Beauty Tips: చర్మం మృదువుగా ఉండాలంటే.. ఇలా చేస్తే చాలు!
Published
Tue, Apr 16 2024 9:14 AM
పెరుగుతున్న కాలుష్యంతో ఆరోగ్యంపై ఎన్నో ప్రభావాలు పడుతున్నాయి. చాలా రకాల వ్యాధులు ఎదురవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు. చర్మం పొడిబారడం, చారలు, నలుపు, మచ్చలుగా మారడం లాంటివి. మరి ఈ సమస్యలనుండి చర్మం మృదువుగా, నిగారింపుగా ఉండాలంటే.. కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం.
టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.
టీ స్పూన్ పెసరపిండిలో తగినంత పెరుగు కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మం మృదువుగా అవుతుంది.