
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ నటుల్లో అనసూయ ఒకరు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్ అప్‌డేట్స్ పంచుకుంటుంది.

తన సినిమాల అప్‌డేట్స్‌ని మాత్రమే కాకుండా.. పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది

ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్తే..ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది

అంతేకాదు అప్పుడప్పుడు తన అభిమానుల కోసం కొత్త కొత్త డ్రెస్సుల్లో ఫోటోషూట్ చేసి..వాటిని ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తుంది

అలా తాజాగా అనసూయ ఓ డిఫరెంట్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అనసూయ లుక్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

కొంతమంది నెటిజన్స్ అనసూయను ట్రోల్ చేస్తున్నారు. ఈజిప్ట్ మమ్మిలా ఉన్నావంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే ఇలాంటి ట్రోల్స్ అనసూయకు కొత్తేమి కాదు. గతంలోనూ అనేకసార్లు ఆమెను ట్రోల్ చేశారు. అయినా కూడా అనసూయ ఎక్కడ తగ్గట్లేదు.తనకు నచ్చిన విధంగా రెడీ అవుతానని.. తన డ్రెస్సింగ్‌పై కామెంట్ చేస్తే అంతగా పట్టించుకోనని చెబుతోంది.

అనసూయ ప్రస్తుతం పుష్ప 2తో పాటు మరో రెండు సినిమాలు, పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది.



