
ఆ ఆరు వచ్చి ఉంటే ‘పది’ దాటేవాళ్లం

ప్యారిస్ ఒలింపిక్స్‌లో అదృష్టం కూడా కలిసి వచ్చి ఉంటే భారత్ పతకాల సంఖ్య రెండంకెలు దాటేది.

ఇప్పటికే ఐదు పతకాలు నెగ్గిన భారత్ త్రుటిలో నాలుగు కాంస్య పతకాలను కోల్పోయింది.

షూటర్లు అదరగొట్టగా... ఆర్చరీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో మనవాళ్లు నిరాశ పరిచారు.

కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న ఆటగాళ్లు తడబడ్డారు.

మరో ఆరుగురు ప్లేయర్లు నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో మెడల్ చేజార్చుకున్నారు.

లక్ష్య సేన్- బ్యాడ్మింటన్ - పురుషుల సింగిల్స్

అర్జున్ బబూతా -షూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్

అంకిత భకత్– బొమ్మదేవర ధీరజ్- ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్

మనూభాకర్ - షూటింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్

మహేశ్వరీ చౌహాన్ – అనంత్‌జీత్ సింగ్ - షూటింగ్ స్కీట్ మిక్స్‌డ్ టీమ్

మీరాబాయి చానూ - వెయిట్ లిఫ్టింగ్ - మహిళల 49 కేజీలు

ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒక రజతం, నాలుగు కాంస్యాలు దక్కాయి.