Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

నెట్టింట వైరల్‌ అవుతున్న 'సిల్క్ స్మిత' మదర్‌ ఫోటో

Published Sat, Mar 16 2024 4:36 PM

Silk Smitha Mother Photo Viral In Social Media - Sakshi

సిల్క్ స్మిత.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. బావ బావమరిది చిత్రంలోని బావలు సయ్యా అనే పాటతో ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. ఇప్పటికీ ఆ పాట రేంజ్‌ ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. సిల్క్‌ స్మిత మరణించి 35 ఏళ్లు దాటింది. అయినా కూడా ఆమె పేరును ఇండస్ట్రీ మరిచిపోలేదు. ఏదో రూపంలో ఆమె పేరు తరుచూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా సిల్క్‌ స్మిత అమ్మగారి ఫోటో నెట్టింట వైరల్‌ అవుతుంది.

డిసెంబర్ 2, 1960లో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో రాములు, సరసమ్మలకు జన్మించిన సిల్మ్ స్మిత అసలు పేరు విజయలక్ష‍్మి.  తమిళ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో 450కి పైగా చిత్రాల్లో నటించింది.  అలా సినీ ఇండస్ట్రీలో 17 ఏళ్ల ఓ వెలుగు వెలిగిన  సిల్క్ స్మిత జీవితం అర్ధాంతరంగా ముగిసింది. సెప్టెంబర్ 23, 1996న 35 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. స్టార్‌ హీరోలు నటించిన పెద్ద చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. సిల్క్ తమిళం, మలయాళం, తెలుగు, హిందీతో సహా అన్ని భాషల్లోని చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో మెరిసింది.

మలయాళ స్టార్ మోహన్‌లాల్‌, కోలీవుడ్ స్టార్ కమల్‌హాసన్‌ వంటి పెద్ద స్టార్ల చిత్రాల్లో నటించింది. వెండితెరపై ఆమెకు గొప్ప ప్రశంసలు దక్కినప్పటికీ.. ఆమె తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా సాగలేదు. ఆ తర్వాత ఆమె ఓ వైద్యుడిని వివాహం చేసుకుందని.. ఆమె సంపాదన మొత్తాన్ని సినిమాల్లో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. అతను నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలవ్వడంతో కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని కోల్పోయిందని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో సిల్క్ స్మిత సెప్టెంబరు 23, 1996న ఓ హోటల్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకుంది.

అప్పట్లో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో సిల్క్ స్మిత.. తన జీవితం సంతోషంగా లేదని.. నమ్మినవారే మోసం చేశారంటూ.. అందుకే ఈ లోకాన్ని విడిచివెళుతున్నట్లు రాసుకొచ్చింది. తాజాగా తన అమ్మగారి ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250