

తొలి సినిమాతోనే అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. బాలీవుడ్ మూవీ సామ్రాట్ పృథ్వీరాజ్‌లో అక్షయ్‌కు జోడీగా నటించింది మానుషీ. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. డెబ్యూ మూవీతోనే ఫ్లాప్ అందుకున్న హీరోయిన్‌గా మానుషీకి ముద్రపడింది.

రెండో సినిమాతోనైనా హిట్ కొట్టి.. తనపై పడిన ముద్రను తొలగించుకుందామని ప్రయత్నించింది. కానీ రెండో మూవీ ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ కూడా ఫ్లాప్ అయింది.

బాలీవుడ్ అచ్చిరాకపోవడంతో టాలీవుడ్ మూవీతోనైనా హిట్ కొడదామని ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాను ఒప్పుకుంది.

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో హ్యాట్రిక్ డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్న హీరోయిన్‌గా మానుషీ మిగిలిపోయింది.

దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ ప్రపంచ సుందరీ.. ఇటీవల ‘బడే మియా చోటో మియా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇలా రెండేళ్లలో నటించిన నాలుగు సినిమాలు డిజాస్టర్స్ కావడంతో మానుషీ సినీ కెరీర్ డేంజర్ జోన్‌లోకి వెళ్లింది.

కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోవడం వల్లే విజయాన్ని అందుకోలేకపోతుంది.

ఈ బ్యూటీకి అర్జెంట్‌గా ఓ భారీ విజయం కావాలి. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫ్లాప్ అయినా.. తెలుగులో మానుషీకి ఆఫర్స్ వస్తున్నాయట. ఐదో మూవీ తెలుగులోనే చేసే అవకాశం ఉంది. ఈ చిత్రంతోనైనా హిట్ సాధిస్తుందో లేదో చూడాలి.


