Sakshi News home page

adsolute video ad after first para

పవన్‌కు షాకిచ్చిన అల్లు అర్జున్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌

Published Wed, Apr 17 2024 6:50 PM

Why Pawan Kalyan Pampering Other Heroes Fans - Sakshi

సినిమా వాళ్లకు అభిమానులు ఉండటం సహజం. తమ హీరో ఇంత గోప్పవాడు అంటూ ఫ్యాన్స్‌ కూడా ఊహించుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో అద్దాల మేడలో ఉన్న సినిమా హీరోలు ఎప్పుడైతే  జ‌నం మ‌ధ్య‌కు వస్తారో వారి అస‌లు స్వ‌రూపం మెల్లగా బ‌య‌ట‌ప‌డుతూ ఉంటుంది. ఈ క్రమంలో సినిమాల్లో పవర్‌ స్టార్‌గా ఉన్న పవన్‌ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో ఆయన అసలు రూపం ఏంటో జనాలకు తెలిసొచ్చింది. సీఎం అవుదామనే మోజుతో పాలిటిక్స్‌లోకి వచ్చిన వవన్‌ను క‌నీసం ఎమ్మెల్యేగా కూడా ప్రజలు గెలిపించలేదు. 

క‌మ‌ల్ హాస‌న్,రజనీకాంత్‌,విజయ్‌ కాంత్‌,చిరంజీవి,ఉపేంద్ర వంటి స్టార్స్‌ అందరూ కూడా రాజకీయాలను టచ్‌ చేసిన వారే.. రాజ‌కీయంగా ఒక ట్ర‌య‌ల్ వేద్దామ‌ని ఈ స్టార్స్‌ అందరూ గట్టిగానే ప్ర‌య‌త్నించారు. రాజ‌కీయంలో కొన్ని డ‌క్కామొక్కీలు తిని పోరాటం చేశారు. కానీ సినిమా ఇమేజ్‌ ఇక్కడ పనికిరాదని గ్రహించారు. తొందరగానే ప్ర‌జ‌ల స్పంద‌న ఏమిట‌నేది వారికి అర్థ‌మ‌య్యింది. దీంతో చిల్లర మాటలు మాట్లాడకుండా కాస్త గౌరవంగానే రాజకీయాలు చేశారు. వీరిలో రజనీకాంత్‌ అయితే రాజకీయ యుద్ధంలో అడుగు పెట్టకుండానే మిడిల్‌ డ్రాప్‌ అయ్యారు. ప్ర‌జాద‌ర‌ణ పొంద‌క‌పోతే ప‌రువు పోతుంద‌నే భావ‌న‌తో నీట్‌గా తప్పుకున్నారు.

ఇక్కడ చెప్పుకున్న ఈ హీరోలు అందురూ ఎవరి సపోర్ట్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చి రాణించిన వారు కావడం విశేషం. క‌మ‌ల్ హాస‌న్,రజనీకాంత్‌,విజయ్‌ కాంత్‌,చిరంజీవి,ఉపేంద్ర ఈ స్టార్స్‌ అందరూ కూడా వార‌స‌త్వాల‌తోనో, కుటుంబసభ్యులను అడ్డు పెట్టుకుని సినిమాల్లో ఎదిగిన వారు కాదు. అందుకే వారిలో విజ్ఞ‌త కనిపించింది. వారు రాజకీయాల నుంచి తప్పుకున్నా వారిపై సమాజంలో గౌరవం మిగిలే ఉంది.

కానీ పవన్‌ కల్యాణ్‌ పరిస్థితి వేరు. తన అన్నయ్య మెగాస్టార్‌ లేకపోతే.. ఎందుకూ అవసరం లేని ఒక ఆకతాయిగా మిగిలిపోయేవాడు. ఇదీ గ్రహించే ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా కూడా గెలిపించలేదు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి 15 ఏళ్లు అవుతున్నా కనీసం సర్పంచ్‌ స్థాయి నాయకుడిని కూడా ఆయన తయారు చేయలేకపోయాడు. దీనంతటికి కారణం ప‌వ‌న్ మాటల్లో ఉన్న కష్టం చేత‌ల్లో ఎక్కడా కనిపించదు. కేవ‌లం ఎవ‌రినో ఓడించాల‌నే ధోర‌ణితోనే ఆయన రాజకీయ జీవితం కొనసాగుతుంది. ఇలాంటి ధోరణి తన సినిమాల్లో కూడా కనిపించదే.. సినిమాల్లో అయినా ఇలాంటి నీతిలేని పాత్రలో కనిపించే సాహసం పవన్‌ చేయగలుగుతాడా..?

