సివిల్‌ సర్వీసెస్‌కు ప్రిపేర్‌ అవ్వాలనుకుని.. ఒలింపిక్‌ మెడల్‌ గెలిచి! (ఫొటోలు) | Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 2024 | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

సివిల్‌ సర్వీసెస్‌కు ప్రిపేర్‌ అవ్వాలనుకుని.. ఒలింపిక్‌ మెడల్‌ గెలిచి! (ఫొటోలు)

Published Mon, Jul 29 2024 1:27 PM | Last Updated on

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 20241
1/22

మూడేళ్ల క్రితం మనూ భాకర్‌ టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది. 19 ఏళ్ల ఒక అమ్మాయి మెగా ఈవెంట్‌లో మొదటిసారి... అదీ మూడు ఈవెంట్లలో పోటీ పడటం చిన్న విషయం కాదు.

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 20242
2/22

కానీ అసాధారణ ప్రతిభతో దూసుకొచ్చిన ఈ షూటర్‌ అలాంటి అవకాశం సృష్టించుకుంది. నిజానికి అప్పటి వరకు ఆమె సాధించిన ఘనతలే భాకర్‌పై అంచనాలు భారీగా పెంచేశాయి. చివరకు అదే ఒత్తిడి ఆమెను చిత్తు చేసింది.

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 20243
3/22

టోక్యో ఒలింపిక్స్‌కు ముందు వరకు పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకుంది. జూనియర్‌ వరల్డ్‌ కప్‌లో రెండు స్వర్ణాలు, యూత్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం, ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, వరల్డ్‌ కప్‌లలో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు... ఇలా ఈ జాబితా చాలా పెద్దది.

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 20244
4/22

దాంతో ఇదే జోరులో ఒలింపిక్‌ పతకం కూడా దక్కుతుందని అంతా ఆశించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇదేదో ఆటలో ఓటమిలా కాదు! క్వాలిఫయింగ్‌ పోటీల్లో కీలక సమయంలో భాకర్‌ పిస్టల్‌ సాంకేతిక సమస్యల కారణంగా పని చేయలేదు. దానిని సరిచేసుకొని వచ్చేసరికి ఆరు నిమిషాల కీలక సమయం వృథా అయింది.

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 20245
5/22

అయినా సరే 60 షాట్‌ల ద్వారా 575 పాయింట్లు సాధించడం విశేషం. చివరకు కేవలం రెండు పాయింట్ల తేడాతో ఫైనల్‌ అవకాశం కోల్పోయిన మను కన్నీళ్లపర్యంతమైంది. ఈ ప్రభావం మరో రెండు ఈవెంట్లపై పడి ఆమె కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది.

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 20246
6/22

ఒలింపిక్‌ పతకం ప్రతిభ ఉంటేనే కాదు... ధైర్యవంతులకే దక్కుతుంది! శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు ఓటమి భారంతో కుంగిపోయిన దశ నుంచి మళ్లీ పైకి లేవడం ఎంతో ధైర్యం ఉంటే తప్ప సాధ్యం కాదు. గొప్ప గొప్ప ఆటగాళ్లు కూడా ఇలాంటి పరాజయం తర్వాత కుప్పకూలిపోతారు.

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 20247
7/22

టోక్యో ఒలింపిక్స్‌ వైఫల్యం తర్వాత ఇతర షూటర్లు అపూర్వీ చండీలా, అభిషేక్‌ వర్మ, మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో ఆమె సహచరుడు సౌరభ్‌ చౌదరీ మళ్లీ కెరీర్‌లో ముందుకు వెళ్లలేక దాదాపుగా షూటింగ్‌కు దూరమయ్యారు. ఒకదశలో మనూ కూడా అలాగే ఆలోచించింది.

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 20248
8/22

షూటింగ్‌ తనలో ఆసక్తి రేపడం లేదని, ఇక ఆటకు గుడ్‌బై చెప్పి సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకుంది. కానీ సన్నిహితుల కారణంగా ‘చివరిసారిగా మళ్లీ ప్రయత్నిద్దాం’ అనే ఆలోచన మళ్లీ షూటింగ్‌లో కొనసాగేలా చేసింది.

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 20249
9/22

ఈసారి కూడా అంతే స్థాయిలో కఠోర సాధన చేసింది. ఏకాగ్రత చెదరకుండా ఒకే లక్ష్యానికి గురి పెట్టింది. దాంతో మళ్ళీ ఫలితాలు వచ్చాయి. జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో స్వర్ణం, వరల్డ్‌ కప్‌లలో రెండు కాంస్యాలు, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, కాంస్యాలు దక్కాయి.

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 202410
10/22

22 ఏళ్ల వయసులో మనూ భాకర్‌ ఇప్పుడు ఒలింపిక్‌ పతక విజేతగా తానేంటో నిరూపించుకుంది. గత ఒలింపిక్స్‌ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ సగర్వంగా నిలిచింది.

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 202411
11/22

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 202412
12/22

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 202413
13/22

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 202414
14/22

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 202415
15/22

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 202416
16/22

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 202417
17/22

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 202418
18/22

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 202419
19/22

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 202420
20/22

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 202421
21/22

Manu Bhaker Wins Indias 1st Medal Of Paris Olympics 202422
22/22

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement