Sakshi News home page

adsolute video ad after first para

వేసవిలో కుండలోని నీళ్లే ఎందుకు బెటర్‌?

Published Fri, Mar 29 2024 12:01 PM

Health Benefits Of Drinking Water From The Earthen Pot - Sakshi

వేసవిలో దాహార్తి మాములుగా ఉండదు. ఎంతలా అంటే ఏం తిన్నా ముందుగా దాహం అనిపించేస్తుంది. దీనిక తోడు బయట ఎండ ధాటికి తట్టుకోలేక చలచల్లగా నీళ్లు ఉంటే చాలనిపిస్తుంది. అందుకని ఫ్రిజ్‌లోని బాటిళ్లను ఖాళీ చేసేస్తుంటాం. అయితే చాలామంది కుండలోని నీళ్లే మంచిది అంటారు. ఫ్రిజ్‌లోని నీరు అస్సలు తాగొద్దని హెచ్చరిస్తుంటారు నిపుణులు. అసలు కుండలోని నీళ్లే ఎందుకు బెటర్‌ అంటే..

వేసవి రాగానే చల్లదనాన్ని అందించే కూలర్లు, ఏసీల అమ్మకాలు ఊపందుకుంటాయి. ఇదే సమయంలో ఫ్రిజ్ అమ్మకాలు కూడా పెరుగుతాయి. నేడు ప్రతి ఇంట్లో ప్రిజ్ తప్పనిసరిగా ఉంటుంది. కూరగాయలు ఇతర పదార్థాలను స్టోర్ చేసుకోవడంతో పాటు ఇందులో నీటిని కూడా ఉంచి చల్లగా చేసుకుంటాం. అయితే ఫ్రిజ్ నీరు తాగడం అంత మంచిది కాదని కొందరు ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. 

పూర్వకాలంలో వేసవిలో ఎక్కువగా మట్టితో చేసిన కుండ నీరు తాగేవారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో కుండ నీరే తాగుతున్నారు. వేసవిలో కుండ నీరు మాత్రమే చల్లగా ఉంటాయి. ఓపెన్ ప్లేసులో పెట్టడం వల్ల ఇవి మరింత చల్లగా మారుతాయి. ముఖ్యంగా మట్టిలో ఎక్కువగా మినరల్స్‌ ఉంటాయి. అందువల్ల కుండనీరు తాగగానే అవన్నీ నేరుగా శరీరంలోకి వెళ్లి మేలు చేస్తాయి. అందువల్ల ఫ్రిజ్ నీరు కంటే కుండలోని నీళ్లే ఆరోగ్యానికి మంచిది.

రిఫ్రిజిరేటర్ నీరు మోతాదుకు మించి చల్లదనం ఉంటుంది. దీంతో శరీరంలోని కొన్ని కణాలు దెబ్బతింటాయి. కుండలో నీరు అయితే సమపాళ్లలో చల్లగా ఉంటాయి. దీంతో ఇవి తాగడం వల్ల ఎలాంటి హాని జరగదు. రెగ్యులర్గా కుండలో నీరు తాగడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు. ఫ్రిజ్ లో నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి అనూహ్యంగా పెరుగుతుంది. చలవ చేయడం మాటే అటుంచి అందులోనూ ఈ వేసిలో వేడిచేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియంది కాదు. అందువల్ల కుండలోని నీటికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది నిపుణులు సూచిస్తున్నారు. అదీగాక మట్టి కుండలో నీరు తాగడం వల్ల జీవ క్రియలు పెరుగుతాయి. పైగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. 

(చదవండి: Fennel Seeds: సొంపుతో ఇన్ని లాభాలా? ఐతే దీన్ని..!)

Advertisement

adsolute_video_ad

homepage_300x250