breaking news
-
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిష్ విరోచిత శతకంతో చెలరేగాడు. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ వంటి వారు విఫలమైన చోట స్టోయినిష్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. 211 పరుగుల భారీ లక్ష్య చేధనలో సీఎస్కే బౌలర్లను స్టోయినిష్ ఓ ఆట ఆడుకున్నాడు. తన విధ్వంసకర సెంచరీతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న స్టోయినిష్ 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 124 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో సీఎస్కేపై లక్నో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక సెంచరీతో మెరిసిన స్టోయినిష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖిచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే విజయవంతమైన రన్ ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా స్టోయినిష్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు పాల్ వాల్తాటి పేరిట ఉండేది. 2011 ఐపీఎల్ సీజన్లో సీఎస్కేపై లక్ష్య చేధనలో వాల్తాటి 120 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 124 పరుగులు చేసిన స్టోయినిష్.. వాల్తాటి ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. MARCUS STOINIS... THE HULK. 💪 - The winning celebrations from Stoinis and LSG says everything. 🔥pic.twitter.com/iGBHDNWDSU — Mufaddal Vohra (@mufaddal_vohra) April 23, 2024 -
స్టొయినిస్ విధ్వంసం
చెన్నై: నాలుగు రోజుల క్రితం లక్నో వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ఇప్పుడు చెన్నైలో రీప్లేగా జరిగిన పోరులో లక్నోనే మళ్లీ ‘సూపర్’గా ఆడి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో 6 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకాన్ని నమోదు చేశాడు. ‘హిట్టర్’ శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కస్ స్టొయినిస్ (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్స్‌లు) అసాధారణ ఇన్నింగ్స్‌తో అజేయ సెంచరీ సాధించి లక్నోను విజయతీరాలకు చేర్చాడు. పూరన్‌తో నాలుగో వికెట్‌కు 70 పరుగులు, దీపక్ హుడాతో అబేధ్యమైన ఐదో వికెట్‌కు 55 పరుగులు జోడించిన స్టొయినిస్ లక్నోకు చిరస్మరణీయ విజయం అందించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్... రహానే (1), వన్‌డౌన్‌లో మిచెల్ (11), జడేజా (16) చెన్నై టాప్–4 బ్యాటర్లలో ముగ్గురి స్కోరిది! పవర్ ప్లేలో చెన్నై చేసిన స్కోరు 49/2 తక్కువే! ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ బౌండరీలతో పరుగుల వేగాన్ని అందుకున్నాడు. గైక్వాడ్ 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 11.3 ఓవర్లలో వందకు చేరింది. అదే ఓవర్లో జడేజా నిష్క్రమించడంతో వచ్చిన దూబే ఓ రకంగా శివతాండవమే చేశాడు. 15 ఓవర్లలో చెన్నై 135/3 స్కోరు చేసింది. కానీ ఆ తర్వాత దూబే పవర్‌ప్లే మొదలైంది. భారీ సిక్సర్లతో స్కోరు ఒక్కసారిగా దూసుకెళ్లింది. 16వ ఓవర్లో దూబే హ్యాట్రిక్ సిక్స్‌లతో 19 పరుగులు, 18వ ఓవర్లో గైక్వాడ్ 6, 4, 4లతో 16 పరుగులు, 19వ ఓవర్లో మళ్లీ దూబే దంచేయడంతో 17 పరుగులు, ఆఖరి ఓవర్లో 15 పరుగులతో స్కోరు 200 పైచిలుకు చేరింది. చివరి 5 ఓవర్లలో దూబే వికెట్ మాత్రమే కోల్పోయిన చెన్నై 75 పరుగులు సాధించింది. గైక్వాడ్ 56 బంతుల్లో శతకాన్ని, దూబే 22 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నారు. బ్యాటింగ్ గేర్ మార్చి... కొండంత లక్ష్యం ముందున్న లక్నోకు ఆరంభంలో అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి. ఓపెనర్లు డికాక్ (0), కేఎల్ రాహుల్ (14 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్), దేవదత్ పడిక్కల్ (19 బంతుల్లో 13) నిరాశపరిచారు. టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన స్టొయినిస్ ఒక్కడే గెలిపించేదాకా మెరిపించాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. తర్వాత నికోలస్ పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జోరు పెంచగానే... పతిరణ మరుసటి ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. స్టొయినిస్ 56 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీపక్ హుడా కూడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్‌కు పని చెప్పడంతో అనూహ్యంగా లక్నో లక్ష్యం వైపు పరుగు పెట్టింది. 