1/13
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్. న్యాయ వ్యవస్థ విశేషాధికారాలను పరిరక్షిస్తూ.. సంచలన తీర్పులకు నెలవుగా సర్వోన్నత న్యాయస్థానాన్ని మార్చడంతో ఈయనకంటూ ఓ గుర్తింపు దక్కింది.
2/13
తండ్రికి తగ్గ తనయుడు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ విష్ణు(YV) చంద్రచూడ్ తనయుడే ఈ డీవై చంద్రచూడ్. 1959 నవంబరు 11న బాంబేలో జన్మించిన జస్టిస్ చంద్రచూడ్.. న్యాయ రంగంలో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటిదాకా.. సుదీర్ఘకాలం( 7 ఏళ్ల అయిదు నెలలపాటు) సీజేఐగా పని చేసిన ఘనత వైవీ చంద్రచూడ్‌ది.
3/13
బాధితుల న్యాయం కోసం.. డీవై చంద్రచూడ్‌కు.. న్యాయవాదిగా ఉన్నప్పటి నుంచి సామాజిక అంశాలపై సూక్ష్మదృష్టిసారించిన వ్యక్తిగా పేరుంది. మహిళలు, అల్పసంఖ్యాకుల పక్షాన వాదనలు వినిపించేవారు. హెచ్‌ఐవీ-ఎయిడ్స్ సోకిన కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఓ కార్మికుడి తరఫున 1997లో ఆయన వాదించి బాధితుడికి న్యాయం దక్కేలా చేశారు. వెట్టిచాకిరిలో కూరుకుపోయిన మహిళలు, మత, భాషాపరమైన అల్పసంఖ్యాకుల హక్కుల కోసమూ ఆయన న్యాయస్థానాల్లో వాదనలు వినిపించి బాధితుల పక్షాన నిలిచారు.
4/13
విద్యా మేధావిగానూ.. ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనమిక్స్‌లో బీఏ, దిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్‌లో ఎల్‌ఎల్‌బీ చేశారు. అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్‌లో 1983లో స్కాలర్‌షిప్ మీద ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ చేశారు. అక్కడ అత్యధికమార్కులు సాధించి జోసెఫ్ హెచ్.బీలె ప్రైజ్ దక్కించుకున్నారు. జ్యుడిషియల్‌సైన్సెస్‌లో డాక్టరేట్ పూర్తిచేసే వరకు(1986) అదే యూనివర్సిటీలో ఉన్నారు. ముంబయి యూనివర్సిటీ, అమెరికాలోని ఒక్లహామా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో విజిటింగ్ ప్రొఫెసర్‌గానూ సేవలందించారు.
5/13
చిన్నవయసులో సీనియర్ అడ్వొకేట్‌గా.. మహారాష్ట్ర బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 38 ఏళ్ల చిన్నవయస్సులోనే 1998లో సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. తర్వాత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులై 2000 మార్చి 29న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంతవరకూ ఆ పదవిలో కొనసాగారు. 2013 అక్టోబరు 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై బదిలీ అయ్యారు. 2016 మే 13న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
6/13
సుప్రీం న్యాయమూర్తిగా.. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 734 తీర్పుల్లో భాగస్వాములయ్యారు. అందులో 520 దాకా ఆయన సొంతంగా రాశారు. సుప్రీంకోర్టు ఈ-కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనే కోర్టు విచారణలను ప్రత్యక్షప్రసారం చేసే మౌలికవసతులను కల్పించారు. 2022 నవంబర్ 9వ తేదీన సీజేఐగా ప్రమాణం చేశారు. 2024 నవంబర్ 10వరకు ఈయన సీజేఐగా కొనసాగుతారు.
7/13
మంచి మనసుతో దత్తత.. డీవై చంద్రచూడ్ వ్యక్తిగత జీవితం కూడా ఆసక్తికరమే. ఆయన మొదటి భార్య రష్మి. వీళ్లకు ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు అభినవ్ బాంబే హైకోర్టులో ప్రాక్టీస్‌లో ఉన్నాడు. చిన్న కొడుకు చింతన్ ఓ బ్రిటిష్ లా కంపెనీలో పని చేస్తున్నారు. అయితే.. 2007లో రష్మి కేన్సర్‌తో కన్నుమూశారు. దీంతో కల్పనా దాస్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. ఈ జంట మహి(16), ప్రియాంక(20) అనే ఇద్దరు దివ్యాంగులైన పిల్లలను దత్తత తీసుకున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే తన కూతుళ్ల కోరిక మేరకు.. ఆయన వాళ్లను సుప్రీం కోర్టుకు తీసుకొచ్చి తన ఛాంబర్‌ను చూపించారు.
8/13
అంతా ఓపెన్‌గానే.. డీవై చంద్రచూడ్ ముక్కుసూటి మనిషి. న్యాయమూర్తిగా తీర్పులు వెల్లడించే సమయంలోనూ ఆయన అంతే కఠువుగా ఉంటారు. అదే సమయంలో.. తీర్పులిచ్చేప్పుడు కూలంకశంగా వివరణలు కూడా ఇస్తుంటారు. కిందటి ఏడాది.. స్వలింగ సంపర్కుల వివాహాలపై సీజేఐతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం భిన్నమైన తీర్పు వెల్లడించింది. అయితే.. అందులో డీవై చంద్రచూడ్ మాత్రం అనుకూలంగా తీర్పు ఇచ్చారు. సీజేఐగా ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, ఎలక్టోరల్ బాండ్ స్కీం లాంటి కేసుల్లో చర్చనీయాంశమైన తీర్పులను వెలవరించారాయన. ఓ న్యాయమూర్తిగా.. చట్టం, రాజ్యాంగానికి తానో సేవకుడినని ఎప్పటికప్పుడు ప్రకటించుకుంటూ వస్తున్నారు. అలాగే న్యాయస్థానాలకున్న విశిష్టాధికారాల్లో ఎవరి జోక్యాన్ని సహించలేరాయన. న్యాయ వ్యవస్థలని లోటుపాట్లతో పాటు సమాజంలో సమస్యలు, ఆన్‌లైన్ వేధింపులు సహా మరెన్నో సున్నితమైన అంశాలపై బహిరంగంగానే తన అభిప్రాయాల్ని చెప్పేస్తుంటారు.
9/13
ప్యూర్ వెజ్, హిమక్రీం మాత్రం.. మీరు మీ మనసును అదుపులో ఉంచుకుంటే అంతా సజావుగా ఉంటుందని.. సంపూర్ణ జీవనశైలి పాఠం చెబుతారాయన. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ దినచర్య ప్రతిరోజూ తెల్లవారుజామున 3.30 గంటలకు యోగాతో ఆరంభమవుతుంది. ఆపై ఆయుర్వేద ఆహార పద్ధతులను అనుసరిస్తారు. ప్యూజ్‌వెజిటేరియన్ ఈయన. మనం నాలికకు ఏం అందిస్తామనేది మన శరీరం, మనసును నిర్ధేశిస్తుందని తాను నమ్ముతానని, అందుకే మొక్కల ఆధారిత ఆహారం, జీవనశైలి తనకు సరిపడుతుందని చెబుతారు. అయితే ఆయన ఐస్‌క్రీమ్ పియుడట. అందుకే అడపాదడపా ఆ విషయంలో మాత్రం రాజీపడాల్సి వస్తోందని చెబుతున్నారాయన.
10/13
50వ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఫొటోలు
11/13
50వ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఫొటోలు
12/13
50వ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఫొటోలు
13/13
50వ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఫొటోలు