Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Vicky Kaushal-Katrina Kaif Wedding: సమంత బాటలో కత్రీనా.. సేమ్‌ సీన్‌ రిపీట్‌

Published Fri, Dec 10 2021 11:12 AM

Katrina Kaif in Tears During Wedding With Vicky Kaushal - Sakshi

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ కత్రినా కైఫ్‌-విక్కీ కౌశల్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్తాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో.. అత్యంత సన్నిహితులు సమక్షంలో గురువారం అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం విక్ట్రీనా పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పెళ్లి దుస్తుల్లో అందంగా.. మేడ్‌ ఫర్‌ ఇచ్‌ అదర్‌లా ఉన్నారు ఇద్దరు. ముఖ్యంగా కత్రీనా సబ్యసాచి డిజైన్‌ చేసిన ఎరుపు లెహంగాలో అందంగా మెరిసిపోయింది. 

వివాహ తంతు జరుగుతున్న సమయంలో కత్రిన భావోద్వేగానికి గురయ్యారు. సంతోషంతో కన్నీరు పెట్టుకున్నారు. ప్రేమించిన వాడిని జీవిత భాగస్వామిగా పొందుతున్న వేళ.. పట్టరాని సంతోషంతో కత్రినా ఉద్వేగానికి గురయ్యారు. ఇక విక్కీ జీవితాంతం ఆమె చేతిని వీడనంటూ.. గట్టిగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో తెగ వైరలవుతోంది.  
(చదవండి: భార్యభర్తలుగా కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌.. వైరలవుతోన్న వెడ్డింగ్‌ ఫోటోలు..)

దీన్ని చూసిన నెటిజనులు సమంతను గుర్తు చేసుకున్నారు. చైతూతో వివాహం జరుగుతున్న వేళ​ సమంత కూడా ఇలానే పట్టరాని సంతోషంతో కన్నీరు పెట్టుకున్నారు. విక్ట్రీనా వివాహంలో కూడా ఇదే సీన్‌ రిపీట్‌ కావడం నెటిజనుల దృష్టిని ఆకర్షించింది.  
(చదవండి: పెళ్లికి సిద్ధమవుతున్న మరో స్టార్‌ హీరోయిన్‌, ఇదిగో ప్రూఫ్‌..)

ఇక నూతన దంపతులకు బాలీవుడ్‌ సెలబ్రిటీలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు.  

చదవండి: విక్కీ-కత్రినాల వివాహం.. సల్మాన్‌ రియాక్షన్‌ ఇలా ఉంటుందా..!

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250