Sakshi News home page

హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

Published Thu, Apr 18 2024 9:35 AM

మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  - Sakshi

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 130 రోజులైనా రూ.రెండు లక్షల రైతు రుణాన్ని ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. తమ హయాంలో పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో పంటలు చేతికి అందక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అంశాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నందుకు ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడవద్దని, తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థులు స్థానికేతరులని, స్థానికంగా ఉండే మన్నె శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

.
.

homepage_300x250