Sakshi News home page

ప్రగతి పరవళ్లు

Published Tue, May 7 2024 2:20 PM

ప్రగత

గూడెంలో గూండాలకు చోటివ్వద్దు 
తాడేపల్లిగూడెం ప్రశాంతతకు భంగం కలిగించే అరాచక శక్తులకు చోటివ్వద్దు.. అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. 8లో u
పచ్చని పొలాలు.. ఏపుగా కొబ్బరి చెట్లు.. నిండుకుండల్లా రొయ్యలు చెరువులు.. గలగలపారే గోదారి పంట కాలువలు.. ఆధ్మాత్మిక సౌరభాలు.. ఎటు చూసిన ఆహ్లాదకర వాతావరణం పశ్చిమగోదావరి సొంతం. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాటలు పడ్డాయి. జిల్లాకు తలమానికంగా నిలిచే ప్రాజెక్టులకు అంకురార్పణ జరిగింది. ప్రభుత్వ భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు సీఎం జగన్‌ సర్కారు ప్రాధాన్యమిచ్చింది. దీంతో జిల్లా అన్నిరంగాల్లో ప్రగతి సాధిస్తోంది. సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. – సాక్షి, భీమవరం 
 

కూటమిని ఓడించండి

రాష్ట్రంలో కూటమి పార్టీలు కుల గణనకు వ్యతిరేకంగా ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గూడూరి ఆరోపించారు. 8లో u

శురకవారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2024

నేడు నరసాపురంలో సీఎం జగన్‌ సభ

చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు

నరసాపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నరసాపురం పట్టణంలో నిర్వహిస్తున్న ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు కోరారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి పర్యటన వివరాలు వెల్లడించారు. ఉదయం 9.30 గంటలకు సీఎం జగన్‌ హెలీకాప్టర్‌పై పట్టణంలోని టేలర్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి నేరుగా కారులో స్టీమర్‌ రోడ్డు కనకదుర్గ గుడి ఆర్చి వద్ద ఏర్పాటుచేసిన సభావేదిక వద్దకు చేరుకుంటారని చెప్పారు. ఉదయం 11 గంటలకు బహిరంగ సభ అనంతరం సీఎం జగన్‌ తిరుగు ప్రయాణమవుతారన్నారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో సీఎం జగన్‌ ఉన్నారని, వైఎస్సార్‌సీపీ అఖండ మెజార్టీతో మళ్లీ అధికారం కైవసం చేసుకుంటుందని ముదునూరి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదన్నారు. మాట ఇస్తే కచ్చితంగా అమలు చేసి చూపించే సీఎం జగన్‌ వెంటే ప్రజానీకం ఉందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు దొంగ మురళి, యూత్‌ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు చదలవాడ మెర్లిన్‌ ఉన్నారు.

నర్సరీ కోర్సు ప్రారంభం

తాడేపల్లిగూడెం: ఉద్యాన రంగంలో నర్సరీ మొక్కలకు డిమాండ్‌ ఉందని ఉద్యాన వర్సిటీ వీసీ టి.జానకీరామ్‌ అన్నారు. వెంకట్రామన్న ఉద్యాన కళాశాలలో గురువారం 16 వారాల ఉద్యాన నర్సరీ నిర్వహణ కోర్సు ప్రారంభమైంది. వీసీ మాట్లాడుతూ నర్సరీలను స్థాపించాలనుకునే నిరుద్యోగ యువతకు ఈ కోర్సు ఉపయోగపడుతుందన్నారు. వర్సిటీ అధికారులు పద్మావతమ్మ, ఎం.మాధవి, ఆర్‌వీ సుజాత, టి.సుశీల, కిరణ్‌పాత్రో, వినయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్తొన్నారు.

పద్మశాలీ సంఘం కార్యదర్శిగా గిడుతూరి

ఏలూరు (టూటౌన్‌): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పద్మశాలీ సంఘం జిల్లా కార్యదర్శిగా ఏలూరుకు చెందిన గిడుతూరి వెంకట సత్యనారాయణను నియమిస్తూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వానపల్లి నాగరాజు గురువారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్య నారాయణ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల పరిధిలో పద్మశాలీ కులస్తుల అభివృద్ధి, సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.

