
టాలీవుడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ మరికొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కనుంది.

ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్‌ను పెళ్లాడనుంది.

అతడికి ఇదివరకే కవిత అనే మోడల్‌తో పెళ్లవగా కూతురు కూడా పుట్టింది. కానీ తర్వాత విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

ఇప్పుడు నికోలయ్.. వరలక్ష్మిని రెండో పెళ్లి చేసుకోనున్నాడు.

రాధిక-శరత్ కుమార్‌ల కూతురు వరలక్ష్మి వివాహం జూలై 2న థాయ్‌లాండ్‌లో జరగనున్నట్లో ఓ వార్త వైరలవుతోంది.

ఈ క్రమంలో నికోలస్ ఆస్తి గురించి ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం వరలక్ష్మికి కాబోయే భర్తకు రూ.85 కోట్ల ఆస్తులు ఉన్నాయట!

కాగా వరలక్ష్మి.. క్రాక్, నాంది, వీరసింహా రెడ్డి, యశోద, హనుమాన్, కోటబొమ్మాళి పీఎస్ చిత్రాలతో తెలుగులో టాప్ నటిగా ఎదిగింది.

చివరిసారి శబరిలో కనిపించిన ఈమె ప్రస్తుతం కూర్మనాయకి మూవీలో నటిస్తోంది.

ఇంకా పలు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. పెళ్లి తర్వాత కూడా ఆమె నటను కంటిన్యూ చేయనున్నట్లు కనిపిస్తోంది.











