-
Ind vs Ban: విరాట్ కోహ్లి జట్టు గెలిచింది: టీమిండియా కోచ్
సుమారు ఆరు నెలల తర్వాత టీమిండియా తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆడనుంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19 నుంచి తాజా సిరీస్ మొదలుపెట్టనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న రోహిత్ సేన.. బంగ్లాదేశ్‌పై గెలుపొంది మార్గం సుగమం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.వారం రోజుల సెషన్చాలా కాలం తర్వాత.. తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆరంభానికి ముందు వారం రోజుల పాటు ట్రెయినింగ్ సెషన్లో పాల్గొంటోంది. ఇందుకోసం ఇప్పటికే మొదటి టెస్టుకు వేదికైన చెన్నైకి చేరుకుంది భారత జట్టు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్యాచింగ్ ప్రాక్టీస్ప్రాక్టీస్లో ఈసారి తాను రెండు సెగ్మెంట్లను ప్రవేశపెట్టానని తెలిపాడు. చెన్నై వాతావరణం బాగా పొడిగా ఉన్న దృష్ట్యా జట్టును రెండు టీమ్‌లుగా విభజించి.. కాంపిటీషన్ డ్రిల్ నిర్వహించానని పేర్కొన్నాడు. క్యాచింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేయించానని.. సోమవారం నాటి సెషన్లో విరాట్ కోహ్లి టీమ్ గెలిచిందని టి.దిలీప్ వెల్లడించాడు. ఇలాంటి మినీ కాంపిటీషన్ల ద్వారా ఆటగాళ్లు త్వరగా అలసిపోరని.. వీలైనంత ఎక్కువసేపు నెట్స్‌లో గడిపేందుకు ఇలాంటి సెషన్లు ఉపయోగపడతాయని పేర్కొన్నాడు.యాక్టివ్‌గా ఉన్నారుఏదేమైనా ప్రాక్టీస్ అద్భుతంగా సాగుతోందని.. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా తమ ప్లేయర్లు యాక్టివ్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారని టి.దిలీప్ వారిని ప్రశంసించాడు. కాగా ఈ సెషన్లో దిలీప్‌తో పాటు అభిషేక్ నాయర్ కూడా ఆటగాళ్లతో మమేకమయ్యాడు. ఇక నెట్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్ బౌలర్లను ఎదుర్కోగా.. కోహ్లి బుమ్రా బౌలింగ్‌లో ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. కాగా సెప్టెంబరు 19- అక్టోబరు 1 వరకు టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది. చెన్నై, కాన్పూర్ ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.చదవండి: T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్Intensity 🔛 point 😎🏃♂️Fielding Coach T Dilip sums up #TeamIndia's competitive fielding drill 👌👌 - By @RajalArora #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/eKZEzDhj9A— BCCI (@BCCI) September 16, 2024 -
వాస్తవ ఘటనల స్ఫూర్తితో సత్యదేవ్ సినిమా.. విడుదలపై ప్రకటన
సత్యదేవ్ , డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘జీబ్రా’ . లక్ ఫేవర్స్ ది బ్రేవ్.. అన్నది ఉపశీర్షిక. క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల మోషన్ పోస్టర్‌ను వీడియో ద్వారా విడుదల చేశారు మేకర్స్. అక్టోబర్ 31న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. సత్యదేవ్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల కానుంది ఈ సినిమాకు సంగీతం రవి బస్రూర్ అందించారు. ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలుగా ఉన్నారు. సహ–నిర్మాత: శ్రీ లక్ష్మి. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ , జెన్నిఫర్ కథానాయికలుగా నటిస్తుండగా సునీల్,సత్య కీలకపాత్రలో కనిపించనున్నారు. -
ఎన్టీఆర్ 'దేవర'.. ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్?