‘నన్నయ’లో పీజీ కొత్త కోర్సు ప్రారంభం

రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్‌ కోర్సును నూతనంగా ప్రారంభిస్తున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌, జియాలజీ, జియోగ్రఫ్రీ, లైఫ్‌ సైన్సెస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌, అగ్రికల్చర్‌ సైన్సెస్‌, ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీ, ఎలక్రానిక్స్‌లలో ఏమైనా రెండు సబ్జెక్టులతో కోర్సు పూర్తి చేసిన సైన్స్‌ గ్రాడ్యుయేట్లు అర్హులు. ఏపీ పీజీ సెట్‌ ద్వారా మాత్రమే ఈ కోర్సులో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న వారు ఈనెల 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో చేరిన విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌, ఫెలోషిప్‌లు లభిస్తాయి. జియో ఇన్ఫర్మేటిక్స్‌ చేసిన విద్యార్థులకు పరిశోధనల్లో, ఉద్యో గ, ఉపాధిలోను అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇస్రో, ఎఫ్‌ఎస్‌ఐ, జీఎస్‌ఐ, డీఆర్‌డీఓ, ఎన్‌ఐఆర్డీ వంటి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఏపీ పీజీ సెట్‌ రాసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీ ఉప కులపతి ఆచార్య కె.పద్మరాజు కోరారు.

పశ్చిమాన నవశకం

నరసాపురంలో ఆక్వా వర్సిటీ

పాలకొల్లులో వైద్య కళాశాల

పేదలకు రూ.11,364.57 కోట్ల సంక్షేమ లబ్ధి

రూ.6,988.37 కోట్లతో అభివృద్ధి పనులు

 

● నరసాపురం బస్టాండును రూ.5 కోట్లతో కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేశారు.

● బియ్యపుతిప్ప వద్ద రూ.430 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌,

● రూ.490 కోట్లతో వశిష్ట గోదావరి వంతెన,

● తూర్పుగోదావరి జిల్లా విజ్జేశ్వరం నుంచి నరసాపురం వరకు రూ.1,400 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పనులు పట్టాలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి.

● రూ.220 కోట్లతో నరసాపురంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ,

● నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, భీమవరం, యలమంచిలి, మండలాలకు ఉపయోగకరంగా రూ.113 కోట్లతో నిర్మించనున్న భారీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు టెండర్‌ దశకు చేరుకున్నాయి.

● భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేయడంతో రూ.100 కోట్లతో పట్టణంలో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్ల పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.

● యనమదుర్రు డ్రెయిన్‌పై నిర్మించిన మూడు వంతెనలకు రూ.36 కోట్లతో అప్రోచ్‌ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా త్వరలో పనులు మొదలుకానున్నాయి.

● ఉండి నియోజకవర్గంలో రూ.24 కోట్లతో ఆకివీడులో మూడు, కాళ్ల, పాలకోడేరు, ఉండి మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం.

● జిల్లాలో 779 జగనన్న లేఅవుట్లలో 76,069 మంది పేదలకు ఇళ్ల స్థలాల మంజూరుతో పాటు ఇళ్ల నిర్మించే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.

● జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 248 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల (సీహెచ్‌సీ) పరిధిలోని రైతులకు రూ.20.70 కోట్ల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను 40 శాతం సబ్సిడీపై అందజేశారు.

పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్లతో 61 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల ని ర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 150 మంది విద్యార్థులు కళాశాలలో ఎంబీబీఎస్‌ విద్యను అభ్యసించనున్నారు.

తీరంలో మత్స్య ఎగుమతులు, మత్స్యసాగులో శాసీ్త్రయ పద్ధతులు పెంచేందుకు నరసాపురం మండలం సరిపల్లి వద్ద మత్స్య యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.332 కోట్లతో 40 ఎకరాల స్థలంలో యూనివర్సిటీ పరిపాలన భవనం, హాస్టళ్లు, వీసీ చాంబర్‌ పనులు చేస్తున్నారు. రానున్న ఐదేళ్లలో మరో రూ.400 కోట్లు యూనివర్సిటీకి ఖర్చు చేయనున్నారు. ఓ వైపు నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ విద్యా సంవత్సరం నుంచి లక్ష్మణేశ్వరం గ్రామంలోని తుపాన్‌ రక్షిత భవనంలో ఆక్వా కోర్సులు ప్రారంభించారు.

