Sakshi News home page

‘శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త.. ఎవడక్కడ.. మీ స్థాయి ఎంత.. మీరు ఎంత..’ అని నరసన్నపేట సీఐ, ఎస్‌లను ఉద్దేశించి కూన నోరు పారేసుకున్నారు. కోవిడ్‌ నిబంధనల మేరకు ముగ్గురే లోపలికి రావాలి అన్నందుకు పోలీసు అధికారులపై పై విధంగా విరుచుకుపడ్డారు.

Published Tue, May 7 2024 11:15 AM

‘శంకర

టీడీపీ ఆందోళనలకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకుని కూన రవికుమార్‌ను నిలువరించేందుకు ఇంటికెళ్లిన పోలీసు అధికారులను నెట్టేసి నోటికొచ్చినట్టు దూషించారు. ‘నా ఇంటికి పోలీసులను పంపిస్తే నీ కాళ్లు ఇరగకొట్టక(బూతు)పోతే చూద్దువుగాని.. నిన్ను ఉద్యోగం, యూనిఫాం లేకుండా చేస్తా...నీ అంతు చూస్తాను ఏమనుకుంటున్నావో..’ అంటూ భౌతికంగా శ్రీకాకుళం టూటౌన్‌ సీఐ ఆర్‌ఈసీహెచ్‌ ప్రసాద్‌ను కూన నెట్టేశారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

దీ టీడీపీ నాయకుడు కూన రవికుమార్‌ ట్రాక్‌ రికార్డు. అధికారులంటే తన ఇంటిలో పని మనుషులే అన్నంత అలుసు ఆయనకు. అధికారంలో ఉన్నంతసేపూ ఆయన దౌర్జన్యాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ఆయన్ని చూస్తేనే ఉద్యోగులు, అధికారులు హడలెత్తిపోయిన పరిస్థితి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాక కూడా ఆయన నోటి దురుసు, దౌర్జన్యం తగ్గలేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఈ ఐదేళ్లలో ఎంతో మంది ఉద్యోగులను, అధికారులను దూషించారు. నోటికొచ్చినట్టు తిడుతూ బెదిరించారు. ఈయన నిర్వాకంపై పోలీసు స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. బెయిల్‌పై విడుదలైన పరిస్థితులు ఉన్నాయి. చివరికి రవికుమార్‌తో ప్రాణహాని ఉందని ఉద్యోగులు ఆందోళనకు దిగేంత వరకు వెళ్లారు. రౌడీషీట్‌ ఓపెన్‌ చేయాలని కూడా డిమాండ్‌ చేశారు. గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్‌ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్‌ఓ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్‌ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్‌ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని కూన రవికుమార్‌ ఏకంగా పొందూరు తహసీల్దార్‌ రామకృష్ణను బెదిరించారు. పింఛన్ల విషయంలో తన మాట విన లేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీకి వార్నింగ్‌ ఇచ్చా రు. పనుల విషయంలో తాను చెప్పినట్టు వినకపోతే కుర్చీలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా అని.. పంచాయతీ కార్యదర్శులను కూన రవికుమార్‌ భయపెట్టారు. ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్‌చార్జి ఈఓపీఆర్‌డీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కరోనా నిబంధనల దృష్ట్యా గేటు వేస్తే వీరంగం సృష్టించారు.

ఆగ్రహంతో ఉద్యోగులు

కూన రవికుమార్‌తో పాటు ఆయన సోదరుడు అనుసరించిన తీరుపై ప్రభుత్వ ఉద్యోగులంతా గుర్రుగానే ఉన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చా లా సందర్బాల్లో ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేశారు. అధికారంలో లేనప్పుడే ఇలా ఉంటే పొరపాటున అధికారమిస్తే బతకనిస్తారా? అని ఆవేదనతో ఉన్నారు. ఏ పదవీ లేకుండానే అధికారులను బెదిరించడం, తంతాను అనడం.. బట్ట లూడదీసి కొడతానని బెదిరించడం వంటివి పరిణామాలను అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారులే ఇబ్బంది పడుతుంటే.. చిన్నపాటి ఉద్యోగుల పరిస్థితి మరింత భయంకరమని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పలు సందర్భాల్లో ఆందోళనకు దిగడమే కాకుండా రౌడీషీట్‌ ఓపెన్‌ చేయాలని డిమాండ్‌ చేసే వరకు వెళ్లారు. తమపై దౌర్జన్యం చేస్తున్న కూన రవి అండ్‌కోకు తగిన సమయంలో బుద్ధి చెబుతామని ఉద్యోగులంతా ఒక నిర్ణయానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి.

కూన రవి సోదరుడిదీ అదే దౌర్జన్యం

శ్రీకాకుళంలోని పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఇంజనీర్‌ కార్యాలయంలో కూన రవికుమార్‌ సోదరుడు, కాంట్రాక్టర్‌ వెంకట సత్యనారాయణ బరితెగించి వ్యవహరించాడు. తాను వేస్తున్న రోడ్డు పనుల విషయంలో నిబంధనలు పాటించడం లేదని, నాణ్యతా లోపాలున్నాయని, వాటిని సరిచేసుకోవాలని చెప్పినందుకు అసిస్టెంట్‌ ఇంజినీర్‌ మహంతిని కొట్టేంత పనిచేశారు. కార్యాలయంలో అందరు ఉద్యోగుల ముందే అసిస్టెంట్‌ ఇంజనీర్‌ మీదకొచ్చి దౌర్జన్యం చేయడమే కాకుండ చెయ్యి ఎత్తి తన రౌడీయిజాన్ని చూపించారు. ‘ఎంత ధైర్యం రా... నాకే నోటీసు ఇస్తావా...నువ్వు ఏమనుకుంటున్నావ్‌...నేను కూన రవికుమార్‌ బ్రదర్‌ని.. జాగ్రత్త...ఇక్కడే పాతేస్తా...’ అంటూ ఇంజినీర్‌ మహంతిపై కూన వెంకట సత్యనారాయణ రెచ్చిపోయాడు. అంతటితో ఆగలేదు.. ఏకంగా కొట్టేసేంతలా చెయ్యి చాచి బెదిరించాడు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. రాయలేని భాషలో పరుష పదజాలంతో వీరంగం సృష్టించారు.

‘శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త.. ఎవడక్కడ.. మీ స్
1/2

‘శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త.. ఎవడక్కడ.. మీ స్

‘శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త.. ఎవడక్కడ.. మీ స్
2/2

‘శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త.. ఎవడక్కడ.. మీ స్

Advertisement

homepage_300x250