ప్రస్తుతం టాలీవుడ్లో 'దేవర' గురించి చర్చ నడుస్తోంది. ఎందుకంటే 'ఆర్ఆర్ఆర్' లాంటి అద్భుతమైన పాన్ ఇండియా మూవీ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా. అందున తెలుగు కంటే హిందీలో భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. మరోవైపు తెలుగులో కూడా రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలో సోషల్ మీడియాలో ఓ విషయం వైరల్ అవుతోంది. ఇది గనక నిజమైతే అభిమానులకు బ్యాడ్ న్యూసే.(ఇదీ చదవండి: 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుమతిపై సందేహాలు)వారం క్రితం ఎన్టీఆర్ 'దేవర' ట్రైలర్ రిలీజైంది. మిశ్రమ స్పందన వచ్చింది. అంతకు ముందు రిలీజ్ చేసిన మూడు పాటల్ని కూడా తొలుత కాపీ ట్యూన్స్ అని ట్రోల్ చేశారు. కొన్నిరోజులకే అవే పాటల్ని రిపీట్స్‌లో వింటున్నారు. వీటిలో ఎన్టీఆర్-జాన్వీ కపూర్ డ్యాన్స్‌తో అదరగొట్టిన 'దావుదీ' అనే సాంగ్ కూడా ఉంది.సినిమాలో సిట్చూయేషన్ సెట్ కాక చివర్లో టైటిల్స్ పడ్డప్పుడు ఈ పాటని ప్లే చేస్తారని తొలుత టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్‌ని పూర్తిగా థియేటర్ వెర్షన్ నుంచి తీసేశారని అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే తారక్ మాస్ డ్యాన్స్ చూడటం కష్టమే. ఎందుకంటే 'చుట్టమల్లే' పాటలోనూ తారక్ డ్యాన్స్ చేశాడు. కాకపోతే అవి సింపుల్ స్టెప్స్. ఫియర్ సాంగ్, ఆయుధ పూజ ఎలివేషన్ సాంగ్స్ కాబట్టి వీటిలో తారక్ డ్యాన్స్ ఉండదు. మరి సినిమాలో 'దావుదీ' ఉంటుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?) -
అతిషి మర్లెనా సింగ్: ఢిల్లీ సీఎం పీఠం ఎక్కబోతున్న ఈమె ఎవరు?
గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. దిల్లీ తదుపరి సీఎం పేరును ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కేజ్రీవాల్ నివాసంలో మంగళవారం జరిగిన ఆప్ శాసనసభ సమావేశంలో మంత్రి అతిషి పేరును ఢిల్లీ సీఎంగా ప్రకటించారు. ఆమె పేరును కేజ్రీవాల్ స్వయంగా ప్రతిపాదించారు. ప్రస్తుత సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేటి సాయంత్రం లెఫ్ట్నెంగ్ గవర్నర్ సక్సేనాతో భేటీ కానున్నారు. ఆయన్ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు. ఆ తర్వాత అతిషి . సీఎంగా బాధ్యతలను చేపట్టనున్నారు.ఎవరీ అతిషిఢిల్లీ లిక్కర్ పాలసీలో మాజీ డిప్యూటీసెం మనీష్ సిసోడియా జైలుకెళ్లినప్పటి నుంచి అతిషి మర్లెనా సింగ్ పేరు బాగా ప్రాముఖ్యంలోకి వచ్చింది. ఆమె ఢిల్లీలోని కల్కాజీ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు కూడా. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో విద్య, పీడబ్ల్యూడీ, సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అతిషి మర్లెనా సింగ్ 8 జూన్ 1981న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తా వాహి ప్రొఫెసర్లు ఆమె తల్లిదండ్రులు కార్ల్ మార్స్క్, లెనిన్ పేర్లలోని కొన్ని భాగాలను కలిపి అతిషీ పేరులో ‘మార్లీనా’ అని చేర్చారు. 2018 ఎన్నికల ముందు నుంచి ఆతిశీ తన ఇంటి పేరును వాడటం మానేశారు. తన ఉన్నత పాఠశాల విద్యను న్యూ ఢిల్లీలోని స్ప్రింగ్డేల్స్ స్కూల్ (పూసా రోడ్)లో పూర్తి చేసింది. ఆమె 2001లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. 2003లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హిస్టరీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అక్కడ ఆమె చెవెనింగ్ స్కాలర్షిప్న్ను కూడా పొందారు.