
కొందరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ అందని ద్రాక్షగానే ఉంటుంది.

ఒక్క హిట్టు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటారు. మరికొందరు తొలి ప్రయత్నంలోనే హిట్టు అందుకుంటారు.

నటి శార్వరి ఈ కోవలోకే వస్తుంది.

ప్యార్ కా పంచనామా, బాజీరావ్ మస్తానీ, సోను కి టిటు కి స్వీటి వంటి బాలీవుడ్ చిత్రాలకు ఈమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది.

బంటీ ఔర్ బబ్లీ 2 చిత్రంతో నటిగా మారింది. ముంజా తన రెండో సినిమా!

చిన్న చిత్రంగా వచ్చిన ముంజా అనే హారర్ కామెడీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా రాబట్టింది.

ఇందులో బేల పాత్రలో నటించింది.

తన సినిమా ఈ రేంజ్‌లో సక్సెస్ కావడంతో ఆనందంతో గెంతులేస్తోంది.

ఇకపోతే శార్వరి.. మహారాజ్ అనే ఓటీటీ మూవీలోనూ కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం వేద అనే సినిమా చేస్తోంది.