18 బంతుల్లో 47 పరుగుల కష్టమైన సమీకరణం ఇద్దరి దూకుడుతో సులువైంది. 18, 19వ ఓవర్లలో 15 పరుగుల చొప్పున వచ్చాయి. 6 బంతుల్లో 17 పరుగుల్ని స్టొయినిస్ 6, 4, నోబాల్4, 4లతో ఇంకో మూడు బంతులు మిగిల్చి ముగించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) రాహుల్ (బి) హెన్రి 1; రుతురాజ్ (నాటౌట్) 108; మిచెల్ (సి) హుడా (బి) యశ్ 11; జడేజా (సి) రాహుల్ (బి) మోసిన్ 16; దూబే (రనౌట్) 66; ధోని (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–4, 2–49, 3–101, 4–205. బౌలింగ్: హెన్రీ 4–0–28–1, మోసిన్ ఖాన్ 4–0–50–1, రవి బిష్ణోయ్ 2–0–19–0, యశ్ ఠాకూర్ 4–0–47–1, స్టొయినిస్ 4–0–49–0, కృనాల్ పాండ్యా 2–0–15–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) దీపక్ 0; రాహుల్ (సి) రుతురాజ్ (బి) ముస్తఫిజుర్ 16; స్టొయినిస్ (నాటౌట్) 124; పడిక్కల్ (బి) పతిరణ 13; పూరన్ (సి) శార్దుల్ (బి) పతిరణ 34; హుడా (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–0, 2–33, 3–88, 4–158. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–1, తుషార్ 3–0–34–0, ముస్తఫిజుర్ 3.3–0–51–1, శార్దుల్ 3–0–42–0, మొయిన్ అలీ 2–0–21–0, జడేజా 2–0–16–0, పతిరణ 4–0–35–2. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X గుజరాత్ వేదిక: న్యూఢిల్లీ రాత్రి7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
స్టోయినిస్‌కు మొండిచెయ్యి.. కొత్తగా నలుగురికి అవకాశం
2024-25 సంవత్సరానికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించిన 23 మంది ఆటగాళ్ల జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (మార్చి 28) ప్రకటించింది. ఈ జాబితాలో లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ మార్కస్ స్టోయినిస్, ఇటీవలే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్‌కు చోటు దక్కలేదు. వీరితో పాటు ఆస్టన్ అగర్, మార్కస్ హ్యారిస్, మైకేల్ నెసర్, మ్యాట్ రెన్షాలకు కూడా క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్ లభించలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా కొత్తగా నలుగురు ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్ కల్పించింది. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మ్యాట్ షార్ట్, ఆరోన్ హార్డీ కొత్తగా కాంట్రాక్ట్ పొందిన వారిలో ఉన్నారు. ఈ నలుగురిలో బార్ట్లెట్ తొలిసారి కాంట్రాక్ట్ పొందగా.. మిగతా ముగ్గురు గతంలో వార్షిక కాంట్రాక్ట్ పొందారు. ఈ వార్షిక కాంట్రాక్ట్ టీ20 వరల్డ్‌కప్ అనంతరం అమల్లోకి వస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా 2024-25: సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లాబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, జే రిచర్డ్సన్, మ్యాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
స్టోయినిస్ ఊచకోత.. న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన మెల్బోర్న్