రాజకీయ ఎంట్రీ..2013 జనవరిలో ఆమ్ ఆద్మీ పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. పార్టీ విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 2015లో,ఆమె మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో జరిగిన చారిత్రాత్మక జల సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన నిరసనలు, న్యాయ పోరాటం సమయంలో ఆప్ నేత, కార్యకర్త అలోక్ అగర్వాల్‌కు మద్దతునిచ్చారు.2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో తూర్పు ఢిల్లీకి లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. ఆ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ నంచి బరిలోకి దిగిన గౌతమ్ గంభీర్‌పై అతిషి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 4.77 లక్షల ఓట్ల తేడాతో గౌతమ్ గంభీర్‌పై ఓడిపోయి మూడో స్థానంలో నిలిచారు.2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..ఆ తర్వాత 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషికి ఆప్ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆమె 11,422 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ధరంబీర్ సింగ్‌పై విజయం సాధించారు. 2020 ఎన్నికల తర్వాత ఆమె గోవా ఆప్ యూనిట్‌కు ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.కేబినెట్ మంత్రిగా పదోన్నతి..2015 నుంచి 2018 ఏప్రిల్ 17 వరకు ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారురాలిగా పనిచేశారు. ఉప ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ రాజీనామా తర్వాత సౌరభ్ భరద్వాజ్‌తోపాటు ఆమె ఢిల్లీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా చేరారు. అనే పోర్టుఫోలియోల భారం ఆమె మీదే పడింది. దాదాపు 14 శాఖలకు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం విద్య, ఆర్థిక, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, నీరు, విద్యుత్, ప్రజా సంబంధాలు వంటి కీలక మంత్రిత్వ శాఖలను అతిషి చూసుకుంటున్నారు. అప్పట్లో విద్యావ్యవస్థలో ప్రవేశపెట్టిన హ్యాపీనెస్ కరికులం, ఎంటర్ప్రెన్యూర్ షిప్ కరికులం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్యార్థుల భావోద్వేగాలపై దృష్టిపెట్టడం, వారిలో పలురకాల స్కిల్స్‌ను పెంపొందించడంపై దృష్టిపెట్టింది. ఆ తర్వాత ఆమె విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె చేపట్టిన విద్యా సంస్కరణలను పార్టీ తరచూ ఎన్నికల ప్రధాన అజెండాగా ప్రచారం చేస్తుంటుందిఢిల్లీ ప్రభుత్వంలో ఆమె పాత్ర..ఢిల్లీలో విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకు రావడంలో అతిషి కీలక పాత్ర పోషించారు. నగరంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలనే మార్చేసిన ఘనత ఆమెది. అప్పట్లో విద్యావ్యవస్థలో ప్రవేశపెట్టిన హ్యాపీనెస్ కరికులం, ఎంటర్ప్రెన్యూర్ షిప్ కరికులం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్యార్థుల భావోద్వేగాలపై దృష్టిపెట్టడం, వారిలో పలురకాల స్కిల్స్‌ను పెంపొందించడంపై దృష్టిపెట్టింది. ఆమె చేపట్టిన విద్యా సంస్కరణలను పార్టీ తరచూ ఎన్నికల ప్రధాన అజెండాగా ప్రచారం చేస్తుంటుంది.అతిషీనే ఎందుకు?మద్యం కుంభకోణంలో ఆప్ కీలక నేతలందరూ జైలుకు వెళ్లారు. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పార్టీ పరంగా అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అటు సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి ప్రభుత్వ పరమైన నిర్ణయాల్లోనూ తనదైన పాత్ర పోషించారు. ఆప్ ప్రతిష్టను నిలబెట్టే బాధ్యతను తన భూజాలపై వేసుకున్నారు. తన వాగ్ధాటితో ప్రతిపక్షాలను ముప్పుతిప్పలు పెట్టారు. అందుకే అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో ఆమె ఢిల్లీ పీఠాన్ని అధిరోహించబోతున్నారు. కీలక అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రభుత్వాన్ని నడపనున్నారు. -
