListener("DOMContentLoaded", function() { var newsContent = document.querySelector(".news-story-content"); var paragraphs = Array.from(newsContent.querySelectorAll("p")); var firstParagraph = paragraphs.findIndex(function(paragraph) { return !paragraph.closest('.bullet_list'); },1); if (firstParagraph) { var secondParagraph = paragraphs[firstParagraph + 1]; var script = document.createElement("script"); script.async = true; script.id = "AV62ff84d96d945e7161606a7a"; script.type = "text/javascript"; script.src = "https://tg1.playstream.media/api/adserver/spt?AV_TAGID=62ff84d96d945e71…"; secondParagraph.parentNode.insertBefore(script, secondParagraph.nextSibling); } });

పునరుత్పాదక విద్యుత్‌లో అదానీ గ్రీన్‌ ఎనర్జీ రికార్డు

Published Thu, Apr 4 2024 6:16 AM

Adani Green becomes first Indian firm with 10K MW renewable energy capacity - Sakshi

దేశంలో తొలిసారిగా 10 వేల మెగావాట్ల  సామర్థ్యం  

న్యూఢిల్లీ: దేశీయంగా 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తొలి కంపెనీగా తమ సంస్థ నిలి్చందని అదానీ గ్రీన్‌ ఎనర్జీ (ఏజీఈఎల్‌) తెలిపింది. గుజరాత్‌లోని ఖావ్డా సోలార్‌ పార్క్‌లో 2,000 మెగావాట్ల  సౌర విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటు ద్వారా దీన్ని సాధించినట్లు సంస్థ వివరించింది.

ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 7,393 మెగావాట్ల సౌర విద్యుత్, 1,401 మెగావాట్ల  పవన విద్యుత్, 2,140 మెగావాట్ల  విండ్‌–సోలార్‌ హైబ్రిడ్‌ ప్లాంట్లు (మొత్తం 10,934 మెగావాట్ల ) ఉన్నాయి. 2030 నాటికల్లా 45 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ నిర్దేశించుకుంది.

Advertisement

adsolute_video_ad

homepage_300x250