Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Memantha Siddham Day 14 Updates: సీఎం జగన్‌ బస్సుయాత్ర అప్‌డేట్స్‌

Published Sat, Apr 13 2024 8:51 AM

CM YS Jagan Memantha Siddham Bus Yatra 14th Day Updates - Sakshi

Memantha Siddham Bus Yatra Live Updates..

సీఎం జగన్‌పై రాయితో దాడి

వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కేసరపల్లి క్యాంప్‌నుండి సీఎం జగన్‌ చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్‌ గాయానికి తదుపరి చికిత్స చేశారు. గాయానికి రెండు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్‌ కేసరపల్లికి బయల్దేరారు. సీఎం జగన్‌తో పాటుగా వైఎస్‌ భారతీ ఉన్నారు.

గాయం కారణంగా సీఎం వైయస్ జగన్‌ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. దీంతో నేడు సీఎం జగన్‌ యాత్రకు విరామం ప్రకటించారు. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

  • విజయవాడ "మేమంతా సిద్ధం" బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి
  • బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి
  • అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి
  • సీఎం జగన్ పై క్యాట్ బాల్‌తో దాడి చేసినట్లు అనుమానం
  • రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం
  • సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం
  • వెంటనే సీఎం జగన్‌కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు
  • ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్
  • విజయవాడలో సీఎం జగన్ కోసం పోటెత్తిన జనం
  • విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా..
  • అప్రతిహతంగా కొనసాగుతున్న భారీ రోడ్ షో
  • సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే..
  • టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారంటున్న విజయవాడ YSRCP నేతలు

పైపుల రోడ్‌ చేరుకునన్న సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర

  • పైపుల రోడ్‌ సెంటర్‌లో సీఎం జగన్‌ ఘన స్వాగతం

విజయవాడలో జన ప్రభంజనం

  • కాసేపట్లో పైపుల రోడ్‌ చేరుకోనున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర
  • సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనం
  • దారిపొడవునా సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం
  • గజ మాలలు, హారతలు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం

బీఆర్‌టీఎస్‌ రోడ్‌ చేరుకున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర

విజయవాడ:

  • బీఆర్‌టీఎస్‌ ఫుడ్ కోర్ట్ జంక్షన్‌ దాటిన సీఎం జగన్‌ బస్సుయాత్ర
  • అడుగడుగునా జననీరాజనం పట్టిన ప్రజలు
  • భారీ గజమానులతో సీఎం జగన్‌కు స్వాగతం
     

విజయవాడ:

  • ఘంటసాల కళాశాల ఫుడ్ జంక్షన్ వద్ద భారీ స్వాగత ఏర్పాట్లు 
  • సీఎం జగన్‌కు నీరాజనాలు పలుకుతున్న బెజవాడ ప్రజలు
  • క్రేన్లతో  గజమాలలతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న అభిమానులు
     

విజయవాడ: 

  • శిఖామణి సెంటర్‌లో భారీ గజమాలతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసిన తూర్పు నియోజకవర్గ  వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి దేవినేని అవినాష్ 
  • సీఎంకు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు
  • రోడ్డుకి ఇరువైపులా కిక్కిరిసిన అభిమానులు
     

సీఎం జగన్‌ బస్సుయాత్రకు నేను సిద్ధం అంటున్న సతీమణి వైఎస్‌ భారతి

తాడేపల్లి జంక్షన్‌లో సీఎం జగన్‌ బస్సుయాత్రకు శ్రీమతి వైఎస్‌ భారతి సంఘీభావం

  • ప్రజలతో కలిసి స్వాగతం పలికిన శ్రీమతి వైఎస్‌ భారతి

  • బస్సుయాత్రలో వస్తున్న ముఖ్యమంత్రికి అభివాదం చేసిన శ్రీమతి వైఎస్‌ భారతి

  • బస్సులో నుంచి ప్రతి అభివాదం చేసిన ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌

కనుకదుర్గ వారధిపై బస్సుయాత్ర వెంట లక్షలాదిగా తరలివెళ్లిన జనం

  • వన్స్‌మోర్‌ సిఎం జగన్‌ అని నినదిస్తున్న ప్రజలు
  • కనకదుర్గమ్మ వారధిగా మీదుగా విజయవాడ సిటీలోకి ఎంట్రీ
  • సీఎం వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు

