హీరోయిన్‌ మూడో పెళ్లి.. తెలుగులోనూ నటించింది (ఫోటోలు) | Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

హీరోయిన్‌ మూడో పెళ్లి.. తెలుగులోనూ నటించింది (ఫోటోలు)..

Published Tue, May 28 2024 9:12 PM | Last Updated on

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos1
1/17

హీరోయిన్‌ మీరా వాసుదేవన్‌ పెళ్లిపీటలెక్కింది.

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos2
2/17

ముచ్చటగా మూడోసారి తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. కెమెరామెన్‌ విపిన్‌ పుత్యాంగంతో ఏడడుగులు వేసింది.

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos3
3/17

ఈ శుభవార్తను మీరా సోషల్‌ మీడియా వేదికగా ఆలస్యంగా వెల్లడించింది. ఏప్రిల్‌ 21న కోయంబత్తూరులో పెళ్లయిందని, రిజిస్టర్‌ ప్రక్రియ ఈరోజు పూర్తయిందంటూ శుక్రవారం నాడు వివాహ ఫోటోలు షేర్‌ చేసింది.

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos4
4/17

అలాగే తన భర్త గురించి వివరాలను సైతం పొందుపరిచింది.

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos5
5/17

విపిన్‌ కేరళలోని పాలక్కడ్‌ ప్రాంతానికి చెందినవాడు.

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos6
6/17

ఈయన ఒక సినిమాటోగ్రాఫర్‌. అప్పట్లో అంతర్జాతీయ అవార్డు సైతం గెలుచుకున్నాడు.

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos7
7/17

విపిన్‌, నేను ఒక ప్రాజెక్టు కోసం 2019 మే నుంచి కలిసి పని చేస్తున్నాం. గతేడాదే కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చాం.

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos8
8/17

అలా ఈ ఏడాది ఒక్కటయ్యాం. ఇరు కుటుంబాలు సహా ఇద్దరు ముగ్గురు బంధుమిత్రుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది అని రాసుకొచ్చింది.

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos9
9/17

ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos10
10/17

కాగా మీరా వసుదేవన్‌ 2001లో సీరియల్‌ ద్వారా నటిగా పరిచయమైంది.

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos11
11/17

రెండు మూడు ధారావాహికల్లో కనిపించిన ఆమె గోల్‌మాల్‌ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా మారింది.

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos12
12/17

అంజలి ఐ లవ్‌ యూ అనే చిత్రంలోనూ నటించింది. తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది.

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos13
13/17

ప్రస్తుతం నాలుగు మలయాళ సినిమాలు చేస్తోంది.

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos14
14/17

తన వ్యక్తిగత విషయానికి వస్తే.. మీరా వాసుదేవన్‌ ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ కుమార్‌ తనయుడు విశాల్‌ అగర్వాల్‌ను 2005లో వివాహం చేసుకుంది.

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos15
15/17

పెళ్లయిన ఐదేళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్‌ కొక్కెన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు.

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos16
16/17

తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ బంధం కూడా ముక్కలైంది.

Meera Vasudevan married cinematographer Vipin Puthiyankam Photos17
17/17

2016లో భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి సింగిల్‌ మదర్‌గా ఉంటున్న ఈమె కుడుంబవిలక్కు అనే సీరియల్‌ షూటింగ్‌లో ఆ ధారావాహిక కెమెరామన్‌ విపిన్‌తో ప్రేమలో పడింది. ఆ ప్రేమను ఇప్పుడు పెళ్లి బంధంతో పదిలపర్చుకున్నారు.

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement