Sakshi News home page

దేశ ఐటీ రంగంలో టాప్‌.. అత్యధిక వేతనం ఈయనదే..

Published Wed, Apr 17 2024 8:19 PM

Cognizant CEO Ravi Kumar highest paid CEO in Indian IT sector - Sakshi

దేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ సింగిశెట్టి నిలిచారు. ‘మింట్‌’ నివేదిక ప్రకారం.. కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ గత సంవత్సరం వేతన పరిహారంగా 22.56 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకున్నారు. 

కంపెనీ ఫైలింగ్‌ ప్రకారం, రవి కుమార్ సింగిశెట్టి గత సంవత్సరం మొత్తంగా 22.56 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకోగా ఇందులో 20.25 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.169.1 కోట్లు) విలువైన షేర్లను అందుకున్నారు. గత ఏడాది కాగ్నిజెంట్ ఆదాయం రూ.19.35 బిలియన్‌ డాలర్లు ఉండగా ఇందులో సీఈవో రవి కుమార్ వేతన పరిహారం 0.11 శాతంగా ఉంది.

ఇతర ఐటీ సీఈవోల వేతనాలు ఇలా..

  • విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే రూ. 10.1 మిలియన్‌ డాలర్లు (రూ. 83 కోట్లు) 
  • హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ సీఈవో విజయకుమార్ 10.65 మిలియన్‌ డాలర్లు (రూ. 88 కోట్లు)
  • అసెంచర్‌ సీఈవో జూలీ స్వీట్‌ 31.55 మిలియన్‌ డాలర్లు (రూ.263 కోట్లు)
  • ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 6.8 మిలియన్లు ( రూ. 56.4 కోట్లు)
  • టీసీఎస్‌ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ 3.5 మిలియన్‌ ( రూ. 29.16 కోట్లు) 

Advertisement

homepage_300x250