breaking news
-
డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం
డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్ ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. తాజాగా వెలువడిన ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 2021 నుంచి ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న సంజయ్ సింగ్, ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించారు. ఒడిశా కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్ IPS అధికారిగా ఆయన ప్రయాణం కొనసాగింది. 2008 నుంచి 2015 వరకు సీబీఐలో కూడా ఆయన పనిచేశారు. దేశంలోని అత్యంత క్లిష్టమైన కేసులలో ఆయన భాగమై పూర్తిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. తన స్వచ్ఛంద పదవీ విరమణపై సంజయ్ సింగ్ మీడియాతో స్పందిస్తూ.. 'ఫిబ్రవరి 29న స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవాలని అభ్యర్థించాను. నా అభ్యర్థనను ఆమోదించడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇదే విషయాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా తెలిపింది. దాని ప్రకారం ఈరోజు నా అప్పీల్ ఆమోదించబడింది. ఏప్రిల్ 30 నా కెరీర్‌కి చివరి రోజు అని నాకు ఇప్పటికే సమాచారం వచ్చింది. గత మూడు నెలలుగా నోటీసు పరేడ్‌లో నేను రిలాక్స్‌గా ఉన్నాను. అని ఆయన చెప్పారు. రెండేళ్ల క్రితం ముంబై తీరంలోని ఒక విహార నౌకలో సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలంతా కలిసి పాల్గొన్న విందుపై ఎన్సీబీ బృందం దాడి చేసి ఆర్యన్‌తోపాటు సుమారు 20 మందిని అరెస్టు చేసింది. అతను డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకున్నామనీ, అతగాడి ఫోన్లోని వివరాల ఆధారంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల సిండికేట్‌తో అతనికున్న సంబంధాలు వెల్లడయ్యాయనీ ఎన్సీబీ ముందుగా ప్రకటించింది. ఆ సమయంలో షారుఖ్‌తో పాటు ఆర్యన్ కూడా సోషల్‌మీడియా ద్వారా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఆర్యన్ ఎలాంటి తప్పు చేయలేదని గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ. 20,000 కోట్ల విలువైన డ్రగ్స్‌నుంచి దృష్టి మళ్లించడానికే ఆర్యన్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలూ వినిపించాయి. కానీ ముంబై జోన్లో అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఈ కేసును దర్యాప్తు చేశారు. కావాలనే కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు వాదనలు రావడంతో ఈ కేసు నుంచి ఆయన్ను తప్పించారు. తర్వాత ఇదే కేసును డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్‌కు అప్పగించారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్ కేసును ఆయన ఛాలెంజ్‌గా తీసుకుని విచారణ కొనసాగించారు. మే 2022లో సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లో, ఆర్యన్ ఖాన్‌తో సహా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆరుగురికి ఎన్‌సిబి క్లీన్ చిట్ ఇచ్చింది. మిగిలిన 14 మందిని నిందితులుగా గుర్తించింది. అలా సంజయ్ సింగ్ నేతృత్వంలో ఆర్యన్‌కు క్లీన్ చిట్ దక్కింది. -
ఆర్యన్ ఖాన్ కొత్త బ్రాండ్ జాకెట్ ధర వింటే షాకవ్వుతారు!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బ్రాండెడ్ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అతడి కొత్త బ్రాండ్ డ్యావోల్ఎక్స్(DyavolX) ప్రమోషన్లలో షారుక్, అతని కూతురు సుహానా ఖాన్ బిజీగా ఉన్నారు. ఆదివారం (మార్చి 17) ఈ కొత్త బ్రాండ్ మార్కెట్లోకి రాగా..వీటి ధరలు చూసి కంగుతింటున్నారు అభిమానులు. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్యావోల్ఎక్స్ (DyavolX) పేరుతో కొత్త బట్టల బ్రాండ్ తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన పోస్టర్ ను షారుక్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఇందులో ఆర్యన్ ఖాన్ తోపాటు షారుక్, సుహానా ఈ కొత్త బ్రాండ్ డ్రెస్సుల్లో సందడి చేశారు. వీటిలో ట్రిపుల్ థ్రెట్ ఎక్స్ 2 పేరుతో హుడీస్, టీషర్ట్స్, క్రాప్ టాప్స్, డెనిమ్ జాకెట్స్ అందుబాటులో ఉంటాయి. వాటి ధరలు వచ్చేసి ఏకంగా రూ.16 వేల నుంచి రూ.99 వేల వరకూ ఉన్నాయి. ఈ బ్రాండ్ ఎక్స్ 2 అందుబాటులోకి వచ్చిందంటూ వెబ్సైట్ http://dyavolx.comలో బుక్ చేసుకోండి. ఇవి పరిమిత స్థాయిలోనే ఉంటాయి, గ్లోబల్ షిప్పింగ్ కూడా ఉంది" అనే క్యాప్షన్ తో షారుక్ ఈ పోస్ట్ చేశాడు. అయితే వీటి ధరలు చూసి సగటు అభిమానులు షాక్ తింటున్నారు. ఇక ఈ లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్లో ఓ డెనిమ్ జాకెట్ ధర రూ.99 వేలు కావడం విశేషం. ఇక ఇందులోని హుడీస్ రూ.41 వేలు, రూ.40 వేలుగా ఉన్నాయి. గాళ్స్ కోసం క్రాప్ టాప్స్ రూ.16 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టర్ లో షారుక్ ఖాన్, ఆర్యన్ ఖాన్ వేసుకున్న టీషర్ట్స్ ధర రూ.21,500 కావడం విశేషం. ఇక కార్గో ప్యాంట్ల ధర రూ.35 వేలుగా ఉంది. ఇవన్నీ ఎక్కువ ధరలే అయినా.. గతంలో 2023లో ఆర్యన్ ఖాన్ తీసుకొచ్చిన కలెక్షన్ల ధరలైతే ఏకంగా రూ.2 లక్షల వరకూ ఉన్నాయి. వాటితో పోలిస్తే ఇవి కాస్త బెటర్ అని చెప్పొచ్చు. అప్పట్లో షారుక్ సంతకంతో ఉన్న హుడీస్ ధరను రూ.2 లక్షలుగా నిర్ణయించగా.. కొన్ని గంటల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి. ఇక తన కొడుకు బ్రాండ్‌కు షారుక్ ఇస్తున్న ప్రమోషన్ కూడా బాగా కలిసి వస్తోంది. అందులో షారుక్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దశాబ్దాలకు పైనే అయినా ఇప్పటికీ అతని క్రేజ్ తగ్గలేదు. గతేడాది అతడు పఠాన్, జవాన్ లతో ఒకే ఏడాది రూ.1000 కోట్ల కలెక్షన్లు సినిమాలు అందించాడంటే అతనికి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) (చదవండి: రాధిక మర్చంట్ డ్రెస్ ధర వింటే...) -
చంపుతామంటూ బెదిరిస్తున్నారు
ముంబై: తనను చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై మాజీ చీఫ్ సమీర్ వాంఖడే ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనను, తన భార్యను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతూ చంపుతామంటూ గత నాలుగు రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని వాంఖడే పేర్కొన్నారు. వాంఖడే తన ప్రతినిధి ద్వారా ఈ మేరకు ఒక లేఖను దక్షిణ ముంబై పోలీస్ కమిషనరేట్‌కు పంపినట్లు ఒక అధికారి తెలిపారు. ‘క్రూయిజ్ డ్రగ్స్’ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను ఇరికించకుండా ఉండేందుకు రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సమీర్ వాంఖడేను శని, ఆదివారాల్లో సీబీఐ ప్రశ్నించింది. -
ఆర్యన్‌ని జైల్లో పెట్టొద్దు! సమీర్ వాంఖడేని వేడుకున్నట్లు స్క్రీన్ షాట్లు
బాలీవుడ్ దిగ్గజ నటుడు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టులో సీనియర్ ఆఫీసర్‌గా పేరొందిన నార్కోటిక్స్ మాజీ అధికారి సమీర్ వాంఖడే అక్రమంగా వ్యవహరించారంటూ సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై సీబీఐ ఆయన తోపాటు మరికొందరూ షారూఖ్ ఖాన్ కుటుంబాన్ని డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు చేస్తోంది. సీబీఐ పెట్టిన కేసుల విషయమై ముంబై హైకోర్టు ఆశ్రయించిన సమీర్ వాంఖడే శుక్రవారం తనకు షారుక్ ఖాన్‌కి మధ్య జరిగిన చాట్ల సంభాషణను కోర్టుకి సమర్పించారు. అంతేగాదు షారూఖ్ తన కొడుకుని విడిపించమని వేడుకుంటూ జరిగిన సుదీర్ఘ చాట్ సంభాషణ గురించి పిటిషన్లో పేర్కొన్నాడు వాంఖడే. ఆ స్క్రీన్ షాట్లో దయ చేసి అతన్ని జైల్లో పెట్టోద్దు. మిమ్మల్ని వేడుకుంటున్నా. మీరు నా కుటుంబంపై దయచూపాలి. నా కొడుకుని కరుడుగట్టిన నేరస్తుడిలా జైల్లో ఉండటానికి అర్హుడు కాదు. అది అతడి ఆత్మవిస్వాశాన్ని దెబ్బతీస్తుంది. ఒక తండ్రిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. ఈ కేసు ఉపసంహరించుకునేలా నా