Sakshi News home page

Chhattisgarh: నవమి వేళ.. శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠ!

Published Wed, Apr 17 2024 11:31 AM

Chhattisgarh Ram Janaki will be Consecrated - Sakshi

శ్రీరామ నవమి సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గీర్‌ చంపా జిల్లాలోని కులీపోతా గ్రామంలో  శ్రీసీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమంలో  నాలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొంటున్నారు. చైత్ర నవరాత్రుల ప్రారంభం నుంచి ఇక్కడ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ దక్షిణముఖి హనుమాన్  30 ఏళ్లుగా గ్రామంలో కొలువైవున్నాడన్నారు. ఇప్పుడు ఈ ఆలయ పునరుద్ధరణ జరిగిందని, ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఆలయ ప్రాంగణంలో శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని తెలిపారు. ఏప్రిల్ 16న కలశ స్థాపన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

శ్రీరామనవమి రోజున ఉదయం విగ్రహ ప్రతిష్ఠ  జరుగుతుందని, అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పూర్ణాహుతి, మహా హారతి, ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి అఖండ హరినామ సంకీర్తన ప్రారంభమవుతుందని, ఇది ఏప్రిల్ 25 వరకు కొనసాగుతుందని తెలిపారు. హనుమంతుని జయంతిని ఏప్రిల్ 23 న నిర్వహించనున్నామన్నారు.

Advertisement

homepage_300x250