
ఏక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది.

177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్(53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డికాక్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు.
