ఆ హీరోల అభిమానులకు గాలం వేస్తున్న పవన్‌
జీవితంలో తాను గెలవ‌క‌పోయినా ఫ‌ర్వాలేదంటున్న పవన్‌.. సీఎం జ‌గ‌న్ ఓడిపోవాలని కోరుకుంటూనే చంద్ర‌బాబును గెలిపించాలని తాపత్రయం పడుతున్నాడు. ఈ క్రమంలో బాబు చేతిలో పావుగా మారిన పవన్‌ ప్రజల్లో పరువు పోగొట్టుకోవ‌డానికి అయినా రెడీ అయిపోయాడు. అందుకే చంద్రబాబు కోసం ఇతర హీరోల ఫ్యాన్స్‌ను అడుక్కునే స్థాయికి దిగజారిపోయాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే మహేష్ బాబు అభిమానులకు ఓసారి బిస్కెట్ వేశాడు. తనకంటే మహేష్ పెద్ద సూపర్‌ స్టార్ అన్నాడు. మహేష్ తనకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాడని కూడా గొప్పలు చెప్పాడు.

ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో   ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్‌ లాంటి స్టార్‌ హీరోల ఫ్యాన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేసే ప్లాన్‌ పవన్‌ వేస్తున్నాడు. వారి అభిమానులను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడు. ప్రభాస్‌ గారు మా వాళ్లే.. ఎన్టీఆర్‌.. అల్లు అర్జున్‌ కూడా నాకు కావాల్సిన వాళ్లే అంటూ వారి అభిమానులందరూ నాకు సహకరించాలని వేడుకుంటున్నాడు. పవన్‌ నైజం తెలిసే ఇప్పటి వరకు కనీసం చిన్న హీరో కూడా జనసేనకు సపోర్ట్‌గా బయటకు రాలేదు. ఎవరూ లేకపోవడంతో జబర్ధస్త్‌గా నాగబాబు కమెడియన్‌ బ్యాచ్‌ను రంగంలోకి దింపాడు.

తమ్ముడి కోసం మెగాస్టార్‌ రూ. 5 కోట్లు విరాళం అయితే ఇచ్చారు. కానీ వారి ఫ్యాన్స్‌ అసోసియేషన్ నుంచి పవన్‌ కోసం పనిచేస్తున్నట్లు ఎక్కడా ప్రకటన లేదు. కానీ, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సభల్లో ప్రభాస్‌, ఎన్టీఆర్‌, మహేశ్‌ అభిమానులు తమ హీరో ఫోటోతో పాటు జగన్‌ గారి ఫోటోను చేర్చి కనిపించడం విశేషం. ఇప్పుడు కొత్తగా ఓట్ల కోసం పవన్‌ వేస్తున్న గాలంలో ప్రభాస్‌,అల్లు అర్జున్‌,ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఎట్టిపరిస్థితిల్లో పడరని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మంత్రి అమర్నాథ్ సమక్షంలో  ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్  వైసీపీ పార్టీలో చేరారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇండస్ట్రీలో ఇతర హీరోలకు సంబంధించిన ఏ వేడుకలు జరిగినా కూడా పవన్‌ ఫ్యాన్స్‌ ఎలాంటి గోల చేస్తారో సినిమా అభిమానులకు చెప్పక్కరలేదు. ఇప్పుడు కూడా పవన్‌, ఆయన అభిమానులు ఓట్ల కోసం మాత్రమే  ఇతర హీరోల అభిమానలను ఎలా బుట్టలో దించాలనే ప్రయాత్నాలు చేస్తున్నారు. కానీ  ప్రభాస్, అల్లు అర్జున్ , ఎన్టీఆర్‌, మహేశ్‌ ఫ్యాన్స్‌ అంత అమాయికులేం కాదు.. గతాన్ని వారు మరిచిపోలేదు. సమయం వచ్చింది ఇప్పుడు సరిగ్గా పవన్‌కు బుద్ధి చెప్తారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250