
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్ములేపుతున్నాడు.

ఇప్పటి వరకు లీగ్ దశలో ఆడిన 13 ఇన్నింగ్స్‌లో కలిపి 467 పరుగులు చేశాడు ఈ 23 ఏళ్ల లెఫ్టాండర్ బ్యాటర్.

పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మకు అతడి తండ్రే క్రికెట్‌లో ఓనమాలు నేర్పారు.

ఇక సన్‌రైజర్స్ తరఫున ఆడుతున్న అభిషేక్‌ను చీర్ చేసేందుకు అతడి తల్లి మంజు, సోదరి కోమల్ శర్మ ఎప్పుడూ అతడి వెంటే ఉంటారు.

స్టేడియంలో అభిషేక్‌తో కలిసి వీరు సందడి చేస్తారు.

ఇక ఆదివారం సన్‌రైజర్స్‌లో పంజాబ్‌తో మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే.

లీగ్ దశలో ఆఖరిదైన ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.

అభిషేక్ శర్మ 28 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం అభిషేక్ శర్మ, అర్స్‌దీప్ సింగ్ కాసేపు ముచ్చటించుకున్నారు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ డగౌట్ వరకూ వచ్చారు.

అక్కడ అభిషేక్ శర్మ తల్లి మంజు కనిపించగానే.. అర్ష్‌దీప్.. ‘‘అభిషేక్ శర్మను ఏమని దీవిస్తారో.. నన్ను కూడా అచ్చంగా అలాగే ఆశీర్వదించండి’’ అని కోరాడు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలను అభిషేక్ సోదరి కోమల్ షేర్ చేయగా వైరల్‌గా మారాయి.

కాగా ఇటీవల గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సమయంలో ఆ జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అభిషేక్ తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు అందుకున్న విషయం తెలిసిందే.