గోల్ఫర్ సాహిత్ రెడ్డికి నిరాశ
కాలిఫోర్నియా: ప్రొకోర్ చాంపియన్‌షిప్ గోల్ఫ్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్, భారత సంతతి అమెరికా గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ఈసారి టైటిల్ నిలబెట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీలో సాహిత్ 12 అండర్ 276 పాయింట్లతో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. ప్యాటన్ కిజైర్ (అమెరికా) 20 అండర్ 268 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. డేవిడ్ లిప్స్కీ (అమెరికా) రెండో స్థానంలో, ప్యాట్రిక్ ఫిష్‌బర్న్ (అమెరికా) మూడో స్థానంలో నిలిచారు.విజేతగా నిలిచిన ప్యాటర్ కిజైర్కు 10,80,000 డాలర్లు (రూ. 9 కోట్ల 5 లక్షలు), రన్నరప్ లిప్‌స్కీకి 6,54,000 డాలర్లు (రూ. 5 కోట్ల 48 లక్షలు), సెకండ్ రన్నరప్ ఫిష్బర్న్కు 4,14,000 డాలర్లు (రూ. 3 కోట్ల 47 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచిన తీగల సాహిత్ 1,76,100 డాలర్ల (రూ. 1 కోటి 47 లక్షలు) ప్రైజ్‌మనీని దక్కించుకున్నాడు.హైదరాబాద్‌కు చెందిన తీగల సాహిత్ తల్లిదండ్రులు 1980 దశకంలో అమెరికాలో స్థిరపడ్డారు. సాహిత్ అమెరికాలోనే పుట్టి పెరిగి గోల్ఫర్గా రాణిస్తున్నాడు. -
రెండు 'టీ' లకు మించొద్దు..! లేదంటే ఆ సమస్య తప్పదు..!
రోజూ రెండు కప్పుల టీ, మరో రెండు కప్పుల కాఫీ తాగేవారిలో మతిమరపు సమస్య అంత తేలిగ్గా రాదని అంటున్నారు చైనా పరిశోధకులు. టీ, కాఫీలను చాలా పరిమితంగా అంటే రోజూ రెండు కప్పులకు మించకుండా తాగేవారిలో కేవలం మతిమరపు (డిమెన్షియా) నివారితం కావడమే కాదు... పక్షవాతం వచ్చే అవకాశాలూ తక్కువే అంటున్నారు ఈ పరిశోధన నిర్వహించిన పరిశోధకులు. టీ కాఫీలు తాగని వారితో పోల్చినప్పుడు... రోజూ రెండు కప్పుల చొప్పున టీ, కాఫీ తాగేవారిలో మతిమరపు రావడమన్నది దాదాపు 28 శాతం తక్కువని పేర్కొంటున్నారు చైనాకు చెందిన టియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు డాక్టర్ యువాన్ ఝాంగ్, ఆయన బృందం. దాదాపు 5,00,000 మందిపై పదేళ్ల పాటు వారు బ్రిటన్‌లో సుదీర్ఘ పరిశోధన చేశారు. కాఫీ, టీల మీద ఇలా పరిశోధనలు జరగడం మొదటిసారి కాదు. గతంలోనూ జరిగాయి. ఈ ఫలితాల మీద కొన్ని భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. రీడింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రయుఖ న్యూట్రిషనల్ సైన్సెస్ నిపుణురాలు డాక్టర్ కార్లోట్ మిల్స్ మాట్లాడుతూ... ‘‘మతిమరపు నివారణకు కేవలం కాఫీ, టీలు మాత్రమే కారణం కాకపోవచ్చు. ఇతర అంశాలూ కారణమయ్యే అవకాశాలూ లేక΄ోలేద’’న్న అభి్ప్రాయం వ్యక్తం చేశారు. ఇంకొందరు అధ్యయనవేత్తలు సైతం ఈ పరిశోధనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, టీలలో మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పదార్థాలుంటాయి. వాటిని పరిమితికి మించి తీసుకుంటే కలిగే ప్రమాదాల గురించి వారు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గతంలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజుకు ఆరు కప్పులకు మించి కాఫీ/టీ తాగేవారిలో 53% మందికి డిమెన్షియా వస్తుందని తెలిసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘‘కేవలం రెండే’’ అన్న పరిమితికి గట్టిగా కట్టుబడి ఉండాలంటున్నారు. ఈ పరిశోధన పలితాలు ప్రముఖ మెడికల్ జర్నల్ ప్లాలస్ మెడిసిన్’ (PLos Medicine)లో ప్రచురితమయ్యాయి.(చదవండి: కిస్మిస్ని నీళ్లల్లో నానబెట్టే ఎందుకు తినాలో తెలుసా..!) -
