1/10
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు 88 నియోజకవర్గాల నుంచి 1,202 మంది అభ్యర్థులు రెండో దశ లోక్‌సభ ఎన్నికలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వాళ్లలో చర్చనీయాంశమైన హేమాహేమీలు కొందరున్నారు.
2/10
ఉత్తరప్రదేశ్ మీరట్ నుంచి బీజేపీ తరఫున మాజీ నటుడు అరుణ్ గోవిల్ ఎన్నికల బరిలో నిలిచారు. రామానంద సాగర్ రామాయణం సీరియల్ ద్వారా ఈయన దేశవ్యాప్తంగా పేరును సంపాదించుకున్నారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ ద్వారా ఆయన ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మీరట్ గోవిల్ స్వస్థలం కాగా, ఇక్కడ ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులతో ఆయన పోటీ పడుతున్నారు.
3/10
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్. కేరళ తిరువనంతపురం నుంచి మూడోసారి బరిలో దిగారు. రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇక్కడ థరూర్‌తో ఇక్కడ తలబడబోతున్నారు.
4/10
మాజీ నటి, సిట్టింగ్ ఎంపీ హేమామాలిని మథుర(యూపీ) నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2014 నుంచి రెండుసార్లు ఆమె మథుర ఎంపీగా నెగ్గారు.
5/10
కేరళ వయనాడ్ లోక్‌సభ స్థానం దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తోంది. సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. క్రిమినల్ కేసు శిక్షతో ఆయన లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడి.. ఆ తర్వాత ఊరట లభించిన సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ తరఫున అభ్యర్థిగా ఆ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్ర, సీపీఎం తరఫున అన్నీ రాజా బరిలో నిల్చోవడంతో పోటీ రసవత్తరంగా మారింది.
6/10
కర్ణాటక బెంగళూరు సౌత్ నుంచి తేజస్వి యాదవ్ మరోసారి పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున గత ఎన్నికల్లోనూ పోటీ చేసి.. ఆ దఫా ఎన్నికల్లో ఎన్నికైన యువ ఎంపీగా ఆయన పేరు దక్కించుకున్నారు. గత ఐదేళ్లలో పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన సూర్య యాదవ్‌కు, కర్ణాటకలో అధికారం కోల్పోయిన బీజేపీకి ఈ స్థానం ప్రతిష్టాత్మకమనే చెప్పొచ్చు
7/10
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కేసీ వేణుగోపాల్‌కు కూడా ఈ ఎన్నికలు కీలకం. కేరళ అలప్పుజా నుంచి ఆయన బరిలో నిల్చున్నారు. 2009-19 మధ్య ఆయన ఈ స్థానం నుంచే రెండు పర్యాయాలు ఎంపీగా నెగ్గారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండగా, ఆ తర్వాతి ఏడాదే ఆయన రాజ్యసభ సభకు వెళ్లారు. అలప్పుజాలో సీపీఎం అభ్యర్థి ఏఎం అరిఫ్, బీజేపీ నుంచి శోభా సురేంద్రన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారాయన.
8/10
యువకుడైన ఓ స్వతంత్ర అభ్యర్థి రెండో దశ ఎన్నికల్లో దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించడం గమనార్హం. అతని పేరు రవీంద్ర సింగ్ భాటి. రాజస్థాన్ షియోపూర్ ఎమ్మెల్యే(ఇండిపెండెంట్). గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 వేల ఓట్లతో షియోపూర్ ఎమ్మెల్యేగా నెగ్గి హాట్ టాపిక్‌గా మారాడు. ఇప్పుడు బార్మర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ పోటీలో నిలిచాడు. సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి కైలాష్, కాంగ్రెస్ తరఫున ఉమ్మెదా రామ్ బెనివాల్ లాంటి ఉద్దండులతో రవీంద్ర తలపడబోతున్నాడు.
9/10
రాష్ట్ర రాజకీయాల్లో యువరక్తాన్ని ప్రొత్సహించే క్రమంలో.. ఈసారి లోక్‌సభ ఎన్నికల కోసం పలువురు సీనియర్ల ఢిల్లీ రాజకీయాల వైపు మళ్లించేందుకు బీజేపీ మొగ్గు చూపించింది. ఈ జాబితాలో ఉన్న ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్, రాజ్‌నందగావ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కిందటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో ఛత్తీస్‌గఢ్‌లో అధికారం కోల్పోవడంతో పాటు మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులతోనూ ఆయన వివాదాల్లో నిలిచారు.
10/10
వైభవ్ గెహ్లాట్.. కాంగ్రెస్ సీనియర్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనయుడు. జలోర్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. గత ఎన్నికల్లో జోధ్‌పూర్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్(కేంద్ర మంత్రి) చేతిలో రెండున్నర లక్షల ఓట్లతో ఓటమిపాలయ్యారు.