జగనన్న సురక్ష శిబిరాల ద్వారా జిల్లాలో 6,05,780 మంది లబ్ధిదారులకు ఎలాంటి సర్వీస్‌ చార్జీ లేకుండా 6,48,607 సర్టిఫికెట్లు జారీ చేశారు.

 

చాలా ఇబ్బంది

చంద్రబాబు చేసిన పనితో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆపసోపాలు పడి బ్యాంకుకు వెళితే డబ్బులు పడలేదని చెప్పారు. అక్కడి నుంచి ఎండలో ఉసూరుమంటూ ఇంటికొచ్చాను. జగన్‌బాబు దయతో మొన్నటి దాకా ఇంటి వద్దనే పింఛన్‌ తీసుకునేవాళ్లం.

– ఎం.నాంచారమ్మ, మొగల్తూరు

 

పింఛన్‌ కోసం తిప్పలు

బ్యాంకులో క్లోజ్‌ చేసిన పాత అకౌంట్‌కు పింఛన్‌ సొమ్ములు జమయ్యాయి. నగదు తెచ్చుకునేందుకు బ్యాంకుకు వెళి తే పాత అకౌంట్‌లో పడ్డాయ ని, మళ్లీ అకౌంట్‌ తెరిచేందుకు ఫొటోలు తెచ్చుకోమని తిప్పి పంపారు. మళ్లీ బ్యాంకుకు వెళ్లి తిప్పలు పడాల్సిందే.

– గవర భీముడు, రిక్షా కార్మికుడు, ఆకివీడు

 

వలంటీర్లతో ఇప్పించడమే మేలు

సీఎం జగన్‌ ప్రతినెలా ఒకటో తారీఖున ఉదయ మే వలంటీర్‌ ద్వారా పింఛన్‌ అందించేవారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో వలంటీర్ల ద్వారా పింఛన్‌ పంపిణీ నిలిచిపోయింది. గతనెలలో సచివాలయాల వద్ద ఇచ్చారు. ఇప్పుడు బ్యాంకు ఖాతాల్లో వేయడంతో ఇబ్బంది పడుతున్నాం.

– చక్కా సత్యానందం,

ఇలపకుర్రు, యలమంచిలి మండలం

సాక్షి, భీమవరం: వలంటీర్ల సేవలకు చంద్రబాబు అండ్‌ బ్యాచ్‌ కల్పించిన అడ్డంకులతో ఈనెలా పింఛన్‌ దారులకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటివరకు ఇంటి చెంతనే పింఛన్‌ అందుకున్న లబ్ధిదారులు గత నెలలో సచివాలయాల వద్ద క్యూ కడితే ఈనెల బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఐదేళ్లుగా ప్రతినెలా 1వ తేదీ వేకువజామునే లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్‌ సాయం అందిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వలంటీర్ల సేవలకు జడిసిన విపక్ష నేత చంద్రబాబు తన అనుకూల వర్గం ద్వారా ఈసీకి ఫిర్యాదులు చేయించారు. వలంటీర్లపై ఈసీ ఆంక్షల నేపథ్యంలో ఏప్రిల్‌ నుంచి ఇంటికే పింఛన్ల పంపిణీ నిలిచిపోవడంతో చంద్రబాబు కాలం నాటి పింఛన్‌ వెతలు మళ్లీ మొదలయ్యాయి.

జిల్లాలో 2.34 లక్షల మంది..

జిల్లాలో 2,34,161 మంది లబ్ధిదారులకు ప్రతినెలా ప్రభుత్వం రూ.68.69 కోట్ల సాయం అందజేస్తోంది. గత నెలలో లబ్ధిదారులు సచివాలయాల వద్దకు వెళ్లి పింఛన్‌ సొమ్ములు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అరకొర మంది నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్లకు వెళ్లి అధికారులు అందజేయగా అధిక శాతం మంది సచివాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా మరోమారు పచ్చ బ్యాచ్‌ ఫిర్యాదుతో అకౌంట్లు ఉన్న లబ్ధిదారులకు పింఛన్‌ సొమ్ములు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమచేయాలని, లేనివారికి ఇళ్లకు వెళ్లి అందజేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.

