breaking news
-
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిష్ విరోచిత శతకంతో చెలరేగాడు. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ వంటి వారు విఫలమైన చోట స్టోయినిష్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. 211 పరుగుల భారీ లక్ష్య చేధనలో సీఎస్కే బౌలర్లను స్టోయినిష్ ఓ ఆట ఆడుకున్నాడు. తన విధ్వంసకర సెంచరీతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న స్టోయినిష్ 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 124 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో సీఎస్కేపై లక్నో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక సెంచరీతో మెరిసిన స్టోయినిష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖిచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే విజయవంతమైన రన్ ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా స్టోయినిష్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు పాల్ వాల్తాటి పేరిట ఉండేది. 2011 ఐపీఎల్ సీజన్లో సీఎస్కేపై లక్ష్య చేధనలో వాల్తాటి 120 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 124 పరుగులు చేసిన స్టోయినిష్.. వాల్తాటి ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. MARCUS STOINIS... THE HULK. 💪 - The winning celebrations from Stoinis and LSG says everything. 🔥pic.twitter.com/iGBHDNWDSU — Mufaddal Vohra (@mufaddal_vohra) April 23, 2024 -
శివాలెత్తిన శివమ్ దూబే.. వరల్డ్ కప్ టికెట్ పక్కా? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో దూబే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎప్పుడూ స్పిన్నర్లను టార్గెట్ చేసే దూబే.. ఈ మ్యాచ్‌లో మాత్రం లక్నో ఫాస్ట్ బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా లక్నో పేసర్ యష్ ఠాకూర్‌ను దూబే ఓ ఆట ఆడుకున్నాడు. 16 ఓవర్ వేసిన యష్ ఠాకూర్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న దూబే.. 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దూబేకు టీ20 వరల్డ్‌కప్ జట్టులో కచ్చితంగా చోటుదక్కుతుందని కామెంట్లు చేస్తున్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో దూబే అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన దూబే.. 51.83 సగటుతో 311 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్ జట్టులో హార్దిక్ పాండ్యా స్ధానంలో దూబేకు ఛాన్స్ ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. pic.twitter.com/uaqdwKYbWm — Cricket Videos (@cricketvid123) April 23, 2024 -
రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర సెంచరీ..12 ఫోర్లు, 3 సిక్స్‌లతో! వీడియో
ఐపీఎల్-2024లో చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్లను రుతురాజ్ ఓ ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 54 బంతుల్లోనే గైక్వాడ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 60 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. గైక్వాడ్‌కు ఇది తన ఐపీఎల్ కెరీర్లో రెండో సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి సీఎస్కే 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శివమ్ దూబే మరోసారి తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో మాట్ హెన్రి, యశ్ ఠాకూర్, మోహ్షిన్ ఖాన్ తలా వికెట్ సాధించారు. The Guiding Star! 🌟🦁#CSKvLSG #WhistlePodu 🦁💛 pic.twitter.com/aUsekAgySQ — Chennai Super Kings (@ChennaiIPL) April 23, 2024 -
కుటుంబంలో పెను విషాదం.. అందుకే ఆ నిర్ణయం: రైనా
‘‘అప్పుడు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందుకే పంజాబ్‌కు వెళ్లాల్సి వచ్చింది. మా అంకుల్ కుటుంబంలో మరణాలు సంభవించాయి. ఒంటికి నూనె రాసుకుని దాడులకు పాల్పడే కచ్చా గ్యాంగ్.. గ్యాంగ్స్టర్స్ వాళ్ల కుటుంబం మొత్తాన్ని చంపేశారు. అప్పుడు మా బామ్మ కూడా అక్కడే ఉంది. పఠాన్‌కోట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. అందుకే నేను అక్కడికి వెళ్లాను. అప్పటికే ఐపీఎల్లో బయో బబుల్ నిబంధనలు మొదలయ్యాయి. కాబట్టి తిరిగి జట్టుతో కలిసే పరిస్థితి లేదు. ఆ ఘటనతో మా నాన్న అప్పటికే నైరాశ్యంలో మునిగిపోయారు. అప్పుడు నాకు నా కుటుంబమే మొదటి ప్రాధాన్యంగా కనిపించింది. క్రికెట్ కావాలంటే ఎప్పుడైనా ఆడుకోవచ్చు. కష్టకాలంలో మాత్రం ఫ్యామిలీకి అండగా ఉండాలని ఆలోచించాను. ఈ విషయాన్ని నేను ఎంఎస్ ధోని, మేనేజ్మెంట్కు చెప్పాను. అందుకే జట్టును వీడాను. నేను తిరిగి వచ్చిన తర్వాత 2021 సీజన్ ఆడాను. 