Sakshi News home page

adsolute video ad after first para

నేను మంచి తల్లినా కాదా?! మామాఎర్త్‌ సీఈఓ పోస్టు వైరల్‌

Published Wed, Apr 17 2024 8:58 PM

Am I A Bad Mother: Mamaearth Founder Post Strikes A Chord - Sakshi

ఒకప్పుడు ఆడవాళ్లంటే వంటింటికే పరిమితం అయ్యేవారు. అరకొర చదువులు చదివించి.. చిన్న వయసులోనే పెళ్లి చేసి అత్తరింటికి పంపిచేశారు. అమ్మాయిలకు పెద్ద చదువులు చెప్పించడం, ఉద్యోగాలకు పంపడం అన్న మాటే లేదు. కానీ రోజులు, పరిస్థితులు మారాయి.  నేటి కాలంలో మగవారితో సమానంగా చదువుతున్నారు అమ్మాయి. ఇటు ఉద్యోగాలు కూడా చేస్తూ తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు

పెళ్లి అయ్యాక ఓ వైపు ఇంటిని చూసుకుంటూ మరోవైపు ఉద్యోగం చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే కొన్నిసార్లు వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతలను రెండింటినీ బ్యాలెన్స్‌ చేయడం కష్టమవుతుంది. సగటు వర్కింగ్‌ విమెన్‌కు ఉండే సవాళ్లు తాజాగా బ్యూటీ బ్రాండ్ మామాఎర్త్‌  సహ-వ్యవస్థాపకురాలు, సీఈఓ గజల్ అలఘ్‌కు కూడా ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ భావోద్వేగ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

గజల్‌ తన కొడుకును తొలిరోజు పాఠశాలకు తీసుకెళ్లాలని అనుకుంది. కానీ తనకున్న పనుల వల్ల అది సాధ్యపదడలేదు. దీంతో ఆమె ఎంతో బాధపడిపోయింది. కుమారుడితో కలిసి మొదటి రోజు పాఠశాలకు వెళ్లకపోడంతో ‘నేను చెడ్డ తల్లినా?’ అనే ప్రశ్న తన మదిలో మెదిలినట్లు చెప్పుకొచ్చింది. చివరికి తన కొడుకును వాళ్ల నానమ్మతో స్కూల్‌కు పంపినట్లు పేర్కొంది.

‘నా కుమారుడిని తొలి రోజు పాఠశాలకు తీసుకెళ్లడానికి కుదర్లేదు. అప్పుడు ను మంచి తల్లిని కాదా? అనే ప్రశ్న నా మదిలో మెదిలింది.  ఆ సమయంలో చాలా ఏడ్చా. బాధ పడ్డా. ధైర్యం తెచ్చుకొని వాళ్ల నాన్నమ్మతో స్కూల్‌కి పంపించా. మీరు ఎంత కోరుకున్నా కొన్నిసార్లు సెలవు తీసుకోవడం కుదదు. అది ఎంత విలువైనది అయినా సరే.  అలా మొదటిరోజు స్కూల్‌కు వెళ్లేందుకు కుమారుడు చూపిన ఉత్సాహం, చిరునవ్వు, కన్నీళ్లు, పాఠశాల్లో అడుగు పెట్టగానే ఉపాధ్యాయులు, పిల్లల్ని చూసి కలిగే ఆందోళన.. ఇవన్నీ చూడలేకపోయా’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని షేర్‌ చేశారు.

అదేవిధంగా తన కుటుంబ సపోర్ట్‌ను కూడా అలఘ్‌ ఈ పోస్టులో వివరించారు. నేను, వరుణ్‌ అలగ్‌, కుమారుడు అగస్త్య, మా అత్త ఐదేళ్ల కిత్రం ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు నాలుగుతరాల వాళ్లంతా ఒకే ఇంట్లోనే ఉంటున్నాం. ఉద్యోగం చేస్తున్న ప్రతిఒక్కరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. సొంతవాళ్లే కావాలనేం లేదు. దగ్గరి బంధువులు, అర్థం చేసుకునే స్నేహితులున్నా పర్లేదు. అయితే, ప్రతీ విషయంలోనూ లాభాలు, నష్టాలు ఉంటాయి. అయినప్పటికీ ఉమ్మడి కుటుంబం అనేది పిల్లలకు అద్భుతమైన వాతావరణం. తల్లులు కెరీర్‌ లక్ష్యాలను పక్కనపెట్టకుండా.. ప్రేమ, రక్షణ అందించే ప్రదేశం’ అంటూ సుదీర్ఘ మైన పోస్ట్‌ రాసుకొచ్చారు. 

Advertisement

adsolute_video_ad

homepage_300x250