ఎన్టీఆర్‌ జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్‌ బస్సుయాత్ర

  • కనకదుర్గ వారధి చేరుకున్న బస్సుయాత్ర
  • కాసేపట్లో శిఖామణి సెంటర్‌కు చేరుకోనున్న బస్సుయాత్ర
  • సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనం

ఎన్టీఆర్‌ జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్‌ బస్సుయాత్ర

  • కపకదుర్గ వారధిపై అరుదైన ఘట్టం ఆవిష్కృతం
  • సీఎం జగన్‌ ఘనంగా స్వాగతం పలికిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు

మంగళగిరిలో చేనేతలు ఎక్కువ
సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

  • అందుకే ఆర్కేతో మాట్లాడి చేనేత కుటుంబానికి చెందిన నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకి టికెట్ ఇచ్చాం
  • మరోవైపు చంద్రబాబు ఆయన కొడుకు ఏం చేస్తున్నారు
  • బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్లే నిలబడి కోట్లకి కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు
  • కుప్పంలోనూ బీసీలు ఎక్కువగా ఉన్నా అక్కడ కూడా ఇదే పరిస్థితి
  • తేడా గమనించమని కోరుతున్నాను

కాసేపట్లో ఎన్టీఆర్‌ జిల్లాలోకి మేమంతా సిద్ధం యాత్ర

  • మంగళగిరిలో చేనేత కార్మికులతో ముగిసిన సీఎం జగన్‌ ముఖాముఖి
  • కాసేపట్లో ఎన్టీఆర్‌ జిల్లాలోకి ప్రవేశించనున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర


లబ్ధిదారులతో సీఎం జగన్‌

  • రూ.10 లక్షల ఆసక్తి పేద మహిళల చేతుల్లో పెట్టాలి అనుకున్నా
  • 54 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధం అయ్యాం
  • చంద్రబాబు, ఆయన కొడుకు అడ్డుపడ్డారు
  • చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు
  • సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది
  • ఓట్ల కోసం వాళ్లు వస్తే గట్టిగా నిలదీయండి

చేనేత కార్మికులతో సీఎం జగన్‌ ఏమన్నారంటే.. 

  •  58 నెలల మన పాలనను మీరు చూశారు
  •  గత చంద్రబాబు పాలనను మీరు చూశారు
  •  నాయకుడి ఎన్నికలో పొరపాటు చేస్తే .. మనం చేసేదీ ఏమీ ఉండదు 
  • మనం తీసుకునే నిర్ణయం సరైంది అయితే, మన అడుగులు ముందుకు పడతాయి
  • చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు
  • సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు
  • గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు 
  • మన ప్రభుత్వం నేతన్న నేస్తం కింద రూ.970 కోట్లు అందజేశాం
  • చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది
  • కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడా బీసీలకు ఇవ్వరు
  • 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చాం
  • ఎనిమిది మంది మున్సిపల్ చైర్మన్లు చేనేతలకు ఇచ్చాం
  • 50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్ ఇచ్చిన ఘనత మనదే
  • దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డు
  • నామినేటెడ్ పదవుల్లోనూ చేనేత వర్గానికి ప్రాధాన్యతనిచ్చాం
  • చేనేత వర్గం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వారికి అండగా నిలిచాం
  • మంగళగిరి నియోజకవర్గంలో 90.1 శాతం లబ్ధి జరిగింది 
  • అక్కా చెల్లెమ్మలకు రూ.1530 కోట్ల లబ్ధి 
  • నాన్ డీబీటీ ద్వారా రూ.735 కోట్ల లబ్ధి 
  • టీడీపీ డబ్బు ఇస్తే తీసుకోండి
  • ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఓటు వేయండి
  • మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా

చేనేత కార్మికులతో సీఎం జగన్‌ ఏమన్నారంటే.. 

