Sakshi News home page

adsolute video ad after first para

Kaia Arua Death: క్రికెట్‌ ప్రపంచంలో పెను విషాదం.. 33 ఏళ్ల వయసులోనే స్టార్‌ ఆల్‌రౌండర్‌ మృతి

Published Thu, Apr 4 2024 1:52 PM

Papua New Guinea Women Cricketer Kaia Arua Dies Aged 33 - Sakshi

క్రికెట్‌ ప్రపంచంలో పెను విషాదం​ చోటు చేసుకుంది. పపువా న్యూ గినియా మహిళా క్రికెటర్‌ కయా అరువా 33 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. అరువా మృతికి కారణాలు తెలియరాలేదు. అరువా అకాల మరణాన్ని దృవీకరిస్తూ ఐసీసీ ట్వీట్‌ చేసింది. 

2010లో తొలిసారి పపువా న్యూ గినియా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అరువా.. అనతికాలంలోనే స్టార్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. లెఫ్ట్‌ ఆర్మ్‌ రిస్ట్‌ స్పిన్నర్‌, రైట్‌ హ్యాండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ అయిన అరువా.. పపువా న్యూ గినియా  తరఫున 47 అంతర్జాతీయ టీ20లు ఆడి 341 పరుగులు, 59 వికెట్లు తీసింది. బ్యాట్‌తో పెద్దగా రాణించని అరువా.. బంతితో చెలరేగింది. అరువా తన స్వల్ప కెరీర్‌లో 3 సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించింది.

ఆమె అత్యుత్తమ గణాంకాలు (5/7) తన జట్టు తరఫున రెండో అత్యుత్తమ గణాంకాలుగా నమోదై ఉన్నాయి. అరువా కొంతకాలం పాటు తన జట్టు సారథ్య బాధ్యతలు కూడా చేపట్టింది. అరువాకు కెప్టెన్సీలో వంద శాతం సక్సెస్‌ రేట్‌ ఉంది.

ఆమె తన జట్టును 29 అంతర్జాతీయ టీ20ల్లో ముందుండి నడిపించి అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సొంతం చేసుకుంది. అరువా తన దేశంలో మహిళల క్రికెట్‌ అభివృద్దికి ఎంతో కృషి​ చేసింది. తూర్పు ఆసియా పసిఫిక్‌ మహిళల క్రికెట్‌లో అరువాకు తిరుగులేని ఆల్‌రౌండర్‌గా పేరుంది.

Advertisement

adsolute_video_ad

homepage_300x250