
నా సినిమాల గురించి మా ఫ్యామిలీ వాళ్లు తప్పా..మిగతావారు ఏం చెప్పినా నమ్మను అంటోంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. బయటి వాళ్ల పొగడ్తలు, క్రిటిసిజం మనసుకు తీసుకోనంటుంది. ఆమె నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’ ఈ నెల 9న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఆసక్తికర విషయాలను పంచుకుంది.

పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ సినిమా కథను రాసుకున్నాడు డైరెక్టర్ వంశీ. మూడు తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. వంశీ గారి పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్‌లు కూడా ఇందులో ఉన్నాయి.

ముద్దపప్పు ఆవకాయ్ టైంలో నేను నటించాను. ఆ టైంలో నేను అందులో డబ్బులు కూడా పెట్టాను. అదే ప్రొడక్షన్ హౌస్ అయింది. కావాలని నిర్మాత అవ్వలేదు. అలా అయిపోయానంతే. నాకు నటించడమే ఇష్టం

పదకొండు మంది అబ్బాయిల కారెక్టర్లో నన్ను నేను ఊహించుకొన్నాను. సినిమాను చూసే ప్రతీ ఆడియెన్ ఏదో ఒక కారెక్టర్‌తో ట్రావెల్ చేస్తారు. ప్రతీ ఒక్కరూ సినిమాకు కనెక్ట్ అవుతారు

టాలెంట్ మాత్రమే కాదు.. క్రమశిక్షణ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతారని చిరంజీవి గారు చెబుతుంటారు. ఆ క్రమశిక్షణ నేను వంశీలో చూశాను. ఆయన సినిమా కోసం చాలా కష్టపడ్డారు

మా నాన్నకి కూడా వంశీ నెరేషన్ ఇచ్చారు. మామూలుగానే మా నాన్నకి నచ్చక పోతే వెంటనే లేచి వెళ్లిపోతారు. కానీ వంశీ చెప్పిన కథ మా నాన్నకి కూడా చాలా నచ్చింది

మా అన్న ఎప్పుడూ స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా చెప్పేస్తుంటారు. ఈ మూవీ చూసి వెంటనే నన్ను పిలిచి అభినందించారు. సెన్సార్ వాళ్లకి కూడా సినిమా బాగా నచ్చింది

మంచి కథలు, కాన్సెప్ట్‌లు, స్క్రిప్ట్‌లకే ప్రాధాన్యం ఇస్తా. పాత్ర బాగుంటే మిగతా అంశాల గురించి అంతగా పట్టించుకోను. చిన్న పాత్ర అని, చిన్న హీరో అని కూడా ఆలోచించను. కథ బాగుండి.. పాత్ర నచ్చితే సినిమాల్లో నటిస్తాను

వారసత్వం ఉంది కదా అని సినిమాల్లోకి వస్తే సక్సెస్ అవ్వలేరు. సినిమా అంటే ప్యాషన్, ఇష్టం ఉండాలి. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడాలి. అప్పుడే విజయం సాధించగలరు