  • నేతన్నల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు
  • చంద్రబాబు చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేశారు.. ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారు
  • అప్కోకు కూడా చంద్రబాబు బకాయిలు పడ్డారు
  • రెండు ఎమ్మెల్సీలు చేనేత వర్గానికే ఇచ్చాం
  • మన ప్రభుత్వం నేతన్న నేస్తం కింద రూ.970 కోట్లు అందజేశాం
  • రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా ఇచ్చాం
  • మంగళగిరిలో చేనేతలు ఎక్కువగా ఉన్నారని ఆర్కేతో మాట్లాడి ఒప్పించి ఇక్కడ సీటు చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళకు(లావణ్య) ఇచ్చాం
  • బీసీలు ఎక్కువగా ఉన్న చంద్రబాబు సీటు ఇవ్వరు
  • మంగళగిరిలో తన కొడుకు నారా లోకేష్‌కు ఇచ్చారు 
  • గతంలో ఎన్నడూ లేనంతగా.. మన ప్రభుత్వంలో నేతన్నల కోసం 3 వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశాం
  • మన సంక్షేమ పాలనలో 1.06 లక్షల మందికి లబ్ధి చేకూరింది
  • 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదు
  • ఇంటికి కేజీ బంగారం, బెంజీ కారు ఇస్తామని మోసం చేస్తారు
  • ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారు
  • మరోసారి రంగు రంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు
  • ఒక్కరికైనా సెంట్‌ స్థలం ఇచ్చారా?.. పక్కా ఇంటిని కట్టించి ఇచ్చారా?
  • గతంలో 98 శాతం హామీలను చంద్రబాబు ఎగ్గొట్టారు
  • ప్రతి ఒక్కరి ఖాతాలో నగదు జమ చేస్తున్నాం
  • వివక్ష లేకుండా, పార్టీలు చూడకుండా సంక్షేమం అందిస్తున్నాం
  • అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ మేలు చేస్తున్నాం
  • గతంలో పథకాలు అందాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి
  • మన ప్రభుత్వంలో పెన్షన్‌ రూ.3 వేలు అందిస్తున్నాం
  • నేను 14 ఏళ్లుగా సీఎం చేశానని చంద్రబాబు చెప్పుకుంటారు
  • నేను ఆయనన్ని సార్లు సీఎంగా పని చేయకున్నా.. ఆయనంత నెగిటివిటీ అనుభవం మాత్రం లేదు
  • మన బతుకుల్ని మార్చే నాయకుడినే ఎన్నుకోవాలి.. అలాంటి నాయకుడే సీఎం స్థానంలో ఉండాలి
  • గత పాలకులకు, ఇప్పటి పాలనకు తేడా చూస్తున్నారు.. ఆ తేడాలు గమనించండి
  • ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే మోసపోతాం

చేనేతల కోసం నాడు వైఎస్సార్, నేడు వైఎస్‌ జగన్: మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ

చేనేత పరిశ్రమ, కార్మికుల పరిస్థితులు, ఇబ్బందులు తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. మనం సీఎం వైఎస్‌ జగన్ రాష్ట్రం అంతా ప్రయాణిస్తూ వివిధ వర్గాలను కలుస్తూ వాళ్ల సమస్యలను తెలుసుకుంటూ వస్తున్నారు. ఇవాళ చేనేతల కోసం నేడు ఇక్కడ మనకు అవకాశం కల్పించడం ముఖ్యమంత్రిగారు తీసుకున్న గొప్ప నిర్ణయం. చేనేతలుగా మంగళగిరిలో మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మంగళగిరిలో తయారైన బట్ట మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.  దేశం నలుమూలల నుంచి మన మంగళగిరి వస్త్రాల కోసం వస్తున్నారు. దీనికి కారణం అప్పటి పెద్దలు స్టాండర్డ్ గా తయారు చేసిన రంగులు, నూలు, డిజైన్లు అని చెప్పుకోవాలి. మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వైఎస్సార్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా రోశయ్య గారిని, నన్ను పిలిచి చేనేత పరిశ్రమ పరిస్థితులు ఏంటి అని అడిగారు. 65 ఏళ్లకు పెన్షన్లు ఇస్తున్నారు, చేనేతలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇవ్వాలని కోరాను. అదెలా సాధ్యం అని ఆయన అడిగారు. రంగులు, రసాయనాల వల్ల మామూలు వ్యక్తుల కంటే చేనేత కార్మికులకు 50 ఏళ్లకే త్వరగా వృద్ధాప్యం వస్తుందని చెప్పాము. అది విని వెంటనే ఆయన అందుకు అంగీకరించారు. అలాగే చేనేతల కోసం మేము ఇచ్చిన 17 డిమాండ్లు కూడా నెరవేర్చారు. చేనేతల క్రిఫ్ట్ ఫండ్ ను రెట్టింపు చేసిన వ్యక్తి కూడా వైఎస్సారే. అప్పట్లో 8% చేనేతలు దాచుకుంటే మరో 8% ప్రభుత్వం ఇచ్చేది. దాన్ని 16%కి పెంచారు వైఎస్సార్. అంతకు ముందు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం రిబేట్‌ను తీసేసింది. దాన్ని వైఎస్సార్ పునరుద్ధరించారు. డైస్ అండ్ కెమికల్స్ మీద సబ్సిడీని కూడా ఇచ్చారు. 100 కోట్లు ఆప్కోకి రిలీజ్ చేస్తున్నామని చెప్పి సాంక్షన్ కూడా చేసారు. దానివల్లే నేటికీ చేనేత పరిశ్రమ నిలబడింది. మంగళగిరిలో ఇళ్లులేని  చేనేత కార్మికుల కోసం APIIC నుండి 25 ఎకరాల భూమిని ఇచ్చారు. ఇప్పుడు అక్కడ 3వేల కుటుంబాలు నివసిస్తున్నారు.

