
టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ ఇంట పెళ్లి సంబరాలు జోరందుకున్నాయి.

ఆయన రెండో కూతురు హయవాహినికి విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడు నిషాంత్‌తో పెళ్లి జరిగింది.

రామానాయుడు స్టూడియోలో మార్చి 15న ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు బంధుమిత్రులతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో మండపంలో కార్తీ.. వెంకటేశ్‌కు కరచాలనం చేసిన ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి.