నాగాలాండ్ పౌర హత్యలు: ఆర్మీ సిబ్బందిపై క్రిమినల్ కేసు రద్దు
ఢిల్లీ: నాగాలాండ్ మోన్ జిల్లాలో 13 మంది పౌరుల హత్య కేసులో ఆర్మీ సిబ్బందిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసుపై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. ‘ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లోని చేర్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేస్తున్నాం. ఇక.. ఈ కేసును ఓ తార్కిక ముగింపునకు తీసుకురావచ్చు. అదేవిధంగా సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్మీకి సూచించాం’ అని సుప్రీంకోర్టు వెల్లడించింది.డిసెంబర్ 4, 2021న నాగాలాండ్‌లోని ఓటింగ్ గ్రామంలో మైనర్లను తీసుకెళ్తున్న ట్రక్కుపై ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపింద. అయితే ఆ ట్రక్కులో ఉన్నవాళ్లను ఆర్మీ సిబ్బంది మిలిటెంట్లుగా భావిసించి కాల్పులు జరిపింది.ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. దీంతో ఆ ప్రాంతంలో హింస చెలరేగడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపిన కాల్పుల్లో మరో ఏడుగురు పౌరులు మృతి చెందారు.చదవండి: ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్ -
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
గుంటూరు, సాక్షి: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ ఖాతాలో జగన్ ఓ సందేశం ఉంచారు. Happy Birthday to Hon. PM Shri @narendramodi ji! May you lead a long, healthy and blessed life.— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2024 ఇదీ చదవండి: మోదీ@74.. ఎవరేమన్నారంటే.. -
ఏమీ లేదనిపింఛెన్..
కాకినాడ సిటీ: తమను గెలిపిస్తే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల ఊసే ఎత్తడం లేదు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పింఛన్ మొత్తాన్ని రూ. 4 వేలకు పెంచుతామని చంద్రబాబు చెప్పారు. అలాగే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ వృద్ధాప్య పింఛన్ కింద రూ. 4 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.ప్రతి ఎన్నికల సభలోనూ దీనిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 96 రోజులు గడుస్తున్నా, కొత్త పింఛన్ల ఊసే లేకుండా పోయింది. కాకినాడ జిల్లాలో 50 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు దాదాపు 2.50 లక్షల మంది ఉంటారు. ఇందులో కనీసం 1.70 లక్షల మంది అర్హులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు. వీరందరూ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి ఇప్పట్లో కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ప్రస్తుత లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారని, వారిని తీసేసిన తర్వాతే ఆ స్థానంలోనే ఇస్తారనే ప్రచారం చేస్తున్నారు.అర్జీలు.. బుట్టదాఖలుకొత్త పింఛన్ల కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంపీడీఓ, డీఆర్డీఏ కార్యాలయాల చుట్టూ 50 ఏళ్లు నిండిన లబ్ధిదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త పింఛన్లపై తమకు మార్గదర్శకాలు రాలేదని అధికారులు వారిని వెనక్కి పంపుతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాటలను నమ్మి మోసపోయామని అవ్వాతాతలు అంటున్నారు. అధికారం చేపట్టి 96 రోజులైనా 50 ఏళ్లకే పింఛన్ లేదు, సూపర్–6 హామీలు లేవు. వెరసి 2024–25లో హామీల అమలు లేనట్లేనని సంకేతాల ఇస్తున్నారు.వలంటీర్ వ్యవస్థకు మంగళంగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలను రూ. 