breaking news
-
Politics title check 911
Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911Politics title check 911v -
Invalidation article updation 2
Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Lorem ipsum Garvit sharma -
Politics Title
Politics (from Ancient Greek πολιτικά (politiká) 'affairs of the cities') is the set of activities that are associated with making decisions in groups, or other forms of power relations among individuals, such as the distribution of resources or status. -
మేం 10 సీట్లు గెలిస్తే పాలిటిక్స్‌లో మార్పులు: కేటీఆర్
అలంపూర్: కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని సంకల్పిస్తే, దురదృష్టవశాత్తు 39 సీట్లలోనే గెలిచామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 14 సీట్లలో వెయ్యి, రెండు, నాలుగు వేల తేడాతో ఓడిపోయామని, ఆ 14 సీట్లు గెలిచి ఉంటే మన దే ప్రభుత్వం ఉండేదని చెప్పారు. లేదా వాటిలో ఆరు సీట్లు గెలిచినా ప్రధాన పాత్ర పోషించేవారమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 10 సీట్లు గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్కు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో, అలంపూర్ చౌరస్తాలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘సీక్వెల్ సినిమాల తరహాలో పార్లమెంట్ ఎన్నికల కోసం సీఎం రేవంత్‌రెడ్డి సీక్వెల్ మోసంతో రెడీగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి మోసం పార్టు–1లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. మీలో ఎవరైనా రుణాలు తీసుకోని వారు ఉంటే పరుగు పరుగునపోయి లోన్లు తీసుకోండి.. అని చెప్పిన ఆయన మే 9 వస్తున్నా రుణమాఫీ చేయలేదు. మోసం పార్ట్–2లో పార్లమెంట్ ఎన్నికల కోసం ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని చెబుతున్నారు’ అని కేటీఆర్ అన్నారు. అంతకుముందు కేటీఆర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అవన్నీ ఇచ్చి మాట్లాడు.. ‘మొగోడివైతే ఒక్క సీటు గెలవమని మన పార్టీ గురించి మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి భాషలోనే అడుగుతున్నా... నీవు మొగోనివైతే రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు. మొగోడివైతే కోటీ 67 లక్షల ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇవ్వు. కేసీఆర్ ఒకరికే ఇస్తున్నాడు నేను ముసలవ్వకి ముసలాయనికి ఇద్దరికీ రూ.4వేలు ఇస్తానని చెప్పావు కదా.. మొగోడివైతే 46 లక్షల మందికి ఆసరా పింఛన్ ఇచ్చి మాట్లాడు’ అని కేటీఆర్ అన్నారు. మొన్న మహబూబ్‌నగర్‌కు వచ్చి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నానని ఒక సీఎం మాట్లాడని మాటలు రేవంత్ మాట్లాడారని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘సూర్యాపేటలో రష్ ఉన్న బస్సులో ఓ వ్యక్తి దొంగతనానికి ప్రయత్నిస్తుండగా.. ప్రయాణికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు జేబులు వెతికితే కత్తెర దొరికిందని అడిగితే.. సీఎం రేవంత్‌రెడ్డి కూడా కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయను పట్టుకోండి సార్ అని చెప్పారు’ అని చమత్కరించారు. బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికేమీ లేదు.. బీజేపీ వాళ్లు అక్కడక్కడ ఎగురుతున్నారని, పదేళ్లలో రాష్ట్రానికి మోదీ చేసిందేమి లేదని కేటీఆర్ అన్నారు. బీజేపీ వాళ్లు చెప్పుకోవడానికి ఏవీలేదని, అందుకే జైశ్రీరాం అంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. శ్రీరాముడు బీజేపీకి ఒక్కడే దేవుడు కాదని.. ఆయన అందరి వాడన్నారు. దేవుళ్ల పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మి మోసపోవద్దు: కేటీఆర్ రాజేంద్రనగర్ (హైదరాబాద్): బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం రాజేంద్రనగర్‌లో చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకొని ముందుకొస్తోందని... కాంగ్రెస్ దొంగ హమీలతో ప్రజలను మోసం చేసేందుకు మరోసారి వచ్చిందన్నారు. రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించాలని గట్టిగా నమ్మే వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. అందుకే చేవెళ్ల పార్లమెంటులో మొదటిసారిగా బడుగు, బలహీన వర్గానికి చెందిన వ్యక్తికి కేసీఆర్ టికెట్ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాందీ, మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, ఆనంద్ పాల్గొన్నారు. రేవంత్ నిజం చెప్పారు సాక్షి, వరంగల్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి గద్దెనెక్కిండు రేవంత్... అయితే తప్పు రేవంత్‌రెడ్డిది కాదు... ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా, నిజాయితీగా చెప్పిండు ఎన్నికలకు ముందు టీవీ చర్చా వేదికల్లో. ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారు... ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు... అందుకే మేం మోసం చేస్తాం అని చెప్పారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వరంగల్, హనుమకొండలో మంగళవారం జరిగిన వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. తప్పు ఎవరిదన్నా ఉందంటే మనదే తప్ప ఇంకెవరిదీ కాదన్నారు. -
