
వాంఖెడే మైదానంలో 12 సంవత్సరాల తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మెరిసింది.

2012లో చివరిసారిగా ఈ వేదికపై ముంబై ఇండియన్స్ జట్టును ఓడించిన కోల్‌కతా ఇప్పుడు మళ్లీ గెలుపు బావుటా ఎగురవేసింది.

శుక్రవారం జరిగిన ఈ పోరులో కేకేఆర్ 24 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది.

వెంకటేశ్ అయ్యర్ (52 బంతుల్లో 70; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... మనీశ్ పాండే (31 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.

అనంతరం ముంబై 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది.

సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, కోల్‌కతా పేసర్ స్టార్క్‌కు 4 వికెట్లు దక్కాయి.























