Sakshi News home page

adsolute video ad after first para

దొంగతనం కేసులో ముగ్గురికి జైలుశిక్ష

Published Sat, Apr 20 2024 1:15 AM

-

ఖలీల్‌వాడి: బంగారు ఆభరణాలు దొంగిలించిన ఘటనలో ముగ్గురికి జైలు శిక్షను విధించినట్లు జిల్లా జడ్జి సునీత కుంచాల శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. డిచ్‌పల్లి మండలం సుద్దులంకు చెందిన నీరడి అరుణ్‌, నీరడి రాజమణి, రెంజల్‌ మండలం కుర్నాపల్లికి చెందిన కొండపల్లి సావిత్రి, కోటగిరి మండలం కల్లూరుకు చెందిన సాయిలు 2022 మే 8న నగరంలోని గౌతంనగర్‌లో ఉన్న బోయిని పోచమ్మ ఇంటికి వెళ్లి ఇల్లు అద్దెకు కావాలని ఇంట్లోకి ప్రవేశించారు. వీరు పోచమ్మపై ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించి గొంతు నులిమి హత్య చేశారు. నిందితులపై సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. విచారణలో అరుణ్‌, సాయిలు, రాజమణి దొంగతనం చేసినట్లు రుజువు కావడంతో వీరికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు దొంగసొత్తు కలిగి ఉన్నందున మరో రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. వేయి జరిమానా విధించారు. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. కాగా పోచమ్మ పోస్టుమార్టంలో సహజ గుండెజబ్బుతో మృతి చెందినట్లు రిపోర్టు రావడంతో నిందితులపై హత్య నేరం కాకుండా దొంగతనం, దొంగసొత్తు కలిగి ఉన్నందున కేసు నమోదు చేసి శిక్షను విధించినట్లు జడ్జి పేర్కొన్నారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250