
సోనియా అగర్వాల్.. 1982 మార్చి 28న చండీగఢ్‌లో జననం చండీగఢ్‌లో జన్మించింది.

2002లో ‘నీప్రేమకై’ సినిమాలో చిన్న పాత్రతో నటిగా పరిచయమైంది.

కన్నడ సినిమా ‘చందు’లో కిచ్చా సుదీప్ సరసన హీరోయిన్‌గా నటించింది.

2003లో ‘కాదల్ కొండేన్’ సినిమాతో తమిళంలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాలో నటనకుగానూ ఉత్తమ నటిగా ఇంటర్నేషనల్ తమిళ్ ఫిల్మ్ పురస్కారం అందుకుంది.

ఈ సినిమా డైరెక్టర్ సెల్వరాఘవన్ (ధనుష్ సోదరుడు)తో ప్రేమలో పడింది సోనియా.

ఈ ప్రేమ కథ నడుస్తున్న సమయంలోనే 2004లో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం 7/G బృందావన్ కాలనీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటించింది.

2006లో సెల్వను పెళ్లాడింది.

వివాహం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది.

అయితే అన్నీ అనుకున్నట్లు జరగలేదు. 2010లో వీరు విడాకులు తీసుకున్నారు.

ఆ మరుసటి ఏడాదే వెండితెరకు రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తోంది.