శక్తిమేర చేయల్సిదంతా చేస్తానని మీకు హామి ఇస్తున్నా. దయచేసి నా కొడుకుని ఇంటికి పంపించండి. అని షారూక్ తనకు వాట్సాప్ మెసేజ్‌లు చేశారని సమీర్ వాంఖడే ఆరోపించారు. అందుకు సమీర్ సమాధానంగా షారూక్ నువ్వొక మంచి మనిషిగా నాకు నీ గురించి తెలుసు. నేను జోనల్ డైరెక్టర్. సమాజాన్ని, పిల్లల జీవితాలన్ని కలుషితం చేస్తున్న వాటిని ప్రక్షాళ చేసే సర్వీస్ చేస్తున్నాను. కానీ కొందరూ నా ప్రయత్నాన్ని దుర్మార్గంగానూ, స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నట్లుగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వాంఖడే స్రీన్‌షాట్ మెసేజ్‌లో పేర్కొన్నట్లు ఉంది. ఇదిలా ఉండగా, హైకోర్టులో సమీర్ వాంఖడేకు ఊరట లభించింది. మే 22 దాకా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని శుక్రవారం హైకోర్టు ఆదోశిచింది. కాగా, వాంఖడే తన కుటుంబంతో కలిసి పలుమార్లు విదేశాలకు వెళ్లాడని, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఎన్సీబీ నివేదిక పేర్కొనడం గమనార్హం. BREAKING : WhatsApp chats between Sameer Wankhede & Shahrukh Khan leaked. Chats from the time when Shahrukh Khan's son was in jail in connection with Cordelia cruise drug case. In the chats, Shahrukh Khan tells Sameer Wankhede: 'You promised you will reform my child and not… pic.twitter.com/sLUcDb2guX — Jan Ki Baat (@jankibaat1) May 19, 2023 (చదవండి: సిన్సియర్ సమీర్ వాంఖడే.. రోలెక్స్ వాచీ, ఫారిన్ ట్రిప్పులు, కోట్లు విలువ చేసే ప్లాట్లు?!) -
సిన్సియర్ సమీర్.. రోలెక్స్ వాచీ, ఫారిన్ ట్రిప్పులు, ప్లాట్లు?!
సిన్సియర్ ఆఫీసర్‌గా పేరొందిన సమీర్ వాంఖడే సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వ్యవహారంలో ఈ నార్కోటిక్స్ మాజీ అధికారి అక్రమంగా వ్యవహరించాడంటూ సీబీఐ చెబుతోంది. ఆర్యన్‌ను ఈ కేసులో ఇరికించకుండా ఉండేందుకు ఆయన, మరికొందరు కలిసి పాతిక కోట్ల రూపాయల లంచం షారూఖ్ ఖాన్ కుటుంబం నుంచి డిమాండ్ చేశారనే అభియోగాలతో ముందుకు వెళ్తోంది సీబీఐ. అయితే.. ఆదాయంతో సంబంధం లేకుండా అడ్డగొలుగా ఆయన ఆస్తుల్ని వెనకేసుకున్నారని, అలాగే కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్పులకూ వెళ్లారని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) ఒక నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదుచేసిన సీబీఐ.. తన దర్యాప్తు కొనసాగించడం గమనార్హం. సిబిఐ పెట్టిన కేసుపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన సమీర్ వాంఖడేకు సోమవారం వరకు ఊరట దక్కింది. Order Prima facie there is a legal bar under 17A of the PC Act and since a 41A notice is issued in the case..no coercive action against the petitioner till the next date Monday. #SameerWankhede#BombayHighCourt#CBI #AryanKhan — Live Law (@LiveLawIndia) May 19, 2023 2017 నుంచి 2021 మధ్య సమీర్ వాంఖడే ఆరుసార్లు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లాడు. ఆ జాబితాలో యూకే, ఐర్లాండ్, పోర్చ్‌గల్, సౌతాఫ్రికా, మాల్దీవ్స్ ఉన్నాయి. దాదాపు 55 రోజులు ఆ ట్రిపుల్లో గడిపాడు. ఆ పర్యటనల కోసం కేవలం రూ.8 లక్షల 75 వేలు మాత్రమే ఖర్చు చేశానని నివేదించాడాయన. కానీ, ఆ ఖర్చు విమాన ప్రయాణాలకే సరిపోతుందని అధికారులు అంటున్నారు. ఇక సమీర్ వాంఖడే ఆస్తులకు సంబంధించి కూడా విస్తూపోయే విషయాల్ని వెల్లడించింది ఎన్సీబీ రిపోర్ట్. సమీర్, ఆయన భార్య ఇద్దరి ఆదాయం కలిపి ఏడాదికి 45 లక్షల రూపాయలుగా ఐటీ రిటర్న్స్‌లో చూపించారు. కానీ, చేతికి 17 లక్షల రూపాయలకు తక్కువకాని ఓ రోలెక్స్ వాచీతో పాటు ముంబైలో కోట్లు ఖరీదు చేసే నాలుగు ప్లాట్లు, అలాగే.. వాసిం ఏరియాలో 41 వేల ఎకరాల జాగా ఆయన పేరు మీద ఉన్నట్లు తెలిపింది. ఇక కొత్తగా 82 లక్షల రూపాయలకు మరో ప్లాట్‌ను కొన్నారాయన. అయితే.. గోరేగావ్‌లో