నేడు వైఎస్ జగన్‌ గారి ప్రభుత్వంలో 150 మంది మగ్గాలకు షెడ్లు కూడా వేసాం. నవరత్నాల్లో అన్ని పథకాలకంటే ఎక్కువగా, చేనేతలకు ఇచ్చే పథకంలో మాత్రమే 24వేలు అందిస్తున్నారు. చేనేత కార్మికుల జీవితాలను బాగుచేసింది నాడు రాజశేఖర్ రెడ్డిగారు, నేడు జగన్‌ మోహన్ రెడ్డిగారు. వీరిద్దరే మనల్ని ఆదరిస్తున్నారని మనం మర్చిపోకూడదు. ఇవాళ ఆప్కోకి రూ.100 కోట్లు రిలీజ్ చేసారు. మంగళగిరిలో మార్కెటింగ్ సౌకర్యం కోసం రూ.3కోట్లతో 40 షాపుల నిర్మాణం చేయించారు. ఆ నాడు తండ్రి నేడు కుమారుడు చేనేత కార్మికులకు మేలు చేసారు. ఎన్నో ఏళ్లలో మనలను గుర్తించిన నాయకులు లేరు. ఇవాళ అసెంబ్లీలో చేనేతల నుంచి ప్రాతినిధ్యం లేదు అని ఇక్కడ ఉన్న రామకృష్ణారెడ్డిగారిని ఆపి మరీ మన చేనేత మహిళలకు టికెట్టు ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలందరి ప్రతినిధిగా లావణ్యకు ఆయన అవకాశం కల్పించారు. ఆమెను గొప్ప మెజారిటీతో గెలిపించుకుని మనబాధ్యత నెరవేర్చాలి. జగన్ గారి పరిపాలన మనకి కావాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు రాజ్యాధికారం కల్పించిన చరిత్ర మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ లేదు. ధైర్యసాహసాలతో అనేక ప్రాంతాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చి, మనలను గెలిపించే పరిస్థితికి తీసుకువచ్చింది సీఎం వైఎస్ జగన్‌ మాత్రమే. నేటి పాలన ఎంతో ప్రత్యేకమైనది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనారటీలకు ఓసీలతో సమానంగా, ఓసీలకంటే అధికంగా మున్సిపాలిటీలు, పంచాయితీలు, కార్పొరేషన్లలలో ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేవు. ఇప్పుడు మనం ఒక మెట్టు ఎక్కుతున్నాం. మన ముఖ్యమంత్రిగారిని మళ్లీ గెలిపిస్తే మన జీవితాల్లో పేదరికాన్ని నిర్మూలించి, రాజకీయంగా మనకు మరింత ప్రాధాన్యత కల్పిస్తారు. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి.


సీఎం జగన్‌తో ముఖాముఖి.. రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్ పర్సన్ జింకా విజయలక్ష్మి ప్రసంగం 

