
అక్కినేని కోడలిగా హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల త్వరలోనే అడుగుపెట్టనుంది

తాజాగా అక్కినేని నాగచైతన్యతో ఆమె ఎంగేజ్‌మెంట్ చేసుకుంది

త్వరలోనే వీరిద్దరు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు

ఏపీలోని తెనాలిలో మే 31న 1992లో శోభిత ధూళిపాళ్ల జన్మించింది

ఆమె తండ్రి వేణుగోపాల్ రావు నావీలో ఉద్యోగి కావడంతో చదవంతా వైజాగ్‌లోనే పూర్తి చేసింది

ఆ తర్వాత ఆమె తండ్రి ముంబయికి షిప్ట్ అవటంతో అక్కడే ఉన్నత విద్యను అభ్యసించింది

ఆ తర్వాత 2013లో ఫెమినా మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచింది

2016లో రామన్ రాఘవన్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది

ఆ తర్వాత తెలుగు, హిందీ, మలయాళ చిత్రాల్లోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ లాంటి వెబ్ సిరీసుల్లోనూ మెరిసింది

అంతే కాకుండా 'మేజర్', 'పొన్నియిన్ సెల్వన్' చిత్రాలతో మరింత గుర్తింపు దక్కించుకుంది

శోభిత ఇటీవలే హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. మంకీ మ్యాన్ అనే అమెరికన్ సినిమాలో నటించింది

ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ హీరో నాగచైతన్యను పెళ్లాడబోతోంది


















