
విశ్వక్రీడల్లో భారత బాక్సర్లకు నిరాశ ఎదురైంది

ఆరుగురు బాక్సర్లతో పారిస్‌లో అడుగు పెట్టిన భారత బృందం.. రిక్త హస్తాలతో తిరిగి రానుంది

2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బొర్గోహైన్ ఈసారి ఆకట్టుకోలేకపోయింది

ఆదివారం జరిగిన మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ లవ్లీనా 1–4తో లీ కియాన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది

బౌట్ ప్రారంభం నుంచే చైనా బాక్సర్ లెఫ్ట్ హుక్స్‌తో విరుచుకుపడగా.. వాటిని తప్పించుకుంటూ లవ్లీనా కొన్ని మంచి పంచ్‌లు విసిరింది

అయినా తొలి రౌండ్ కియాన్‌కు అనుకూలంగా ఫలితం వచి్చంది. ఆ తర్వాత లవ్లీనా పుంజుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది

పంచ్‌ల ధాటి నుంచి నేర్పుగా తప్పించుకున్న కియాన్... కీలక సమయాల్లో జాబ్స్, హుక్స్‌తో పైచేయి సాధించింది

భారత్ నుంచి పారిస్ క్రీడలకు ఆరుగురు బాక్సర్లు అర్హత సాధించగా.. అందరూ క్వార్టర్ ఫైనల్లోపే పరాజయం పాలయ్యారు



