Sakshi News home page

adsolute video ad after first para

document.addEventListener("DOMContentLoaded", function() { var newsContent = document.querySelector(".news-story-content"); var paragraphs = Array.from(newsContent.querySelectorAll("p")); var firstParagraph = paragraphs.findIndex(function(paragraph) { return !paragraph.closest('.bullet_list'); },1); if (firstParagraph) { var secondParagraph = paragraphs[firstParagraph + 1]; var script = document.createElement("script"); script.async = true; script.id = "AV62ff84d96d945e7161606a7a"; script.type = "text/javascript"; script.src = "https://tg1.playstream.media/api/adserver/spt?AV_TAGID=62ff84d96d945e71…"; secondParagraph.parentNode.insertBefore(script, secondParagraph.nextSibling); } });

జగనన్నకు అండగా నిలవండి

Published Fri, Apr 19 2024 1:30 AM

మాట్లాడుతున్న మంత్రి ఉషశ్రీచరణ్‌  - Sakshi

రొద్దం: టీడీపీ అధినేత చంద్రబాబు మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ఆయన పరిపాలనకు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనకు ఎంత తేడా ఉందో గమనించాలని మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీచరణ్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని కంబాలపల్లి, తురకలాపట్నం, ఆర్‌ కుర్లపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వల్ల ప్రతి ఒక్కరికీ లబ్ధి చేరుకూరిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు జన్మభూమి కమిటీలు పెట్టి ఆ పార్టీ నాయకులకే పథకాలు అందించారని విమర్శించారు. పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న జగనన్నకు అందరూ మళ్లీ అండగా నిలవాలన్నారు. ఈనెల 25న తన నామినేషన్‌ కార్యక్రమం ఉంటుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ బి.నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బి.తిమ్మయ్య, నాయకులు మారుతీరెడ్డి, నరసింహులు, రాజ్‌గోపాల్‌రెడ్డి, అక్కులప్పయాదవ్‌, లక్ష్మినారాయణరెడ్డి, వజీర్‌బాషా, ఎన్‌ నారాయణరెడ్డి, కేపీ శ్రీనివాసులు, రాజారెడ్డి, వినయ్‌రెడ్డి, ఉజ్జినప్ప, సి.నారాయణరెడ్డి, నరేంద్రరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

మంత్రి ఉషశ్రీచరణ్‌

పెద్దగువ్వలపల్లిలో రైతులతో మాట్లాడుతున్న 
మంత్రి ఉషశ్రీచరణ్‌
1/1

పెద్దగువ్వలపల్లిలో రైతులతో మాట్లాడుతున్న మంత్రి ఉషశ్రీచరణ్‌

Advertisement

adsolute_video_ad

homepage_300x250