2021లో ట్రోఫీ గెలిచాం. అయితే, అంతకు గతేడాది ముందు మా కుటుంబంలో ఇలాంటి పెను విషాదం చోటుచేసుకుంది. అప్పటికే కోవిడ్-19 కారణంగా అందరూ డిప్రెషన్లో మునిగిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో ఇలా ఆప్తులను కోల్పోవడం నిజంగా మా అందరినీ కుంగదీసింది. కాబట్టి ఆట కంటే ఫ్యామిలీ వైపే మొగ్గుచూపాను’’ అని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్-2020 ఆరంభానికి ముందే జట్టును వీడేందుకు గల కారణాలను తాజాగా లలన్‌టాప్ షోలో వెల్లడించాడు. విపత్కర పరిస్థితుల్లో కుటుంబానికి తోడుగా ఉండేందుకు ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యానని రైనా చెప్పుకొచ్చాడు. అయితే, మరుసటి ఏడాది తిరిగి వచ్చిన తర్వాత సీఎస్కే మరోసారి చాంపియన్‌గా నిలవడం సంతోషాన్నిచ్చిందని రైనా హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2020లో చెన్నై దారుణ ప్రదర్శనతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఆరు గెలిచి పాయింట్ల పట్టిక(అప్పటికి ఎనిమిది జట్లు)లో ఏడో స్థానంలో నిలిచింది. రైనాతో పాటు కీలక ఆటగాళ్లు దూరం కావడంతో విఫలమై పరాభవం మూటగట్టుకుంది. అయితే, 2021లో విజేతగా నిలిచి నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది సీఎస్కే. 2022లో మళ్లీ దారుణంగా ఆడి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానాని(పద్నాలుగు గెలిచినవి నాలుగు)కి దిగజారిన సీఎస్కే అనూహ్య రీతిలో గతేడాది ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది. ఇక ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేశ్ రైనా తన ఐపీఎల్ కెరీర్లో 205 మ్యాచ్‌లు ఆడి 5528 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. తన ఆట తీరుతో రైనా ‘మిస్టర్ ఐపీఎల్’గా ప్రసిద్ధి పొందాడు. అదే విధంగా ‘చిన్న తలా’గా సీఎస్కే ఫ్యాన్స్ అభిమానం పొందాడు. కాగా రైనా ధోనికి అత్యంత ఆప్తుడన్న విషయం తెలిసిందే. చదవండి: T20 Captain: ‘రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఎనీ డౌట్?’ -
CSK Vs LSG: ఐపీఎల్లో నేడు మరో ఆసక్తికర సమరం
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 23) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఢీకొట్టనుంది. చెన్నై హోం గ్రౌండ్ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ప్రస్తుత సీజన్లో చెన్నై 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. లక్నో సైతం 7 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి ఐదో స్థానంలో నిలిచింది. సీఎస్కేతో పోలిస్తే లక్నో రన్‌రేట్ కాస్త తక్కువగా ఉంది. హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో సీఎస్కే ఒకటి, లక్నో రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఐపీఎల్లో దాదాపు అన్ని జట్లపై మెరుగైన రికార్డు ఉన్న సీఎస్కే లక్నో విషయంలో కాస్త వెనుకపడి ఉంది. బలాబలాల విషయానికొస్తే.. ఈ సీజన్లో ఇరు జట్ల బలాబలాలు సమానంగా ఉన్నాయి. అన్ని విభాగాల్లో సీఎస్కే, లక్నో సమతూకంగా ఉన్నాయి. సీఎస్కేతో పోలిస్తే లక్నోలో బ్యాటింగ్ డెప్త్ కాస్త ఎక్కువగా ఉంది. ఈ జట్టు నిండా విధ్వంసకర వీరులే ఉన్నారు. సీఎస్కేలో చెప్పుకోదగ్గ హిట్టర్లు లేనప్పటికీ ఆ జట్టులో కచ్చితత్వం ఉంది. అందరూ కలిసికట్టుగా ఆడతారు. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో సీఎస్కేకు బౌలింగే బలం. పేసర్లు పతిరణ, ముస్తాఫిజుర్, తుషార్ దేశ్‌పాండే అద్భుతంగా రాణిస్తున్నారు. జడేజా,మొయిన్ అలీ తమ స్థానాలకు న్యాయం చేస్తున్నారు. లక్నో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సంచలన పేసర్ మయాంక్ యాదవ్ జట్టుకు దూరమైనప్పటి (గాయం) నుంచి లక్నో పేస్ విభాగం బలహీనపడింది. యశ్ ఠాకూర్, మొహిసిన్ ఖాన్ అడపాదడపా రాణిస్తున్నారు. కొత్తగా జట్టులోకి వచ్చిన మ్యాట్ హెన్రీపై లక్నో భారీ ఆశలు పెట్టుకుంది. రవి బిష్ణోయ్ తేలిపోతుండటం లక్నోను మరింత కలవరపెడుతుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. తుది జట్లు (అంచనా).. లక్నో: కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, మ్యాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, యష్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్ [ఇంపాక్ట్ ప్లేయర్: దేవదత్ పడిక్కల్] సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరణ [ఇంపాక్ట్ ప్లేయర్: తుషార్ దేశ్‌పాండే]
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019