Sakshi News home page

Lok sabha elections 2024: ముహూర్తం మించిపోయింది...

Published Fri, Apr 19 2024 6:29 AM

Lok sabha elections 2024: Gujarat BJP chief misses Vijay Muhurat due to crowd at road show - Sakshi

నవ్‌సారి(గుజరాత్‌): ‘గురువారం మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాలు. దివ్యమైన ముహూర్తం. సరిగ్గా ఈ సమయానికి ఏది ప్రారంభించినా విజయం ఖాయం’ఇది పూజారి జిగర్‌ జానీ చెప్పిన మాట. ముహూర్త బలాన్ని బలంగా నమ్మే గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ నవ్‌సారి లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ వేయాలనుకున్నారు. సీఎం భూపేంద్ర పటేల్‌ తదితర ప్రముఖులు వెంటరాగా నవ్‌సారిలోని పార్టీ కార్యాలయం నుంచి గురువారం ఉదయం రోడ్‌ షోతో కలెక్టరేట్‌కు బయలుదేరారు.

కార్యక్రమానికి భారీగా జనం తరలిరావడంతో అనుకున్న సమయానికి ఆయన కాన్వాయ్‌ కలెక్టరాఫీసుకు చేరుకోలేకపోయింది. విజయ ముహూర్తం మించిపోవడంతో పాటిల్‌ నామినేషన్‌ వేయకుండానే వెనుదిరిగారు. మళ్లీ అదే పూజారి నిర్ణయం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం అదే 12.39 గంటలకు పాటిల్‌ నామినేషన్‌ దాఖలు చేస్తారని సన్నిహితులు తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై దాదాపు 6.89 లక్షల ఓట్ల తేడాతో పాటిల్‌ ఘన విజయం సాధించారు.

Advertisement

homepage_300x250