ఉన్న ఆ ప్లాట్ విలువ రూ.2.45 కోట్లుగా అధికారులు తేల్చారు. ఇవేకాదు.. పెళ్లికి ముందు కోటికి పైగా విలువ చేసే ఓ ప్లాట్‌ను సమీర్ ఖరీదు చేశాడు. అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి సమీర్ లెక్కలు చూపించలేదని సీబీఐ అంటోంది. Acceptance, tolerance, bravery, compassion. These are the things my mom taught me. The words of my mother echo constantly that my son is equal to thousands. Such inspiration lifts my spirit to epitome for each end every challenge and struggle…#MothersDay #SameerWankhede pic.twitter.com/pteBReu5bf — Sameer Wankhede (@swankhede_IRS) May 14, 2023 సెలబ్రిటీ పేరు వింటే.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ముంబై విభాగం) మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై స్థానిక మోడల్ మున్మున్ దామెచా సంచలన ఆరోపణలు చేశారు. కార్డిలియా డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి.. బెయిల్ మీద బయట ఉన్నారామె. ‘‘సమీర్‌కు పబ్లిసిటీ పిచ్చి. సెలబ్రిటీ అని తెలిస్తే చాలూ.. వాళ్లను ఏదో ఒకరకంగా జైలుకు పంపించేవాళ్లు. అలా మీడియాలో నానడం ఆయనకు ఇష్టం. అందుకే మోడల్స్‌ను, సెలబ్రిటీలను ఆయన టార్గెట్‌గా చేసుకునేవాళ్లు. ఈ కేసులో అన్యాయంగా నన్ను ఇరికించారాయన. తొలుత నాకేం కాదని ధైర్యం చెప్పే యత్నం చేశారు. ఆపై తాను ఒక మోడల్ అని తెలియగానే.. అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కస్టడీలో ఉన్నప్పుడు కూడా తనను మానసికంగా వేధించారని తెలిపారామె. ఎన్సీబీ విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం.. ముంబైలో కార్డిలియా క్రూయిజ్ మీద దాడి జరిగాక.. ఆర్యన్ ఖాన్‌తో పాటు అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ పేర్లను చివరి నిమిషంలో సమీర్ టీం యాడ్ చేసింది. 2021, అక్టోబర్ 3వ తేదీన ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసింది. అలాగే.. రోలింగ్ పేపర్‌తో పట్టుబడ్డ ఓ యువతిని మాత్రం వదిలేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఆర్యన్ ఖాన్ కస్టడీ విషయంలో సమీర్ వాంఖడే వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిచ్చింది.అలాగే.. ఆర్యన్‌ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చిన వ్యవహారానికి సంబంధించి తేడాలు కనిపిస్తున్నాయి అని ఎన్సీబీ విజిలెన్స్ నివేదిక వెల్లడించింది. BREAKING : WhatsApp chats between Sameer Wankhede & Shahrukh Khan leaked. Chats from the time when Shahrukh Khan's son was in jail in connection with Cordelia cruise drug case. In the chats, Shahrukh Khan tells Sameer Wankhede: 'You promised you will reform my child and not… pic.twitter.com/sLUcDb2guX — Jan Ki Baat (@jankibaat1) May 19, 2023 సమీర్‌కు ఊరట ఇదిలా ఉంటే సీబీఐ తనపై అరెస్ట్ సహా ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా ఆదేశించాలని కోరుతూ సమీర్ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసు తనపై ప్రతీకార చర్యగానే ఉందంటూ పిటిషన్లో పేర్కొన్నారాయన. ఈ క్రమంలో.. ఆయనకు ఊరట లభించింది. సోమవారం(22, మే) దాకా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని శుక్రవారం ఆదేశించింది బాంబే హైకోర్టు. గురువారం ఆయన సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన మాత్రం గైర్హాజరు అయ్యారు. మరోవైపు.. ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ సింగ్ తనను కులం పేరుతో దూషించారని, వేధింపులకు గురి చేశారని సమీర్ వాంఖడే ఆరోపిస్తున్నారు. ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసు నుంచి బయటపడేసేందుకే జ్ఞానేశ్వర్ తనపై సీబీఐను ప్రయోగించారంటూ సంచలన ఆరోపణలు చేశారు కూడా.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019