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత వలంటీర్ వ్యవస్థ ఊసే లేకుండా పోయింది. జూలై, ఆగస్టు నెలల పింఛన్ల పంపిణీ అబాసుపాలైంది. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలనే ఆదేశాలు ఉండగా, ఇది అమలు కావడం లేదు. 30 శాతం వరకూ మాత్రమే ఇంటి దగ్గర పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 70 శాతం ప్రధాన కూడళ్లు, ఆలయాలు, అంగన్వాడీ సెంటర్లు, రచ్చబండ, సచివాలయాల్లో అందజేస్తున్నారు.3,112 పింఛన్ల కోతకూటమి ప్రభుత్వం వచ్చాక నెల నెలా పింఛన్లలో కోత పడుతోంది. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే సెప్టెంబర్ పింఛన్లలో 3,112 కోత కోశారు. పింఛన్లను అడ్డుగోలుగా కోస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది జూన్‌లో జిల్లాలో 2,79,805 పింఛన్లు ఉండగా, సెప్టెంబర్‌లో 2,76,683కి తగ్గించారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 3,112 పింఛన్లను తొలగించిన వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను కూడా ఎంపిక చేయలేదు.వైఎస్సార్ సీపీ హయాంలో ఇలా..వైఎస్సార్ సీపీ హయాంలో ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లను మంజూరు చేసేవారు. ఏటా జనవరి, జూలై నెలల్లో అర్హులందరికీ అందించేవారు. రాజకీయాలకు అతీతంగా, అర్హతనే ప్రామాణికంగా ఇచ్చేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు తీసుకుంటే చాలు ఆటోమేటిక్‌గా పింఛన్ మంజూరయ్యేది. వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో కొత్త పింఛన్లు జిల్లాలో 64 వేలకు పైగా ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకూ ఉన్న అప్పటి టీడీపీ పాలనలో కొత్త పింఛన్ పొందాలంటే చాలా కష్టమయ్యేది. జన్మభూమి కమిటీలను ముడుపులతో ప్రసన్నం చేసుకుంటేనే పింఛన్ ఇచ్చేవారు. వచ్చే జనవరి నుంచి మళ్లీ జన్మభూమి–2 కార్యక్రమం చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. జన్మభూమితో పాటే జన్మభూమి కమిటీలు కూడా రాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తే ముడుపులు ఇచ్చిన వారికే అందలం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జానీని ‘మాస్టర్’ అని పిలవకండి: హీరోయిన్ పూనమ్ కౌర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాష అలియా జానీ మాస్టర్‌పై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్‌డోర్ షూటింగ్లకి వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతని సహాయకురాలు(21) పోలీసులకు ఫిర్యాదు చేసింది.అలాగే నార్సింగిలోని తన నివాసానికి వచ్చి పలు మార్లు వేధింపులకు కూడా గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. (చదవండి: మైనర్‌గా ఉన్నప్పటి నుంచే 'జానీ' వేధించాడు: చిన్మయి)ఈ విషయం బయటకు రాగానే పలువురు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జానీ మాస్టర్‌పై ఫైర్ అవుతూ.. బాధితురాలికి అండగా నిలుస్తున్నారు. సింగర్ చిన్మయి స్పందిస్తూ.. యువతి మైనర్‌గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తాజాగా నటి పూనమ్ కౌర్ కూడా జానీ మాస్టర్‌పై సీరియస్ అయింది. ఇకపై అతన్ని మాస్టర్ అనే పిలువొద్దని ఎక్స్ వేదికగా కోరింది. ‘నిందితుడు షేక్ జానీ ని ఇకపై ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి. మాస్టర్ అనే పదానికి విలువ ఇవ్వండి’ అని పూనమ్ ట్వీట్ చేసింది. Accused ‘shaik jani’ should not be called a master anymore ,Have some respect for the word ‘Master’ 🙏— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 16, 2024