బ్యాంకుల వద్ద పడిగాపులు

జిల్లాలో 1,68,179 మంది లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు సొమ్ములు జమచేయగా, ఖాతాలు లేని 65,982 మంది లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పంపిణీకి అధికారులు చర్యలు తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు గురువారం నాటికి 87 శాతం మంది లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పింఛన్‌ సొమ్ము అందజేశారు. ఇదిలా ఉండగా మండుటెండలో మండల కేంద్రాలు, మేజర్‌ పంచాయతీల్లోని బ్యాంకుల వద్దకు వెళ్లి నగదు తీసుకునేందుకు పల్లెల్లోని దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కుటుంబసభ్యులను వెంటపెట్టుకుని ఆటోల్లో వెళ్లి పింఛన్‌ తెచ్చుకోవాల్సి వచ్చిందని పలువురు వాపోయారు. రెండు నెలల క్రితం వరకు వలంటీర్లు వేకువజామునే ఇంటికి వచ్చి చేతికందించే వారని, చంద్రబాబు అధికారంలోకి రాకుండానే తమను ముప్పతిప్పలు పెడుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెదతాడేపల్లి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో పెన్షన్‌ కోసం వేచి ఉన్న వృద్ధులు

న్యూస్‌రీల్‌

అభివృద్ధి పరుగులు

ఆక్వా వర్సిటీ మణిహారం

మౌలిక వసతులు

చెంతకే సేవలు

ప్రధాన రహదారులకు మహర్దశ

ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ–మార్టేరు రోడ్డును రూ.4 కోట్లలో అభివృద్ధి చేశారు.

పెనుగొండ–ములపర్రు రోడ్డు విస్తరణ పనులను రూ.18 కోట్లతో చేపట్టారు.

తణుకు–అత్తిలి రోడ్డును రూ.26 కోట్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు.

తాడేపల్లిగూడెంలో రూ.36 కోట్లతో కోడేరు –నల్లజర్ల (కేఎన్‌ రోడ్డు)ను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేశారు.

ఆకివీడు మండలం పెదకాపవరం–కొల్లేరు, ఉండి మండలం పాములపర్రు, కాళ్ల మండలం జువ్వలపాలెం, కలవపూడి, బొండాడ రోడ్లను రూ.50 కోట్లతో అభివృద్ధి చేశారు.

 

ఎండల్లో ఇబ్బంది

నా బ్యాంకు అకౌంట్‌ మనుగడ లేక ఈ రోజు పెన్షన్‌ తీసుకోలేకపోయాను. ఇంటి దగ్గరకు వలంటీర్లు పెన్షన్‌ తీసుకువచ్చిన రోజులే బాగుండేవి. ఇప్పుడు ఎండల్లో అనేక ఇబ్బందులు పడుతున్నాం. నాతోపాటు మరో ఇద్దరు సహాయకులుగా వచ్చినా డబ్బులు అందలేదు.

– చిట్టిరోజు సుబ్బలక్ష్మి, మామిడితోట, తాడేపల్లిగూడెం

ఇదంతా చంద్రబాబు వల్లే..

పింఛన్‌ తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రతి నెలా ఒకటో తారీఖున జగన్‌ బాబు పంపిన వలంటీర్లు మాకు ఇంటి వద్దనే పెన్షన్‌ ఇచ్చేవారు. ఇంతటి మండుటెండల్లో మమ్మల్ని ఇలా తిప్పడం వల్ల చంద్రబాబుకు ఏమోస్తుందో అర్థం కావడం లేదు.

– ఎం.మంగమ్మ, పెదతాడేపల్లి

 

ప్రగతి పరవళ్లు
1/11

ప్రగతి పరవళ్లు

ప్రగతి పరవళ్లు
2/11

ప్రగతి పరవళ్లు

ప్రగతి పరవళ్లు
3/11

ప్రగతి పరవళ్లు

ప్రగతి పరవళ్లు
4/11

ప్రగతి పరవళ్లు

ప్రగతి పరవళ్లు
5/11

ప్రగతి పరవళ్లు

ప్రగతి పరవళ్లు
6/11

ప్రగతి పరవళ్లు

ప్రగతి పరవళ్లు
7/11

ప్రగతి పరవళ్లు

ప్రగతి పరవళ్లు
8/11

ప్రగతి పరవళ్లు

ప్రగతి పరవళ్లు
9/11

ప్రగతి పరవళ్లు

ప్రగతి పరవళ్లు
10/11

ప్రగతి పరవళ్లు

ప్రగతి పరవళ్లు
11/11

ప్రగతి పరవళ్లు

Advertisement

homepage_300x250