అడుగడుగునా నీరా‘జనం’
(‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): మరోసారి చరిత్ర సృష్టించేందుకు చారిత్రక విజయనగరం జననేత జగనన్నకు అఖండ స్వాగతం పలికింది. అడుగడుగునా ప్రజలు జననీరాజనాలు పలికారు. ఉత్తరాంధ్ర కళారూపాలైన చెక్క భజనలు, కోలాటాలతో తమ అభిమాన నేతను అక్కున చేర్చుకున్నారు. విశాఖలోని ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద అభిమానుల కోలాహలం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభమైంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో 21వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఎండాడ నుంచి విజయనగరం వరకు సాగింది. దారిలో అడుగడుగునా అభిమానులు వెంటరాగా సీఎం జగన్ బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్ స్టేడియం, పీఎం పాలెం మీదుగా సాగిన యాత్ర జాతీయ రహదారి మొత్తం అభిమానులతో నిండిపోయింది. కొత్తవలస మండలంలోని చీడివలస గ్రామానికి చెందిన చెక్కభజన బృందంలోని అక్కచెల్లెమ్మలు జగన్ కోసం తరలివచ్చారు. ఎండాడ నుంచి కార్‌షెడ్ జంక్షన్, మధురవాడ, కొమ్మాది, పరదేశీపాలెం, గంభీరం, తాళ్లవలస వరకు వెంటనడిచారు. దారిపొడవునా అక్కచెల్లెమ్మల హారతులు, మహిళల కోలాటాలు, యువకుల తీన్మార్ డ్యాన్సులతో వారంతా సీఎం జగన్ యాత్ర వెంట అడుగులు వేశారు. జగన్ సైన్యంతో జాతీయ రహదారి కిటకిట.. ఇక ఉదయం పీఎంపాలెం వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్రలో పాల్గొనేందుకు అప్పటికే ఆయన రాకకోసం పెద్దఎత్తున మహిళలు, పిల్లలతో పాటు ఆటోడ్రైవర్లు తరలివచ్చారు. జగన్ బస్సుపై నుంచి అభివాదం చేయగానే ఆ ప్రాంతమంతా జగన్నినాదాలతో మార్మోగింది. వైఎస్సార్ స్టేడియం నుంచి మొదలైన జనప్రవాహం కొమ్మాది, మారికవలస మీదుగా ఆనందపురం జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ వేచి ఉన్న అక్కచెల్లెమ్మలు జగనన్నకు ఘనస్వాగతం పలికారు. జగన్‌ను దూరం నుంచి చూసిన అపార్ట్మెంట్లలోని మహిళలు, విద్యార్థులు సైతం బాల్కనీల్లో హుషారుగా కేరింతలు కొట్టారు. ‘గత ప్రభుత్వంలో ఏ చిన్న పనికావాలన్నా జన్మభూమి కమిటీల ద్వారా స్థానిక టీడీపీ నేతలను కలవాల్సి వచ్చేది. వారు అడిగింది ముట్టజెప్పినా, ఇష్టం లేకపోతే నెలల తరబడి తిప్పించుకునే వారు’ అని మహిళలు నాటి పీడకలలను గుర్తుచేసుకున్నారు. జగనన్న తీసుకొచ్చిన వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలతో ఇంటికే వచ్చి మీకేం అవసరమో చెప్పాలని అడిగి మరీ చేస్తున్నారని నేటి పరిస్థితులను వివరించారు. ఇది సామాన్యుల ప్రభుత్వమని, తామంతా ఆనందంగా ఉన్నామని జనం ముక్తకంఠంతో చెప్పారు. ఇక యాత్రలో భాగంగా సీఎం జగన్ ఆనందపురం జంక్షన్‌లోని చెన్నాస్ కన్వెన్షన్‌లో సోషల్ మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. అనంతరం.. మోదవలస జంక్షన్ మీదుగా విజయనగరం జిల్లాలో యాత్ర కొనసాగింది. జిల్లా నాయకులు, జగన్ అభిమానులతో మోదవల కూడలి జనసందోహంతో నిండిపోయింది. యువకులు ర్యాలీగా వెంటరాగా, మ.2 గంటలకు జొన్నాడ సమీపంలో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకున్నారు. అనంతరం సా.5 గంటలకు జొన్నాడ నుంచి చెల్లూరు వరకు ర్యాలీగా వచ్చి అక్కడ అశేష జనావాహినితో నిండిపోయిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఈ బహిరంగ సభకు విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగులు సీఎం జగన్‌కు మద్దుతుగా మూడు చక్రాల మోటార్ సైకిళ్లపై పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్ సీఎం అయ్యాకే తమ భవిష్యత్తు బాగుందని ఎంతో సంతోషంతో చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోకి బస్సుయాత్ర.. సభ అనంతరం సీఎం జగన్ చింతలవలస మీదుగా విజయనగరం జిల్లా సరిహద్దు గ్రామం కొప్పెర్ల చేరుకున్నారు. అప్పటికే చీకటి పడినా జగన్ కోసం పెద్దఎత్తున అభిమానులు అక్కడే ఉండి తమ ప్రియతమ నేతకు భారీ పూలదండలతో శ్రీకాకుళం జిల్లాలోకి ఆహ్వానించారు. కిక్కిరిసిన జన సందోహం మధ్య జగన్ అభివాదం చేస్తూ సవరవిల్లి, భోగాపురం మీదుగా రణస్థలం చేరుకున్నారు. అక్కడ ప్రజలు, నాయMý ులు రహదారిపై బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి జన సంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి అక్కివలస సమీపంలోని రాత్రి బసకు జగన్ చేరుకున్నారు. వైఎస్సార్సీపీలోకి బీజేపీ నేతలు ఎండాడ నైట్ క్యాంపులో ఎస్.కోట, గాజువాక, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, భీమిలి నియోజకవర్గ అభ్యర్థులతో పాటు ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్‌ను కలిశారు. వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పార్టీ కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇందులో బీజేపీ గాజువాక నియోజకవర్గం నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాశరావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవిందు, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి,సంపత్‌కుమార్ ఉన్నారు. వీరితోపాటు విశాఖ ఉత్తరం నుంచి జనసేన నాయకురాలు దివ్యలత, బీజేపీ నుంచి హేమాంబర్, వ్యాపారవేత్త షేక్ సలీమ్, షేక్ హుస్సేన్ బాషా తదితరులున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019