
2024లో నెట్‌ఫ్లిక్స్ నుంచి రానున్నచిత్రాల గురించి ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

హీరామండి: ది డైమండ్ బజార్ (వెబ్ సిరీస్) యథార్థ సంఘటనల ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో రానుంది. ఇందులో మనిషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా తదితరులు నటిస్తున్నారు.

మర్డర్ ముబారక్ (సినిమా) హోమి అడజానియా దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠీ,డింపుల్ కపాడియా, సారా అలీఖాన్, విజయ్ వర్మ తదితరులు నటించారు. మార్చి 15న స్ట్రీమింగ్.

దోపట్టి (సినిమా) శశాంక చతుర్వేది డైరెక్షన్‌లో కాజోల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనుంది.

ఐసీ 814 (వెబ్ సిరీస్) అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రానున్న ఈ సిరీస్‌లో విజయ్‌వర్మ,అరవింద స్వామి, నసీరుద్దీన్ షా,పంకల్ కపూర్, దియా మీర్జా తదితరులు నటించారు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814 హైజాక్ గురించి ఈ సిరీస్ రానుంది.

డబ్బా కార్టెల్ (వెబ్ సిరీస్) హితేష్ భాటియా నుంచి భారీ అంచనాలతో రానున్న ఈ సిరీస్‌లో జ్యోతిక, నిమేషా సజయన్,షబానా అజ్మీ,షాలినీపాండే ,సాయి తమంకర్ నటించారు.

యే కాలీ కాలీ అంఖీన్ (వెబ్ సిరీస్) రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా 2022లో వచ్చిన ఈ సిరీస్‌ను సిద్ధార్థ్ సేన్ గుప్త తెరకెక్కించాడు. తాహిర్ రాజ్ భాసిన్, శ్వేత త్రిపాఠి, సౌరభ్ శుక్లా తదితరులు నటించిన ఈ సిరీస్ సీజన్-2 రానుంది.

మామ్లా లీగల్ హై (వెబ్ సిరీస్) కామెడీ నేపథ్యంలో రాహుల్ పాండే తెరకెక్కించాడు. ఇందులో విక్రమ్ ప్రతాప్, అమిత్ విక్రమ్ పాండే, రవి కిషన్ నటించారు. మార్చి 1 నుంచి స్ట్రీమింగ్.

కోటా ఫ్యాక్టరీ (వెబ్ సిరీస్) ఎడ్యుకేషనల్ హబ్‌గా ట్రెండింగ్‌లో ఉన్న రాజస్థాన్ కోటా నేపథ్యంలో ఇప్పటికే రెండు సిరీస్ వచ్చాయి. ఇప్పుడు సీజన్ -3 రానుంది. సౌరభ్ ఖన్నా దర్శకత్వంలో జితేంద్రకుమార్, అహ్సాస్ చన్నా, ఆలంఖాన్, రంజన్ రాజ్, రేవతి పిళ్లై, ఉర్విసింగ్ తదితరులు నటించారు.

మిస్ మ్యాచ్ (వెబ్ సిరీస్) ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించిన ఈ సూపర్ హిట్ సిరీస్ నుంచి సీజన్ -3 రానుంది. ఇందులో ప్రజక్త కోలి, రోహిత్ సరాఫ్, రణ్‌విజయ్ సింఘా, విద్య మాల్వేదే తదితరులు భాగం అయ్యారు.

ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ (వెబ్ సిరీస్) నీరజ్ పాండే దర్శకత్వంలో రానుంది. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన ఖాకీ: ది బిహార్ చాప్టర్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

హసీనా దిల్‌రుబ (వెబ్ సిరీస్) మర్డర్ మిస్టరీ నేపథ్యంలో 2021లో విడుదలైన ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా సీజన్-2 రానుంది. వినీల్ మాథ్యూ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌లో తాప్సీ పన్ను , విక్రాంత్ మాస్సే మరియు హర్షవర్ధన్ రాణే నటిస్తున్నారు.