Sakshi News home page

adsolute video ad after first para

భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై నిషేధం ఎత్తివేత 

Published Wed, Feb 14 2024 9:24 AM

United World Wrestling Lifts Suspension Of Wrestling Federation of India - Sakshi

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)పై విధించిన సస్పెన్షన్‌ను యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) మంగళవారం ఎత్తివేసింది. మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై న్యాయపోరాటం చేసిన రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, వినేశ్‌ ఫొగాట్, సాక్షి మలిక్‌లపై ఎలాంటి వివక్ష చూపరాదని పేర్కొంది.

అదే విధంగా.. కక్ష్యసాధింపు చర్యలు చేపట్టకుండా అందరు రెజర్లకు సమాన అవకాశాలు కల్పించాలని డబ్ల్యూఎఫ్‌ఐకి యూడబ్ల్యూడబ్ల్యూ సూచించింది. సస్పెన్షన్‌ తొలగిపోవడంతో పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లంతా మన జెండా కిందే పోటీపడొచ్చు. పతకం గెలిస్తే పోడియంలో మన పతాకమే రెపరెపలాడతుంది. గడువులోగా డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్ని నిర్వహించలేకపోవడంతో గత ఆగస్టులో సస్పెన్షన్‌ వేటు వేసింది.   

Advertisement

adsolute_video_ad

homepage_300x250