Sakshi News home page

adsolute video ad after first para

అందాల దీవుల్లో అడుగు పెట్టిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Published Thu, Apr 11 2024 5:52 PM

HDFC bank first private bank to open branch in Lakshadweep - Sakshi

దేశంలోనే అగ్రగామి ప్రైవేటు బ్యాంకుగా కొనసాగుతున్న హెచ్‌డీఎఫ్‌సీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో అడుగుపెట్టింది. లక్షద్వీప్ రాజధాని కవరాట్టిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తొలి బ్రాంచ్ ఏర్పాటు చేసింది. లక్షద్వీప్‌లో ఇప్పటివరకు ఏర్పాటైన మొదటి ప్రైవేటు బ్యాంకు ఇదే. 

భారత్‌కు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో కొలువు దీరిన అందమైన ద్వీపాల సమాహారం.. లక్షద్వీప్. ఇటీవల మాల్దీవుల వివాదం నేపథ్యంలో లక్షద్వీప్‌కు విపరీతమైన ప్రచారం లభించింది. ప్రధాని మోదీ కూడా స్వయంగా లక్షద్వీప్‌లో అడుగుపెట్టి టూరిజాన్ని ప్రోత్సహిస్తూ పర్యాటకులు ఇక్కడికి రావాలని ప్రకటనలు చేశారు. ఫలితంగా ఈ దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 

ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారిన లక్షద్వీప్‌ ప్రాంతంలో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు, స్థానికులు, పర్యాటలకు పర్సనల్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో తమ బ్రాంచిని ఏర్పాటు చేసినట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేర్కొంది. 2023 డిసెంబర్ 31 నాటికి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు 3,872 నగరాలు, పట్టణాల్లో 8,091 బ్రాంచ్‌లు, 20,688 ఏటీఎంలు ఉన్నాయి.

Advertisement

adsolute_video_ad

homepage_300x250