

కానీ మొదట రిలీజైంది మాత్రం నినగాగి. కన్నడతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించింది.

తెలుగులో భద్రాద్రి రాముడు అనే ఒకే ఒక్క చిత్రంలో యాక్ట్ చేసింది. 2000వ సంవత్సరంలో ఆమె రతన్ కుమార్‌నుపెళ్లాడింది. అయితే అప్పటికి తనకు కనీసం 14 ఏళ్లు కూడా నిండలేదని..

తన కెరీర్ ఏమవుతుందోనని రాధికను పేరెంట్స్ తమతోపాటే ఉంచుకున్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న సమయంలో రతన్ 2002లో గుండెపోటుతో చనిపోయాడు.

నటిగా రాణిస్తున్న రాధిక 2006లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిని సీక్రెట్‌గా పెళ్లాడింది. ఈ విషయాన్ని 2010లో బయటపెట్టింది.

వీరికి షామిక అనే కూతురు ఉంది. కుమారస్వామి గతంలో సినిమా రంగంలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పని చేశారు.

ఆ సమయంలో రాధికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు రాధిక తండ్రి ఆమోదం తెలపలేదు. కారణం.. కుమారస్వామికి అప్పటికే భార్యా కుమారుడు ఉన్నారు.

పైగా వయసులో తన కూతురి కంటే ఆయన 27 ఏళ్లు పెద్ద!

ప్రస్తుతం రాధికా కుమారస్వామి ఒకేసారి రెండు ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు ‘అజాగ్రత్త’, ‘భైరా దేవి’లో నటిస్తోంది.










