Sakshi News home page

adsolute video ad after first para

ప్రముఖ టెక్‌ కంపెనీలో తొలగింపులు, బదిలీలు

Published Thu, Apr 18 2024 8:59 AM

Google Lays Off Employees Shifts Abroad - Sakshi

Google LayOff: ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ ఉద్యోగుల తొలగింపులు, బదిలీలు చేపట్టింది. ఈ విషయాన్నికంపెనీ ప్రతినిధి తెలిపారు. తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని, ప్రభావితమైన ఉద్యోగులు ఇతర అంతర్గత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్యను వెల్లడించలేదు.

ప్రభావితమైన ఉద్యోగులలో కొంత మందిని భారత్‌, చికాగో, అట్లాంటా, డబ్లిన్ వంటి కంపెనీ పెట్టుబడులు పెడుతున్న కేంద్రాలకు బదిలీ చేయనున్నారు. గూగుల్‌ తొలగింపులతో ఈ సంవత్సరం టెక్, మీడియా పరిశ్రమలో మరిన్ని తొలగింపులు కొనసాగవచ్చనే భయాలు నెలకొన్నాయి. 2023 ద్వితీయార్థం నుంచి 2024 వరకు తమ అనేక బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి, ఉత్పత్తి ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు గూగుల్‌ ప్రతినిధి పేర్కొన్నారు.

 

బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. లేఆఫ్‌లతో గూగుల్‌ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాలలోని అనేక మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ప్రభావితమైన ఫైనాన్స్ టీమ్‌లలో గూగుల్‌ ట్రెజరీ, వ్యాపార సేవలు, ఆదాయ నగదు కార్యకలాపాలు ఉన్నాయి. పునర్నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్‌లకు వృద్ధిని విస్తరింపజేస్తామని గూగుల్‌ ఫైనాన్స్ చీఫ్, రూత్ పోరాట్ సిబ్బందికి ఈ-మెయిల్ పంపారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250