ఒక చేనేత బిడ్డను, ఒక సాధారణమైన కుటుంబం, మధ్యతరగతి కంటే దిగువన ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఒక సోదరిని తన ప్రభుత్వంలో పద్మశాలి కార్పొరేషన్ కు ఛైర్మన్ గా చేయడమే కాకుండా ఈరోజు చేనేత విభాగానికి సంబంధించిన ఈ మీటింగ్ ను నిర్వహించమని చెప్పినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు. పార్టీ స్థాపించినరోజు నుండి జగనన్నతోనే నా ప్రయాణం సాగుతోంది. అయినా ఎప్పుడూ కూడా నా పర్సనల్ విషయాలు అన్నకు చెప్పుకోలేదు. అయినా కూడా నాకు కాళ్లు బాగాలేవన్న విషయం ఆయన తెలుసుకుని నేను ఎప్పుడు కనిపించినా నీకు కాళ్లు బాగాలేవు జాగ్రత్తగా ఉండు తల్లీ అంటారు జగనన్న. తనను నమ్ముకున్న వారికోసం ఏవిధంగా ఆలోచిస్తారో గుర్తించుకోవాలి సోదరుల్లారా, సోదరీమణుల్లారా. చేనేత వృత్తిని ఏ ప్రభుత్వమూ, ఏ నాయకుడూ గుర్తించింది లేదు. ఎందుకంటే ఏ నాయకుడికి మన మీద అవగాహన లేదు, మనస్సు లేదు. కానీ దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మనకు 50 ఏళ్లకే పెన్షన్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆప్కోస్ ద్వారా ఎన్నో సబ్సిడీలు తీసుకొచ్చారు. మన సీఎం జగనన్న ఎక్కడా లేనివిధంగా చేనేతలకు నెలకు రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.24 వేలను పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. నవరత్నాల సంక్షేమాల్లో అగ్రభాగం అందుకుంటున్నది మన చేనేతలే. సుదీర్ఘ పాదయాత్రలో చేనేతల కష్టాలను కళ్లారా చూశారు, సమస్యలను తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో చేనేతలను నట్టేట్లో ముంచితే ఆప్కోను బయటికి తీసుకొచ్చి రూ.180 కోట్లను అందించారు. కరోనా కష్టకాలంలో రెండుసార్లు రూ.24 వేలు ఇవ్వడం జరిగింది. కాబట్టి జగనన్న లాంటి నాయకుడు మనకు ఉండటం ఎంత అవసరమో ఆలోచన చేయాలి. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధిగా జగనన్న నిలబెట్టిన పద్మశాలి సోదరి లావణ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.

 చంద్రబాబు నేతలన్నను పట్టించుకోలేదు: చేనేత కార్మికులు

  • చంద్రబాబు హయాంలో చేనేత రంగాన్ని పట్టించుకోలేదు. 
  • ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సీఎం జగన్‌ చేనేత రంగాన్ని ఆదుకున్నారు. 
  • ఆప్కోను ఆదుకున్న మనసున్న నేత సీఎం జగన్.

సీఎం జగన్‌ పాలనలో సంక్షేమ పథకాల లబ్ధిని పంచుకుంటున్న చేనేత కార్మికులు. 

చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్‌. 

చేనేత కార్మికులతో సీఎం జగన్‌ ముఖాముఖి

  • చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేసిన సీఎం జగన్‌
  • తాము అందుకున్న లబ్ధిని పంచుకుంటున్న చేనేత కార్మికులు

మంగళగిరిలో సీకే కన్వెషన్‌ సెంటర్‌కి చేరుకున్న సీఎం జగన్‌

మరికాసేపట్లో చేనేత కార్మికులతో ముఖాముఖి. 

మంగళగిరి బైపాస్‌ వద్దకు చేరుకున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర

మంగళగిరి బైపాప్‌ దగ్గర బైక్‌ ర్యాలీతో సీఎం జగన్‌కు ఘన స్వాగతం. 

జైత్రయాత్రలా కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర

► కాజా టోల్‌గేట్ వద్ద సీఎం జగన్‌కు గజమాలతో స్వాగతం పలికిన స్థానికులు.

14వ రోజు ప్రారంభమైన యాత్ర

  • నంబూరు బైపాస్‌ బస కేంద్రం నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర
  • 14వ రోజు ఎన్టీఆర్‌ జిల్లాలో కొనసాగనున్న మేమంతా సిద్ధం యాత్ర
  • కాసేపట్లో సీకే కన్వెన్షన్‌ హాల్‌లో చేనేత కార్మికులతో సీఎం జగన్‌ ముఖాముఖి


► కాసేపట్లో సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ నేడు ఎన్టీఆర్‌ జిల్లాలో కొనసాగనుంది.

ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ శుక్రవారం రాత్రి బస చేసిన నంబూరు బైపాస్‌ నుంచి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరుతారు.

కాగా, మంగళగిరి బైపాస్‌ మీదుగా 11 గంటలకు సీకే కన్వెన్షన్‌ వద్దకు చేరుకొని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుంచనపల్లి బైపాస్‌ మీదుగా తాడేపల్లి బైపాస్‌కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత విజయవాడలో వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్‌సింగ్‌ రోడ్డు, పైపుల రోడ్డు, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్‌ మీదుగా కేసరపల్లి బైపాస్‌ శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

Advertisement

Copy Button

 

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250