బిగ్‌బాష్ లీగ్ 2023లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ అద్భుత విజయం సాధించింది. ఆస్ట్రేలియా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ మెల్బోర్న్ స్టార్స్ సూపర్ విక్టరీ సాధించారు. స్టోయినిస్ ఊచకోతతో (19 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెల్బోర్న్ న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది. స్టోయినిస్ విధ్వంసం ధాటికి అడిలైడ్ నిర్ధేశించిన 206 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. క్రిస్ లిన్ విధ్వంసం.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్.. క్రిస్ లిన్ (42 బంతుల్లో 83 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూ షార్ట్ (32 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృస్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మెల్బోర్న్ కెప్టెన్ మ్యాక్స్‌వెల్ 2 వికెట్లతో రాణించాడు. Brilliant fireworks in Adelaide during BBL match on New Year's Eve.pic.twitter.com/2khkPbaSoO — Mufaddal Vohra (@mufaddal_vohra) December 31, 2023 పోటాపోటీగా విరుచుకుపడిన లారెన్స్, వెబ్‌స్టర్, స్టోయినిస్.. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్.. డేనియల్ లారెన్స్ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), వెబ్‌స్టర్ (48 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (17 బంతుల్లో 28; 5 ఫోర్లు) పోటాపోటీగా రాణించడంతో 19 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అడిలైడ్ బౌలర్లలో కెమారూన్ బాయ్స్ (4-0-15-1) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీశాడు. -
CWC 2023: టీమిండియాతో మ్యాచ్‌కు ముందు గాయపడ్డ ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్
చెన్నై వేదికగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 8) జరుగనున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్విమ్మంగ్ పూల్‌లో గాయపడ్డాడు. కళ్లు మూసుకుని స్విమ్మింగ్ చేసిన జంపా పూల్‌లో ఉన్న మెట్లను గుద్దుకుని గాయాలపాలయ్యాడు. జంపా ముఖంపై, ఇతర చోట్ల గాయాలైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అయితే ఈ స్వల్ప గాయాల కారణంగా జంపా టీమిండియాతో మ్యాచ్‌కు దూరమయ్యే ప్రమాదమేమీ లేదని సీఏ క్లారిటీ ఇచ్చింది. జంపా 100 శాతం ఫిట్‌గా ఉన్నాడని తెలిపింది. కాగా, ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఉపఖండపు స్విమ్మింగ్ పూల్లలో గాయపడటం ఇది కొత్తేమీ కాదు. గతేడాది ఆ జట్టు వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీ కరాచీలోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కిందపడిపోయాడు. ఆ సమయంలో క్యారీ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఘటన తర్వాత క్యారీ బ్యాటింగ్‌లో రెచ్చిపోయాడు. కెరీర్లో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఆ తర్వాత ఆడిన 9 టెస్ట్‌ల్లో 71.83 సగటున పరుగులు చేశాడు. ఈ విషయం గురించి తెలిసిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. పూల్‌లో పడిపోవడం క్యారీకి, ఆసీస్‌కు కలిసొచ్చినట్లుందని అంటున్నారు. ఇదిలా ఉంటే, భారత్‌తో మ్యాచ్‌లో జంపా ఆడటంపై ఎలాంటి అనుమానాలు లేనప్పటికీ.. స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం మాత్రం ఆసీస్‌ను ప్రధానంగా వేధిస్తుంది. గాయాం నుంచి పూర్తిగా కోలుకోని స్టోయినిస్ భారత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం అనుమానమేనని తెలుస్తుంది. మరోవైపు గాయాల బెడద టీమిండియాకు కూడా ప్రధాన సమస్యగా మారింది. అసలే శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేక సతమతమవుతున్న భారత్‌కు హార్దిక్ పాండ్యా చేతి గాయం పెద్ద తలనొప్పిగా మారింది. గత వారం రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న గిల్ ఆసీస్‌తో ఇవాల్టి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం దాదాపుగా ఖరారు కాగా.. హార్దిక్ సైతం గిల్ బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తుంది. అయితే హార్దిక్ గాయంపై కంగారు పడాల్సిన అవసరం లేదని టీమిండియా మేనేజ్మెంట్ చెప్పుకొస్తుంది. ఏదిఏమైనప్నపటికీ.. గిల్, పాండ్యా ఇద్దరూ ఆసీస్‌తో మ్యాచ్‌కు దూరమైతే అది టీమిండియా విజయావకాశాలను భారీ దెబ్బతీస్తుంది. చెన్నైలోని చిదంబరంలో స్టేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019