
అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా నిప్పులు చెరిగే బంతులతో మరోసారి లక్నో పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ హడలెత్తించాడు

వేగానికితోడు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ఐపీఎల్ టోర్నీ లో లక్నో జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించాడు

మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో గెలిచింది








































