1/22
సన్‌రైజర్స్ కంటే ముందు హైదరాబాద్ ఫ్రాంఛైజీ డెక్కన్ క్రానికల్ చేతిలో ఉండేది.
2/22
ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో డెక్కన్ చార్జర్స్ పేరిట హైదరాబాద్ జట్టు క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టింది.
3/22
అరంగేట్రంలో చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.
4/22
అయితే, ఆ మరుసటి ఏడాది అంటే 2009లో అనూహ్య రీతిలో పుంజుకుని ఏకంగా చాంపియన్‌గా అవతరించింది.
5/22
సౌతాఫ్రికాలో జరిగిన ఐపీఎల్-2009 ఫైనల్లో ఆర్సీబీని ఓడించి టైటిల్ గెలిచింది.
6/22
ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ సారథ్యంలో ట్రోఫీ అందుకుంది.
7/22
అప్పుడు రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా డెక్కన్ చార్జర్స్ వైస్ కెప్టెన్‌గా ఉండేవాడు.
8/22
అయితే, ఆ తర్వాత డెక్కన్ చార్జర్స్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది.
9/22
కాంట్రాక్ట్ నిబంధనలు ఉల్లంఘించిందనే కారణంగా 2012లో ఐపీఎల్ పాలక మండలి ఈ ఫ్రాంఛైజీని రద్దు చేసింది.
10/22
ఆ తర్వాత సన్ టీవీ నెట్‌వర్క్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ కోసం బిడ్ గెలిచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌గా పేరు మార్చుకుని బరిలోకి దిగుతోంది.
11/22
ఇక సన్‌రైజర్స్ మ్యాచ్‌లు అంటే కావ్యా మారన్ ఫేమస్.
12/22
సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, ఎస్‌ఆర్‌హెచ్ సీఈఓగా కావ్యా మారన్ ఫేమస్
13/22
సోషల్ మీడియాలో కావ్యకు విపరీతమైన ఫాలోయింగ్
14/22
అయితే, అంతకంటే ముందే హైదరాబాద్ ఫ్రాంఛైజీకి గాయత్రిరెడ్డి వల్ల ఫుల్ క్రేజ్
15/22
గాయత్రి రెడ్డి మరెవరో కాదు డెక్కన్ చార్జర్స్ యజమాని
16/22
డెక్కన్ క్రానికల్ అధినేత తిక్కవరపు వెంకట్రామిరెడ్డి కుమార్తె
17/22
డెక్కన్ చార్జర్స్ రూపకల్పనలో గాయత్రిరెడ్డిదే కీలక పాత్ర
18/22
వేలం మొదలు ఆటగాళ్ల మార్పులు, జెర్సీ లోగో, కలర్ ప్రతీ విషయంలోనూ గాయత్రి రెడ్డి ముద్ర
19/22
గాయత్రి రెడ్డి స్టేడియంలో ఉన్నారంటూ ఫ్యాన్స్ పండుగే
20/22
ఇప్పుడు కావ్యా మారన్ మాదిరే అప్పుడు గాయత్రి రెడ్డికి ఫ్యాన్స్ ఫాలోయింగ్
21/22
డెక్కన్ చార్జర్స్ కనుమరుగైన తర్వాత ఎక్కువగా కనిపించని గాయత్రి రెడ్డి
22/22
అయితే, ఏప్రిల్ 18న ఐపీఎల్‌కు 17 ఏళ్ల నిండిన సందర్భంగా డెక్కన్ చార్జర్స్, గాయత్రి రెడ్డిని గుర్తు చేసుకున్న అభిమానులు నెట్టింట ఆమె ఫొటోలు షేర్ చేస్తూ గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.గాయత్రి రెడ్డి.. వ్యాపారవేత్త అనీశ్ భాటియాను పెళ్లాడి గాయత్రి రెడ్డి భాటియాగా మారారు.